S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

01/23/2018 - 19:33

కాలిన గాయం మీద బియ్యపు పిండి జల్లితే త్వరగా తగ్గిపోతుంది. గడ్డల మీద ఉడికించిన బియ్యపు పిండిని వేడివేడిగా చేసి, కట్టుకట్టితే ఆరంభంలో ఉన్నవి అణిగిపోతాయి. కొంతకాలం అయిన తరువాత పగిలి చీము పోతుంది.

01/19/2018 - 20:25

అందమైన ఆరోగ్యానికి వారానికి మూడు రోజులు ఆకుకూరలు వండుకోండి. ఎ, బి, సి, ఇ, కె తదితర విటమిన్లు పుష్కలంగా వుంటాయి. అలాగే పిల్లలకు ప్రతీరోజూ చెంచా తేనెను ఇవ్వండి. ఆరోగ్యంతోపాటు అందంగా పెరుగుతారు.

01/18/2018 - 23:44

ముఖం జిడ్డుగారుతూ.. మురికిగా ఉంటుంటే వంటింట్లో దొరికే వస్తువులతోనే తాజాగా ఉంచుకోవచ్చు. ముఖం మెరిసేలా ఉండేందుకు టొమాటో గుజ్జు చర్మంపై మంచి ప్రభావం చూపిస్తుంది. దీనిని ముఖానికి రాసుకుని కాసేపటి తరువాత కడిగేసుకుంటే మురికి పోవటంతో పాటు మంచి మెరుపు కనిపిస్తోంది. అలాగే కీరదోస రసానికి గ్లిజరిన్, గులాబీ నీరు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, రాత్రి నిద్ర పోవటానికి ముందు రాసుకోవాలి.

01/10/2018 - 19:35

ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని, ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు ఇవ్వాలి. అల్పాహారం కింద కోడిగుడ్డు ఆమ్లెట్, ఉల్లిగడ్డలు, టమాటా, పాలకూర, ముడిధాన్యాలు, యాపిల్.

01/10/2018 - 19:34

మనం ప్రతిరోజూ ఎన్నో రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాం. కాని వీటిలో ఏది మనకు ఎక్కువ పోషకాలను అందిస్తుందో తెలియదు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఆహార నియంత్రణ పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. వీరు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. విపరీతమైన నీరసం, అలసటకు గురవుతుంటారు.

01/06/2018 - 19:20

నిత్యం ఇంట్లో లేదా నీడ పట్టులో వున్నవారికి విటమిన్ డి అవసరమైనంతగా దొరకదు. దీనివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం వుంది. కనీసం మూడు రోజులకు ఒకసారైనా ఎండలో నడవాలి.
పసందైన ఇడ్లీల కోసం ఇడ్లీ పిండిలో కొద్దిగా నూనె కలపండి. అప్పుడు ఇడ్లీలు మృదువుగా ఉంటాయి. ఇంటిల్లిపాది లొట్టలు వేసుకుని తింటారు.

01/06/2018 - 19:18

నోరూరించే నిమ్మను ఇష్టపడనివారు ఉండరు. లెమన్ టీ, నిమ్మ పచ్చడి, నిమ్మ పులిహోర.. ఒకటేమిటి ఎన్నో రకాలు చేసుకుంటాం. అందుకే ప్రతి ఇం ట్లో ఇది నిత్యావసరంగా మారిపోయింది. చౌకగా దొరికే నిమ్మలో ఆరోగ్యానికి మేలుచేసే విశేషాలు అధికంగా ఉన్నాయి. ఉదయానే్న గోరువెచ్చని నీటి లో నిమ్మరసం కలిపి తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం తగ్గుముఖం పడుతుంది. ఇది కాలేయానికీ మంచి టానిక్.

12/28/2017 - 19:34

ఆకు కూరలను వండేటప్పుడు వంట పాత్రలపై మూతలు విధిగా పెట్టాలి. ఎసరు మరిగిన తరువాతనే ఆకు కూరలు ముక్కలువేసి వుడికించాలి.
ఆకుకూరలను తరిగేటప్పుడు వాటి లేత కాడలను కూడా తరుక్కోవాలి. ఆ కాడల్లో కాల్షియం వుంటుంది.
పులియపెట్టి వండడంవల్ల పోషకాలు విలువలు పెరుగుతాయి. ముఖ్యంగా, బి,సి విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి.

12/22/2017 - 20:06

నేటి యాంత్రిక జీవనంలో పిల్లలు ఉదయానే్న టిఫిన్ తినటం అనే అలవాటునే మానేశారు. స్కూలు, ఆటలు, ట్యూషన్స్, అదనపు ప్రావీణ్యాల్లో శిక్షణ వంటివాటితో ఉన్న శక్తి అంతా ఆవిరైపోతుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పోషకాహార నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం బ్రెడ్ స్లయిస్, దోశ, అటుకులు, అన్ని రకాల అల్పాహారాలు, పాలు, పాల పదార్థాలు, గుడ్లు, సోయామిల్క్‌ను ఏ రూపంలో అయినా తీసుకోమని సలహా ఇస్తున్నారు.

12/13/2017 - 19:47

పిల్లల పెంపకం నేడు తల్లులకు సవాల్‌గా మారుతోంది. ఏడాది లోపు పిల్లలకు తల్లిపాలే ఎంతో మంచివి. వారికి బుద్ధికుశలత పెరుగుతుంది. ఆస్తమా, ఎలర్జీలను నుంచి బిడ్డలను కాపాడుకోవచ్చు. నెలల బిడ్డకు తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చు. దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. కానీ విటమిన్ డి తగినంత అందదు.

Pages