S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

02/11/2016 - 07:31

దగ్గు, ఇన్‌ఫెక్షన్ల సమస్య నుంచి ఉపశమనం పొందేందుకే కాదు.. శరీరంలో అదనపు బరువును తగ్గించుకునేందుకు తేనె దివ్యౌషధంలా పనిచేస్తుంది. తేనెలో తీపిదనం (సుగర్) ఉన్నప్పటికీ కొన్ని పద్ధతుల్లో దాన్ని వినియోగించుకుంటే బరువు సమస్యను అధిగమించే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాల్లో తేలింది. కాచి చల్లార్చిన నీటిలో లేదా నిమ్మరసంలో తేనె వేసుకుని తాగితే సుగర్ ప్రభావం ఉండదు.

02/10/2016 - 08:39

సుమారు ఆరు దశాబ్దాలుగా విశ్వవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ ఇపుడు కొత్త రూపంలో దర్శనం ఇస్తోంది. సహజమైన తెలుపురంగులో అమెరికా బాలికను గుర్తుచేసే ఈ బొమ్మ ఇపుడు తలపై బురఖాతో వినూత్న అందాలను సంతరించుకుంది. బురఖా (హిజబ్) ధరించిన దీన్ని ఇపుడు సామాజిక మీడియాలో ‘హిజార్బీ’గా వ్యవహరిస్తున్నారు.

02/06/2016 - 23:07

కాలంతో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగినా ఆరోగ్యానికి, చర్మ సంరక్షణకు మేలు చేస్తుందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
* రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అధిక రక్తపోటును అరికడుతూ, గుండెపోటును నివారించేందుకు కొబ్బరి బొండం దోహద పడుతుంది. గుండె సంబంధ రక్తనాళాల్లో సమస్యలు లేకుండా, బ్లడ్ సుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

02/05/2016 - 00:08

మంచి శరీరాకృతితో నాజూగ్గా ఉండాలని మగువలు తపన పడడం సహజమే. పొట్ట్భాగం పెరగకుండా ఉండాలంటే వనితలు సరైన ఆహార పద్ధతులను పాటిస్తూ రోజూ తగినంత వ్యాయామం చేస్తుండాలి. జీర్ణక్రియ సవ్యంగా ఉండేందుకు, ఎముకల దృఢత్వానికి, కొవ్వు పెరగకుండా ఉండేందుకు దోహదపడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. బచ్చలికూరను తరచూ తింటే శరీరం బరువు తగ్గి పొట్ట్భాగం పెరగకుండా ఉంటుంది.

02/04/2016 - 03:34

వెల్డర్‌గా పనిచేసే తండ్రి సంపాదన అంతంత మాత్రమే.. కటిక దారిద్య్రం.. గ్రామీణ నేపథ్యం.. ఇన్ని సమస్యల నడుమ చదువుపైనే దృష్టి సారించిన ఆ కుర్రాడు ఇపుడు ఒక్కసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. బిహార్‌లో అత్యంత వెనుకబడిన ఖగారియా ప్రాంతంలోని సాన్‌హౌలి గ్రామానికి చెందిన వాత్సల్యసింగ్ చౌహాన్‌కు ఐటి దిగ్గజమైన ‘మైక్రోసాఫ్ట్’లో 1.02 కోట్ల రూపాయల జీతానికి మంచి ఉద్యోగం దక్కింది.

02/03/2016 - 03:56

చర్మం ఎర్రగా మారిపోవడం, మంట పుట్టడం, దద్దుర్లు, పొలుసులు దేరడం, తేమను కోల్పోవడం వంటి సమస్యలు ఎదురైతే వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే ఎగ్జిమా, సొరియాసిస్ వంటి వ్యాధుల బారినపడే ప్రమాదం ఉంది. ఇంట్లోనే కొద్దిపాటి చిట్కాలను పాటిస్తే చర్మసంబంధ సమస్యల నుంచి ఆదిలోనే గట్టెక్కే అవకాశం ఉంది.

01/30/2016 - 21:00

మంచి రుచి, సువాసనకు మారుపేరైన జామపండు అంటే అందరికీ ఇష్టమే. ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పండును తినడం ఆరోగ్యరీత్యా మంచిదే. ఇందులోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, లైకోపెన్ వంటి పోషకాలు మన శరీర వ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తాయి. జామపండ్లను తరచూ తింటే ఇందులోని పీచు పదార్థాల కారణంగా మధుమేహం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. శరీరంలో సుగర్ స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.

01/29/2016 - 21:09

మంచి రుచిని అందించే ద్రాక్షపండ్లను ఏ వయసువారైనా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేసే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకోవాలంటే తరచూ ద్రాక్షపండ్లను తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో విటమిన్ ఎ,సి, బి-కాంప్లెక్స్, కెరొటిన్ సమృద్ధంగా ఉంటాయి.

01/28/2016 - 21:25

శీతాకాలంలో చలిగాలి ప్రభావం వల్ల పెదాలు తేమను కోల్పోతాయి. అధరాలపై సెబాషియన్ గ్రంథులు సున్నితంగా వుంటాయి. చలికాలంలో పెదాలు తడారిపోవడంతో అవి పగిలిపోయి కొన్నిసార్లు నొప్పిని కలిగిస్తాయి. పగిలిన చర్మాన్ని చేత్తో లాగుతుంటే చర్మంపై రక్తస్రావం జరగడమే గాక బాధ అధికమవుతుంది. తేమగా ఉండాలని పెదాలని నాలుకతో తడుపుతూండటం మంచిది కాదు. ఇలాచేసినా పెదాలపై సున్నితమైన చర్మం చిట్లిపోతుంది.

01/27/2016 - 08:53

ఉరుకులు, పరుగుల నేటి ఆధునిక కాలంలో మానసిక ఒత్తిళ్ల కారణంగా చాలామంది జ్ఞాపకశక్తి సమస్యతో సతమతమవుతున్నారు. కొన్ని సులభ పద్ధతులను ఆచరిస్తే ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే మంచి వాసనల్ని చూస్తే ఒత్తిడి తగ్గి మెదడు తేలికవవుతుంది. ఉదయానే్న కాఫీ పొడి, తులసి ఆకులు, గులాబీ రేకులను వాసన చూడడం మంచిది. ఘాటైన వాసన కారణంగా మెదడు పదును తేలుతుంది.

Pages