S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/13/2019 - 01:39

ఇస్లామాబాద్, డిసెంబర్ 12: భారత ప్రభు త్వం తాజాగా చేపట్టిన పౌరసత్వ సవరణ బిల్లు లక్ష్యాలపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ట్వీట్లతో ప్రపంచ దేశాల ప్రమేయాన్ని కోరుతూ వ్యాఖ్యలు చేశారు. హిందూ జాత్యహంకార అజెండాతోనే మోదీ సర్కారు ఈ వివాదాస్పద బిల్లును తీసుకువచ్చిందని, పరిస్థితి చేయి దాటిపోకముందే ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

12/12/2019 - 05:10

పారిస్: పెన్షన్ విధానంలో ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న సవరణలు, నిబంధనల్లో మార్పులపై అన్నివర్గాల ప్రజల నిరసనలతో పారిస్ హోరెత్తిపోయింది. కార్మికులు, ఉద్యోగులను నిలువుదోపిడీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వివిధ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఫ్రెంచ్ ప్రధాని ఎడార్డ్ ఫిలిప్ ఈ విషయంపై స్పష్టీకరిస్తూ రిటైర్మెంట్ వయసును మార్చలేదని తెలిపారు.

,
12/12/2019 - 05:01

బుకా: ప్రపంచ దేశాల పటంలో మరో కొత్త దేశం చేరింది. పపువా న్యూ గునియా నుంచి వేరుపడిన బౌగెన్‌విల్లే స్వతంత్ర రాజ్యంగా అవతరించనుంది. బుకా పట్టణం ఈ కొత్త దేశ రాజధానిగా ఉంటుందని, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాయాలు అక్కడే నెలకొంటాయని అధికారులు ప్రకటించారు. సుమారు 3 లక్షల మంది జనాభా కలిగిన బౌగెన్‌విల్లే దేశంలో బుకాతోపాటు అరావా, బూయిన్ మాత్రమే చెప్పుకోదగ్గ నగరాలు.

12/12/2019 - 04:57

అల్జీరియా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో యువతరానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అల్జీరియాలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రజలు. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఐదుగురు పోటీ పడుతున్నారు. సుమారు రెండు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా ఉన్న అబ్దెలాజిజ్ భౌటొఫికా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

12/11/2019 - 04:01

మాడ్రిడ్, డిసెంబర్ 10: భారత్ తొలిసారి ఈ సంవత్సర క్లైమేట్ చేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ (సీసీపీఐ) ర్యాంకుల్లో టాప్ టెన్‌లో చోటు దక్కించుకుంది. ఇక్కడ జరుగుతున్న సీఓపీ25 క్లైమేట్ సమ్మిట్‌లో మంగళవారం సీసీపీఐ ర్యాంకులతో కూడిన ఒక నివేదికను మంగళవారం ప్రవేశపెట్టారు. భారత్‌లో తలసరి కర్బన ఉద్గారాలు, ఇంధన వినియోగ ప్రస్తుత స్థాయిలు ‘హై కేటగిరి’లో తొమ్మిదో స్థానంలో ఉన్నాయి.

12/11/2019 - 02:11

ఇస్లామాబాద్, డిసెంబర్ 10: జమ్మూకాశ్మీర్‌లో అమలు చేస్తున్న ఆంక్షలను ఎత్తివేయవలసిందిగా భారత్‌పై ఒత్తిడి తేవాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మంగళవారం అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆంక్షలు విధించి నాలుగు నెలలు పూర్తియిపోయింది.

12/05/2019 - 04:07

*చిత్రం...ఇంగ్లాండ్‌లోని హెర్ట్ఫోర్డ్‌లో బుధవారం జరిగిన శిఖరాగ్ర సమావేశానికి హాజరైన వివిధ దేశాధిపతులతో బ్రిటీషు రాణి ఎలిజబెత్

12/04/2019 - 23:23

వాట్‌ఫోర్డ్, డిసెంబర్ 4: నాటో కూటమికి చెందిన దేశాధినేతల్లో ఎక్కువ మంది అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలిపైనే చర్చించినట్లు సమాచారం. నాటో సదస్సుకు వివిధ దేశాల నుంచి పలువురు నాయకులు హాజరయ్యారు.

12/04/2019 - 23:16

*చిత్రం...టోక్యోలో బుధవారం జపాన్ రక్షణ మంత్రి తారోకొనోను మర్యాదపూర్వకంగా కలుసుకున్న భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్

12/01/2019 - 23:41

లాహోర్, డిసెంబర్ 1: ‘మీ మైండ్ సెట్ మార్చుకోండి..’ అని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ అధికారులకు సూచించారు. పాతకాలం నాటి విధానాలతో, పద్ధతులతో ‘నయా (కొత్త) పాకిస్తాన్’ ఎలా అవుతుందీ? అని ఆయన ప్రశ్నించారు. దేశాభివృద్ధిలో, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, పెరుగుదలలో ఉద్యోగులు, అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని ఆయన తెలిపారు.

Pages