S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

04/10/2018 - 00:09

పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోవటానికి విపక్షంతో పాటు అధికార పక్షం కూడా బాధ్యత వహించాలి. జా తీయ, ప్రాంతీయ పార్టీల పోటాపోటీ రాజకీయాల వల్లే- నెలరోజుల మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదు. ఒకటి, రెండు బిల్లులను గందరగోళం మధ్య ప్రభుత్వం పాస్ చేయించుకున్నది.

04/03/2018 - 02:05

శతాధిక కాంగ్రెస్ పార్టీలో నేడు సమర్థ నాయకత్వం లేనందునే ఇపుడు తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు తెరమీదికి వస్తున్నాయి. ప్రధాని మో దీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఏర్పడే ఈ ‘ఫ్రంట్’లు బతికి బట్టకట్టగలవా? ఒకప్పుడు రాజీవ్ గాంధీ హ యాంలో కాంగ్రెస్ బలహీనమైనప్పుడు ప్రాంతీయ పార్టీల కూటములు ఏర్పడినా కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి.

03/27/2018 - 01:06

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించాల్సిందే. ఇంతకీ అవిశ్వాస
తీర్మానంపై చర్చకు మోదీ ఎందుకు అంగీకరించటం లేదు? లోక్‌సభలో
భాజపాకు పూర్తి మెజారిటీ ఉంది. తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస
తీర్మానంపై చర్చ జరిగినా ఎన్‌డీఏ ప్రభుత్వానికి వచ్చే నష్టమేదీ లేదు. అవిశ్వాస

03/20/2018 - 01:28

రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు అనేదేదీ ఉండదు. నాయకులు తమ రాజకీయ అవసరాల కోసం కలుస్తుంటారు, విడిపోతుంటారు. జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు జరుగుతున్న కొత్త రాజకీయ సమీకరణరలు ఇందుకు తాజా ఉదాహరణ.

03/13/2018 - 00:08

‘ధర్మో రక్షితి రక్షితః’ అన్నట్లు పార్లమెంటును మనం కాపాడితే మనల్ని పార్లమెంటు కాపాడుతుంది. కానీ, ఈ వాస్తవాన్ని విస్మరించి కొందరు పార్లమెంటు సభ్యులు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ రాజకీయాల కోసం పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులను పెకిలించి వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ రెండో విడత మొదటి వారం సమావేశాలను రాజకీయ కారణాలతో విపక్షం స్తంభింపజేయటం క్షమించరాని నేరం.

03/06/2018 - 00:44

త్రిపురలో పాతికేళ్లుగా అజేయంగా నిలిచిన ‘ఎర్ర’ కోట కుప్పకూలింది. కొంతకాలం క్రితమే అ స్సాంలో అడుగుపెట్టిన భాజపా ఇప్పుడు త్రిపురలో తన పతాకాన్ని ఎగురవేసింది. నాగాలాండ్‌లో మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మేఘాలయలో మెజారిటీ సీట్లు సాధించకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకునేలా భాజపా ఎదగడం ఆషామాషీ కాదు.

02/27/2018 - 00:51

బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వస్తున్న ముస్లింల కారణంగా అసోంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో జనాభా పరిస్థితులు మారిపోతున్నాయంటూ మన ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన హెచ్చరికను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాక్షాత్తూ సైనికదళం అధిపతి ఈ ప్రకటన చేయటం చూస్తుంటే ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా అసోంలో స్థానికుల జనాభాతో పోలిస్తే బంగ్లాదేశీయుల జనాభా బాగా పెరిగిపోయి ఉండాలి.

02/19/2018 - 23:16

పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై ప్రజల డబ్బును దోచుకుంటుంటే- ‘అంతా మీ హయాంలోనే జరిగిందంటే.. మీ హయాంలోనే జరిగిందం’టూ అధికార భాజపా, విపక్ష కాంగ్రెస్ పార్టీలు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవటం సిగ్గుచేటు.

02/13/2018 - 02:18

పార్లమెంటు ఉభయ సభలు రౌడీ రాజకీయానికి గురికావడం సిగ్గుచేటు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించటంతో జనవరి 29న ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి విడత భేటీ శుక్రవారం వరకు జరిగింది. బడ్జెట్ మలివిడత సమావేశాలు మార్చి ఐదు నుండి ఏప్రిల్ ఆరో తేదీ వరకు జరుగుతాయి. ఉభయ సభల్లో తొలి విడత సమావేశాలు ఐదు రోజులూ గందరగోళంలో జరిగాయి.

02/06/2018 - 00:33

లోక్‌సభ సహా ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందు పెట్టుకుని ‘జనాకర్షక’ స్కీమ్‌లకు బదులు ప్రజలకు మేలు చేసే బడ్జెట్‌ను ప్రతిపాదించటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివేకంతో వ్యవహరించారని చెప్పకతప్పదు. ఈనెల ఒకటో తేదీన లోక్‌సభలో జైట్లీ సమర్పించిన 2018-19 వార్షిక బడ్టెట్‌లో వాస్తవ పరిస్థితులకు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం.

Pages