S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

04/06/2018 - 21:22

పగిలిన మడమల సమస్య ఈ రోజుల్లో సర్వసాధారణం. కొన్నిసార్లు ఈ పగుళ్ళు చాలాలోతుగా తయారై నడవడానికి ఇబ్బంది కలుగుతుంది. పాదాలను నిర్లక్ష్యం చేయడం, ఎక్కువ సేపు నిల్చోవడం, సరైన పాదరక్షలు ధరించకపోవడం వల్ల పగుళ్ళు ఏర్పడతాయి. ఎగ్జిమా, సోరియాసిస్, థైరాయిడ్, మదుమేహం వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా కాళ్ళు పగులుతాయి. చిన్న చిన్న చిట్కాలను పాటించడం వల్ల పాదాలు పగుళ్ళు తగ్గి అందంగా తయారవుతాయి.

04/02/2018 - 21:24

భోజనంలో మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. పరగడుపున కాసిన్ని ఉసిరికాయ ముక్కలు నోట్లో వేసుకుని, మజ్జిగ తాగితే భోజనం ఆలస్యమైనా శరీరానికి శక్తి లభిస్తుంది. ఇందులోని విటమిన్-సి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే మూత్రకోశంలో మంట, నొప్పి తగ్గి మూత్రవిసర్జన సక్రమంగా అవుతుంది. ఉసిరితో ఆవకాయ, తొక్కుడుపచ్చడి వంటివి చేసుకోవచ్చు.

03/29/2018 - 21:36

టీనేజీ నుంచి మధ్యవయస్సు అమ్మాయిల వరకూ దాదాపుగా అందరూ ఎదుర్కొనే చర్మ సమస్యల్లో అతి ముఖ్యమైన సమస్య మొటిమలు. చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే ఈ సమస్య దరిచేరకుండా చేయవచ్చు. మొటిమలను తగ్గించనూవచ్చు.
* రోజుకి రెండుసార్లు ముఖాన్ని సబ్బుతో కడగాలి. మరో నాలుగైదుసార్లు ముఖంపై చల్లటి నీటిని చిలకరించుకుంటూ ఉంటే ముఖం శుభ్రపడి మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

03/22/2018 - 20:35

తగిన పోషకాహారం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మధుమేహం వ్యాధిని అదుపులో ఉంచడం సాధ్యమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్లు, కూరగాయలతో పాటు కొవ్వు తక్కువగా ఉండే పాలను మధుమేహరోగులు తీసుకోవడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్‌కు మాత్రం వీలైనంత మేరకు దూరంగా ఉండాలి. గింజలు, మొలకలు వంటివి తీసుకోవచ్చు.

03/14/2018 - 22:23

* బరువు తగ్గాలనుకుంటే రోజూ రెండు సపోటాలు తినడం మంచిది. యోగా, వ్యాయామం చేశాక సపోటా తింటే అలసట మరచిపోయి మానసికోల్లాసం కలుగుతుంది.
* సపోటాలో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల నేత్ర సంబంధ సమస్యలు దూరమవుతాయి. నీరసంగా ఉన్నపుడు వీటిని తింటే వెంటనే శరీరం ఉత్తేజాన్ని పుంజుకుంటుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పరచేందుకు, మలబద్ధకం సమస్యను అధిగమించేందుకు వీటిని తినడం ఉత్తమం.

03/12/2018 - 23:15

* ముల్లంగి ముక్కలను నానబెట్టిన నీటిలో యాలకుల ముద్ద వేసి తింటే గొంతులో వాపు తగ్గుతుంది.
* భోజనం ముగిశాక ఒకటి, రెండు యాలకులు తీసుకుంటే నోరంతా సువాసనతో గుబాళిస్తుంది.
* గొంతులో మంటతో, దగ్గుతో మాట బొంగురుపోతుంటే ఉదయానే్న రెండు, మూడు యాలకులను నమలి, ఆ తర్వాత గోరు వెచ్చని నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

03/07/2018 - 23:21

ఈ సంవత్సరం వార్తల్లో నిలిచిన మహిళామణుల్లో పోలీస్ ఆఫీసర్ జి.ఆర్ రాధిక ఒకరు. యూరప్‌లోని అతిఎత్తయన ఎల్బ్రస్ అగ్ని పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. పి.వి.సింధు గతేడాది రియో ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి ప్రపంచం నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌గా అవతారమెత్తిన సైనా ఈ ఏడాది మేడెన్ మలేషియా ఓపెన్ గ్రాండ్ టైటిల్‌లో బంగారు పతకాన్ని సాధించింది.

03/05/2018 - 01:58

ఇహ ఎండాకాలం వచ్చేసింది. ఎండా ఉక్కపోత ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎండల్లో తిరిగేవారికే కాక నీడపట్టున ఉన్నవారు కూడా దాహానికి గురవుతుంటారు. దాహం అనేది అసలు శరీరంలో నీటి శాతం తగ్గినపుడు జరుగుతుంది. అదీకాక ఒక్కోసారి శరీరంలోని పైత్యరసాలు ప్రకోపించినపుడు అధిక దాహం వేస్తుంది అంటారు.

02/23/2018 - 21:19

*పిల్లలకు ఆటల్లో, ఇంటివద్ద చిన్న చిన్న దెబ్బలు తగిలితే వాపు వస్తుంది. టీ కాచుకున్నాక ఆ టీ పొడిని మెత్తటి క్లాత్‌లో పెట్టి మూడు పూటలా వత్తితే వాపు, నొప్పి తగ్గుతుంది.
* దురదగా వున్న చర్మానికి చెంచె దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి రాస్తుంటే ఫలితం కనిపిస్తుంది.

02/21/2018 - 20:53

కవిత్వంలోనో, పాండిత్యంలోనో, సాహిత్యంలోనో నటనలోనో తనదైన ప్రత్యేకత సంతరించుకుని తన పేరుకన్నా ముందుగా వారి ఇంటిపేరోవారి రచన పేరో వారిపేరుకు ముందుగా ఉచ్చరించే ప్రాచుర్యం పొందిన సందర్భాలు మనకు సాధారణమే.కాని పల్లెటూరులోని చిరు హోటల్‌లో తయారయ్యే జిలేబి వ్యాపారమే ఆయన ఇంటిపేరును మార్చివేసిందంటే ఆ వంటకానికి ప్రజల్లో ఎంత ప్రాచుర్యం లభించిందో చెప్పకనే తెలుస్తుంది.

Pages