S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

11/15/2017 - 22:05

నిత్యావసర సరుకుల పంపిణీలో డీలర్లు అవకతవకలకు పాల్పడుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకులకు చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు. తూకంలో మోసం జరుగుతోంది. డీలర్‌షాపులు తెరిచే సమయాలు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నాయి. వినియోగదారులతో మాట్లాడే తీరుకూడా అభ్యంతరకరంగా ఉంటోంది. దీనికి బదులు ఆయా వస్తువుల విలువ ప్రకారం ప్రభుత్వం వినియోగదారుని అకౌంట్‌లో నగదు జమచేసేలా చర్యలు తీసుకుంటే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.

11/15/2017 - 02:34

కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలను నియంత్రించే కఠిన విద్యావిధానం అమలు చేయాల్సిన రెండు తెలుగు ప్రభుత్వాలపై ఉంది. మార్కులు, ర్యాంకుల విధానం విద్యార్థినీవిద్యార్థుల ఉసురుతీస్తోంది. చిన్నారులను మనుషుల్లా చూడకుండా యంత్రాల్లా పరిగణిస్తూ, వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్న కార్పొరేట్ విద్యావిధానం చాలా నష్టాలు కలిగిస్తోంది. కేవలం ఇంజనీరింగ్, వైద్య విద్యపై మక్కువతోనే ప్రాణాలమీదకు తెస్తున్నారు.

11/13/2017 - 00:20

తూర్పుగోదావరిలోని కోనసీమ ప్రాంతంలోని కోటిపల్లి-రత్నగిరి (అన్నవరం) మధ్య పాసింజర్ రైలు నడిపితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. కాకినాడ పోర్టు ఎగువ, దిగువ పాసింజర్ రైళ్లు శుభయాత్రలో భాగంగా నడిపితే ప్రయాణికుల కష్టాలు తీరుతాయి. ప్రస్తుతం కాకినాడ-కోటిపల్లి రైలు మంగళవారం తప్ప అన్ని రోజుల్లో ఒక పర్యాయం, ఎగువ దిగువ రాకపోకలు సాగిస్తోంది. వేలాదిమంది భక్తులు కోటిపల్లి, అన్నవరం క్షేత్రాలకు వస్తూంటారు.

11/10/2017 - 23:26

ఉభయ తెలుగు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలలో ఏకోపాధ్యాయ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడివల్ల న్యాయం జరగదు. అన్ని తరగతులకు, అన్ని సబ్జెక్టులను చెప్పడం ఒకరివల్ల సాధ్యమేనా? తరగతికి ఒకరిని చొప్పునైనా ఉపాధ్యాయులను నియమిస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది.
-కె.హెచ్.శివాజిరావు, హైదరాబాద్
దుబారా ఎందుకు?

11/09/2017 - 22:46

తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలలో ఉన్న ఆరోగ్య కేంద్రాల వల్ల ప్రయోజనం లేదు. ఆ కేంద్రాలలో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడం మొదటి సమస్య. తగినంత మంది సిబ్బంది, తగినన్ని ఔషధాలు లేని ఆరోగ్య కేంద్రాల వల్ల ఒరిగేది ఏమిటి? వందల సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది తిరగాడే సంస్థల్లో పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వానికి నగుబాటు.

11/08/2017 - 21:24

మహానగరాలను కాలుష్యభూతం ఆవహిస్తోంది. దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంతగా అక్కడి వాతావరణం కలుషితమైపోవడం బాధాకరం. కాలం చెల్లిన వాహనాలు, పరిశ్రమలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున పంటలను కాల్చివేయడం వంటి చర్యల వల్ల రాజధానిలో వాతావరణం కలుషితమైపోయింది. అందువల్లే ఆ మధ్య దీపావళి సందర్భంలో బాణసంచా విక్రయాలు, వినియోగంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కోర్టు కూడా కొన్ని ఆంక్షలను విధించింది.

11/08/2017 - 21:24

తారు రోడ్లకన్నా సిమెంటు రోడ్లు మన్నిక ఎక్కువని, ఒకసారి వేస్తే ఎక్కువ కాలం రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేయవలసిన అవసరం లేదని ప్రభుత్వం భావించడం సబబే. కానీ సిమెంటు రోడ్లు వేసిన తరువాత కొద్ది కాలానికే వివిధ కారణాలతో తవ్వేస్తున్నారు. నీటి గొట్టాలు, కేబులింగ్ కోసం అలా తవ్వేయడం వల్ల పెద్దఎత్తున ధనం వృధా అవుతోంది. తారు రోడ్లు మరమ్మతు చేసినంత సులువుగా వీటిని మరమ్మతు చేయలేరు.

11/08/2017 - 21:23

ప్రజలపై జిఎస్‌టి భారం ఎక్కువగానే ఉంది. ఇది ఇబ్బందికరంగా ఉంది. నెలకు రెండు లక్షల కోట్ల చొప్పున గత రెండు నెలలుగా జిఎస్‌టి వల్ల రాబడి పెరిగిందని ప్రకటనలు వస్తున్నాయి. దీనిప్రకారం లెక్కగడితే సగటున ఏడాదికి ఒక్కో పౌరుడినుంచి 20 వేల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నట్లు తేలుతోంది. ఇది ఊహకు అందని సత్యం.

11/07/2017 - 23:53

వాహన చోదకులు విధిగా హెల్మెట్లు ధరించాలని జారీ చేసిన ఆదేశాలు గుంటూరు జిల్లాలో అమలు కావడం లేదు. నిజానికి భద్రత కోసమే చెప్పినప్పటికీ వాహన చోదకులు బాధ్యత లేకుండా వ్యవహరించడం బాధాకరం. హెల్మెట్లు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిపై కొద్దిపాటి మొత్తాలను జరిమానాగా విధించి వదిలేయడం వల్ల వారు భయపడటం లేదు. వాహన చోదకుల రక్షణ కోసం సూచించిన ప్రమాణాలను పాటించకపోవడం సరికాదు.

11/06/2017 - 23:17

దేశంలోని వివిధ చట్టసభల్లో కొలువై ఉన్న 1581 నేరారోపిత నాయకుల సంగతి ఎంతవరకు వచ్చిందన్నది కేంద్రానికి సుప్రీంకోర్టు వేసిన సూటి ప్రశ్న. మెజారిటీ కేసులు దర్యాప్తు స్థాయిలోనో, విచారణలోనే నత్తనడకగా నడుస్తూ ఉంటాయన్నది వాస్తవం.

Pages