S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/20/2017 - 21:31

తెలంగాణలో షెడ్యూల్డు కులాలు, తెగలకు చెందినవారిలో సామాజిక చైతన్యం రావలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయంగా ఎదగవలసిన ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు రిజర్వేషన్లపై ఆధారపడటం సరికాదు. వారికి కేటాయించిన వివిధ స్థానాల నుంచి పోటీ చేయడంపైనే దృష్టి సారిస్తున్నవారు మేలుకోవలసిన సమయం ఇది. జనరల్ సీట్లలో ఎవరైనా పోటీ చేయవచ్చు.

12/20/2017 - 21:30

విద్యాసంస్థలు, తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గూడురులో నారాయణ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అలాంటిదే.

12/20/2017 - 21:30

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలు మాతృభాషకు పట్టం కట్టాయనే చెప్పాలి. శాంతియుత, సామరస్య వాతావరణంలో సభలు విజయవంతం అవడం తెలుగువారికి గర్వకారణం. ఏదో మొక్కుబడిగా సభలు నిర్వహించి ఊరుకోవడం కాకుండా మునుముందు కూడా ఏటా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం ఆయన దీక్షను చాటుతోంది.

12/20/2017 - 01:15

గుజరాత్ ఎన్నికల్లో గట్టిపోటీనిచ్చిన రాహుల్‌గాంధీకి అక్కడ సాధించిన ఫలితాలు ఓదార్పునిచ్చేవే. గెలవలేదన్న విషయం పక్కనపెట్టినా వచ్చిన స్థానాలు చెప్పుకోదగ్గరీతిలోనే ఉన్నాయి. ఇది రాహుల్‌కు, కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్నిచ్చే పరిణామం. గుజరాత్, హిమాచల్ శాసనసభ ఎన్నికల్లో బిజెపి గెలుపు పూర్తిగా మోదీ ఖాతాలోకే వేయాలి.

12/19/2017 - 01:15

ప్రపంచ మహాసభలకు భాగ్యనగరం వేదిక కావడం కొత్త శోభనిచ్చింది. తెలుగుభాషకు పుట్టినిల్లు తెలంగాణయేనని, ఈ ప్రాంతానికి చెందినవారు తెలుగుకు వెలుగు తెచ్చారని తెలిసి ఆనందం కలిగింది. ఈ సభల ద్వారా తెలుగు వైభవమేమిటో, మన మాతృభాషను ఎందుకు కాపాడుకోవాలో అర్థమైంది. ఇప్పుడు యువత తెలుగు భాషపై మమకారాన్ని పెంచుకుని పట్టు సాధించేందుకు కృషి చేయాలి. తెలుగుభాషను నేర్పే విషయంలో తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి.

12/18/2017 - 00:51

జనవరి 3 నుండి 7 వరకు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ‘ఆలిండియా సైన్స్ కాంగ్రెస్’ ఈసారి చారిత్రాత్మక ‘ఉస్మానియా యూనివర్సిటీ’ వేదిక కాబోతున్న తరుణంలో అధికారులు యూనివర్సిటీలో తాజా పరిస్థితుల వల్ల వేదిక హెచ్‌ఐసిసి కి మార్చాలనుకోవటం సరికాదు. దేశంలో ఒక్కో ఏడాది ఒక్కో యూనివర్సిటీలో భారత సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తారు. దేశంలో వివిధ యూనివర్సిటీల నుండి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరవుతారు.

12/16/2017 - 00:40

చట్టసభల్లో కొలువుతీరిన సభ్యులకు సంబంధించిన నేర విచారణలని త్వరితగతిన పూర్తి చెయ్యడానికి కేంద్రప్రభుత్వం 12 ప్రత్యేక కోర్టుల్ని నెలకొల్పడానికి ముందుకు రావడం, ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం ఒక మంచి పరిణామం. నేరమయ రాజకీయాలను నిరుత్సాహ పరిచే మార్పు. 2014 ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ శాసనసభల్లో, పార్లమెంటులో నేరారోపితులు 1581 మంది.

12/13/2017 - 22:20

పొరుగు దేశం చైనా మనతో అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ దేశం పట్ల మన వైఖరి కఠినంగానే ఉండాలి. ప్రజల్లోనూ మార్పు రావాలి. చైనా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మన వ్యాపారులను, ప్రజలను అవి దెబ్బతీస్తున్నాయి. చౌక గా దొరుకుతున్నాయన్న స్వార్థంతో చైనా వస్తువులపట్ల ఆకర్షితులయితే మనల్ని మనం దెబ్బతీసుకుంటున్నట్లే అవుతుంది.

12/13/2017 - 22:19

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. దోమలవల్ల మలేరియా, డెంగ్యూ జ్వరాలు విస్తరిస్తున్నాయి. పారిశుద్ధ్యం నిర్వహణ సరిగ్గా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం దీనికి కారణం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో విషజ్వరాలతో ప్రజలు సతమతమవుతున్నారు.

12/13/2017 - 22:19

భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రోహిత్‌శర్మ మరోసారి తన ప్రతిభను చాటాడు. అంతర్జాతీయ వనే్డల్లో ఇప్పటివరకు మూడు డబుల్ సెంచరీలు చేసి తన ప్రత్యేకతను చాటుకొన్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన వనే్డలో మూడో డబుల్ సెంచరీ చేయడం విశేషం. కెరీర్ ప్రారంభించిన కొత్తలో తరచూ విఫలమయ్యే రోహిత్‌ను క్రికెట్ అభిమానులు మద్దతుగా నిలిచి ప్రోత్సహించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలికూడా అతడికి సరైన అవకాశాలు ఇచ్చింది.

Pages