S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/13/2017 - 22:18

ఇంధనం పొదుపు ద్వారా కాలుష్యాన్ని నివారించడం అందరి బాధ్యత. ఆర్థిక రంగంలో సరళీకరణ విధానాలు అమలు చేశాక ఇంధన వినియోగం బాగా పెరిగిపోయింది. డిమాండ్, సప్లయి మధ్య సమన్వయం కోసం ఎన్నో వ్యూహాలతో సరికొత్త విధానాలు అమలు చేయవలసి వచ్చింది. సహజంగా దొరికే ఇంధన వనరులు తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయాల అవసరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన పొదుపు ఆవశ్యకత అందరికీ తెలియాల్సిన అవసరం ఏర్పడింది.

12/12/2017 - 23:40

వస్తుసేవల పన్ను పరిధిలోకి పెట్రోలు, డీజిల్ తీసుకు రావలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిధిలోకి రానందువల్ల పన్నుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇది ప్రజలపై భారం పడటానికి కారణమైంది. ఒకవేళ వాటిని జిఎస్‌టి పరిధిలోకి తీసుకువస్తే ధరలు తగ్గి ప్రైవేటు సంస్థల యాజమాన్యాలకు లాభాలు తగ్గుతాయని లోపాయికారీగా వాటిని జిఎస్‌టి నుంచి తప్పించారా అన్నది సందేహంగా మారింది.

12/12/2017 - 01:04

జంట నగరాలలో మళ్లీ నగదు కష్టాలు మొదలయ్యాయి. చాలా ఏటీఎం కేంద్రాలలో నగదు రావ డం లేదు. ఆధార్ అనుసంధానం చేయకపోవడం వంటి కారణాలతో కొన్ని కేంద్రాలు పనిచేయడం లేదు. మరికొన్ని ఏటీఎంలలో నగదు లేకపోవడం మరో సమస్య. మొత్తంమీద మెజారిటీ ఏటీఎంలలో నాలుగైదు రోజులుగా నగదు లభ్యం కావడం లేదు. ఎందువల్ల అలా జరుగుతున్నదో ఎవరూ చెప్పడం లేదు.

12/11/2017 - 02:02

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న మహిళాసంఘాలలోని నిరుపేద మహిళలకు సహాయంగా రూ.25 వేల రూపాయలను అందించాలని తెలంగాణ స్ర్తినిధి బ్యాంక్ మేనేజింగ్ కమిటీ నిర్ణయించడం అభినందనీయం. ఒక సామాజిక పథకం ద్వారా ఇలా సహాయం అందించనున్నారు. ఇది లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఎంతో ఆదుకుంటుంది. అయితే ఈ పథకం ద్వారా లబ్దిపొందాల్సిన పేదలకు సరైన అవగాహన ఉండదు.

12/09/2017 - 00:55

నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నల్లకుబేరుల పనిపడతామని ఎన్నో ప్రకటనలు చేశారు. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి సంస్కరణలు అమలు చేశారు. బ్లాక్‌మనీ వ్యవహారంలో సాధించినది చాలా తక్కువ. లక్షలకోట్ల రూపాయలు దేశం దాటి నల్లకుబేరుల ఖాతాల్లోకి చేరిపోయాయి. ఆ మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తామన్న మోదీ ప్రభుత్వం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

12/08/2017 - 00:23

సామాజిక స్మగ్లర్లు కోమట్లు అన్న పుస్తకం రాసిన ఐలయ్య వాదం ఎంత అసమంజసమో సోదాహరణంగా వివరిస్తూ అక్కిరాజు రమాపతి రావు గారు రాసిన వ్యాసాలు రచయితకు కనువిప్పు కలిగించేవిగా ఉన్నాయి. సాముదాయికంగా ఒక వర్గాన్ని నిందించడంలో అర్థం లేదు. మంచివారు, చెడ్డవారు అన్ని కులాలు, మతాలు, వర్గాల్లో ఉన్నారు. అందర్నీ ఒకేగాటన కట్టి విమర్శించడం సరికాదు.

12/06/2017 - 21:48

అన్ని వ్యవహారాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలనడం సరికాదు. వ్యక్తిగత గోప్యతకు ఇది భంగకరం. ఇప్పటికే చాలాసార్లు చాలామందికి చెందిన ఆధార్ సమాచారాన్ని కొన్ని సంస్థలు లీక్ చేశాయి. ఈ విషయంలో కేంద్రం స్పందన సరిగా లేదు. ఆర్థిక అక్రమాలను, నల్ల కుబేరులను పట్టుకోవడానికి చట్టాలలలో సవాలక్ష మార్గాలున్నాయి. కేవలం ఆధార్ వల్లే అది సాధ్యపడుతుందని భావించడంలో అర్ధం లేదు.

12/06/2017 - 21:47

ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ ఇన్నాళ్లు అమ్మకూచి. అధికారం చేతిలో ఉన్నా ఎవరికీ జవాబు చెప్పాల్సిన పూచీ లేదు. పేచీ లేదు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ప్రజల్లోకి వచ్చి తనకు తోచినది చెప్పాడు. అధికారం విషంతో సమానమని, తమ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెత్త అన్నా, మధ్యమధ్యలో సెలవులు పెట్టినా సెల్ఫ్‌గోల్ స్టేట్‌మెంట్లు ఇచ్చినా చెల్లిపోయింది. పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే జయాపజయాలకు బాధ్యతవహించారు.

12/06/2017 - 00:59

పార్లమెంటు శీతాకాల సమావేశాలను పది రోజులకు కుదించడాన్ని కాంగ్రెస్ విమర్శించడంలో సహేతుకత లేదు. పార్లమెంటు నుంచి ప్రధాని మోదీ పారిపోతున్నారని, అది అహంకార ధోరణి అని సోనియా ఆగ్రహించడంలో అర్ధమే లేదు. చిన్న చిన్న విషయాలకే పార్లమెంటులో రభస సృష్టించి చర్చ జరగకుండా వాయిదాలు వేయించే కాంగ్రెస్ ఇలా విమర్శించడం హాస్యాస్పదం.

12/04/2017 - 23:57

కొన్ని అణగారిన వర్గాలకు రాజకీయ అవకాశాలు అందివ్వడానికి రిజర్వేషన్లను ప్రవేశపెట్టిన రాజ్యాంగ నిర్మాతలు బహుశా ఊహించి ఉండరు రానురాను రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం రిజర్వేషన్లు కల్పించే రోజులొస్తాయని. ప్రస్తుతం ఏపీలో మంత్రివర్గం ఒక్క రోజులోనే బీసీ,ఎస్టీల్లో ఒక్కో కులాన్ని చేరుస్తూ తీర్మానించి, మరి కొన్ని కులాలలకు ముందుముందు ఎస్సీ హోదా ఇస్తామని ప్రకటించడం నిఖార్సయిన రాజకీయ చర్య.

Pages