S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

12/04/2017 - 00:19

ఎన్నికల వేళ హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చిన రాజకీయ పక్షాలు ఆ తరువాత ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. నిధుల లేమితో బాధపడుతున్న రాష్ట్రంలో పొదుపు పాటించకుండా ఆర్భాటానికి ఎక్కువగా నిధులు వెచ్చిస్తున్నారు. జిఎస్‌టి వంటి విధానాలు సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇలాంటి వాటిని ప్రశ్నిస్తే అధికార పక్షానికి చెందిన నాయకులు వేధింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ఈ వైఖరి మారాలి.

12/02/2017 - 00:35

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం, ఆగ్రహం లక్షలాదిమందికి ఆందోళన కలిగించింది. పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కేంద్రం ఇచ్చిన విభజన హామీల అమలుకోసం ఇంతకాలం వౌనం వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరాశానిస్పృహలు వ్యక్తం చేస్తే ప్రయోజనం ఏమిటి? ప్రత్యేక హోదా, ప్యాకేజీలపై అడగాల్సిన సమయంలో ఊరుకుని, అడిగినవారిని మాట్లాడనివ్వకుండా చేశారు.

12/01/2017 - 01:12

గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వైఖరి సబబుగాలేదు. ప్రధాని మోదీపై చేస్తున్న విమర్శల్లో పరిణతి కన్పించడం లేదు. గుజరాత్ ముఖ్యమంత్రి నీతిబాహ్య చర్యపై మీ వైఖరి ఏమిటో నోరువిప్పండి అంటూ మోదీని రాహుల్ ప్రశ్నించడంలో ఔచిత్యం ఏమిటి? యుపిఎ అధికారంలో ఉన్నంతకాలం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను నోరువిప్పనీయకుండా సోనియా, రాహుల్ ఎలా వ్యవహరించారో ప్రజలు ఇంకా మరచిపోలేదు.

11/29/2017 - 23:27

తెలుగుభాషను కాపాడుకోవలసిన తరుణం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగువారంతా మాతృభాషపై మమకారాన్ని చాటుకోవాలి. పరభాషా వ్యామోహంలో ఇన్నాళ్లూ అమ్మభాషను పట్టించుకోవడం మానేశారు. ఇప్పటికైనా ప్రజల ఆలోచనా విధానంలో మార్పురావాలి. ఇతర భాషలను నేర్చుకున్నంత మాత్రాన మాతృభాషను మరచిపోవడం సరికాదు.

11/28/2017 - 23:12

భూగర్భ జలాలు కలుషితం కావడం, రక్షిత నీటి కొరత వల్ల ప్రజలు మంచినీటిని కొనుక్కోవలసిన దుస్థితి ఏర్పడింది. దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు మినరల్ వాటర్ పేరిట వ్యాపారం మొదలుపెట్టి ప్రజలను దోచుకుంటున్నారు. అనుమతులు లేకుండా, నీటిని శుద్ధి చేయకుండా కేవలం కేన్‌లలో నీటిని నింపి దానినే మినరల్ వాటర్‌గా చెప్పి విక్రయించి ప్రజలను మోసగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

11/28/2017 - 00:03

అవినీతికి పాల్పడుతున్న అధికారులను కఠినంగా శిక్షించాలి. లంచం ఇవ్వని దిగువస్థాయి సిబ్బందిని వేధిస్తున్నవారిని ప్రభుత్వం వదిలిపెట్టకూడదు. గుంటూరు జిల్లాలో ఎన్.రవికుమార్ అనే దళిత ఉద్యోగి లంచం ఇవ్వలేక తన బాధను వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడిన బాధాకర సంఘటనలు పునరావృతం కాకూడదంటే ప్రభుత్వాలు స్పందించాలి. అటెండర్ నుంచి గుమాస్తాగా పదోన్నతి పొందిన ఓ సాధారణ దళిత ఉద్యోగి ఆ తరువాతి పద్నోతికి అవకాశం వచ్చింది.

11/26/2017 - 23:55

ఇవాంకా! అమెరికా అధ్యక్షుని గారాల నెలవంకా!
వస్తున్నవంట హైదరాబాద్ వంక..
నీ రాక కాగా అపురూప వేడుక
తెలంగాణ సర్కారు ఉరుకుతుంది జింక లెక్క..
అతిథి సేవలో కేసిఆర్ సారు
రంతిదేవుణ్ణి.. వెనక బంతిలోకి నెట్టినారు
వాడలకు రంగులేసి.. గోడలపై బొమ్మలేసి
రోడ్లను పక్కాగా ఊడ్పించి,
బిచ్చగాళ్లను పక్కకు ఈడ్పించి
సుందర నగరాన్ని నీముందు నిలుపుతారు

11/25/2017 - 00:14

ప్రభుత్వ శాఖలలో ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాలతో భాగస్వామ్యం ఉన్నది పంచాయతీరాజ్ విభాగం. ప్రభుత్వంలోని ఇతర శాఖలకన్నా వీరికి కాస్త పని ఎక్కువే. అయితే మిగతా విభాగాలలో ఉద్యోగులకు నిర్ణీత కాలపరిమితిలో పదవోన్నతులు వస్తున్నాయి. కానీ పంచాయతీరాజ్ శాఖలో జాప్యం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేసే ఒక మండల అభివృద్ధి అధికారి దాదాపు పద్దెనిమిది సంత్సరాలు అదే పోస్టులో ఉండిపోవలసి వస్తోంది.

11/24/2017 - 02:08

తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు సమయం అసన్నమవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే ఈ జాతర ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తేదీవరకు నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. దాదాపు రెండున్నర కోట్ల మంది భక్తులు ఈ జాతరలో పాల్గొంటారని అంచనా.

11/22/2017 - 21:51

అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ తరపున న్యాయమూర్తి దల్వీర్ భండారీ తన ప్రత్యర్థి బ్రిటిష్ న్యాయమూర్తిపై గెలుపొంది తిరిగి ఎన్నిక కావడం చారిత్రాత్మకం. 15మంది న్యాయమూర్తుల పానెల్‌కి మూడేళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలకు భారత్ పోటీ పడటమేకాకుండా, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కలిగిన బ్రిటన్‌కు గట్టిపోటీ ఇచ్చింది.

Pages