S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/28/2017 - 03:17

బీజింగ్, అక్టోబర్ 27: ‘అధికార కమ్యూనిస్టు పార్టీకి సంపూర్ణ స్థాయిలో విధేయతగా ఉండండి. యుద్ధాలలో నెగ్గడం ఎలా అనే అంశంపై కేంద్రీకరించడం ద్వారా యుద్ధ సన్నద్ధతను తీవ్రం చేయండి..’ ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యంగా, 2.3 మిలియన్ల మంది సిబ్బందితో కూడిన పటిష్ఠమైన మిలిటరీగా ఉన్న చైనా సాయుధ బలగాలను ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఇలా ఆదేశించారు.

10/28/2017 - 03:09

వాషింగ్టన్, అక్టోబర్ 27: ‘ఉగ్ర సంస్థల నిరోధానికి మీ పద్ధతిలో మీరు చర్యలు తీసుకోండి. లేదంటే, మా పద్ధతిలో మేం ముదుకెళ్లాల్సి ఉంటుంది’ అని పాకిస్తాన్‌ను అమెరికా హెచ్చరించింది. ఉగ్రమూకల్ని తుదముట్టించేందుకు ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పాక్ విషయంలో అమెరికా అనుసరణీయ వ్యూహాలు మారతాయని హెచ్చరించింది.

10/27/2017 - 03:22

ఇస్లామాబాద్, అక్టోబర్ 26: పనామా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని పదవీచ్యుతుడైన పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అకౌంటబిలిటీ కోర్టు మళ్లీ వారెంట్లు జారీచేసింది. రెండు కేసుల విచారణలో షరీఫ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి మహమ్మద్ బషీర్ వారెంట్లు జారీచేశారు. అలాగే కోర్టు హాజరునుంచి మినహాయింపు కోరుతూ షరీఫ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కొట్టివేశారు.

10/27/2017 - 03:21

తాగెరాంగ్ (ఇండోనేసియా), అక్టోబర్ 26: ఇండోనేసియా రాజధాని జకార్తాకు సమీపంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 47 మంది దుర్మరణం చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మంటల వల్ల ఈ ఫ్యాక్టరీలో వరుస పేలుళ్లు సంభవించాయని, సమీప ప్రాంతం అంతా దట్టమైన పొగలతో నిండిపోయిందని పోలీసులు తెలిపారు.

10/25/2017 - 22:36

బీజింగ్, అక్టోబర్ 25: చైనా సార్వభౌమత్వ విషయంలో రాజీ పడేది లేదని, దాని భద్రతను ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఉద్ఘాటించారు. అధికార కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడుగా రెండోసారి ఎన్నికైన అనంతరం జాతీయ, అంతర్జాతీయ మీడియా ముందు మాట్లాడిన జిన్‌పింగ్ ఇతర దేశాలతో కలిసి ప్రపంచ భవితవ్యాన్ని నిర్మించేందుకు, జీవన పరిస్థితులను సురక్షితం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

10/25/2017 - 03:08

బీజింగ్, అక్టోబర్ 24: సరికొత్త సామ్యవాద సిద్ధాంతాలతో నూతన శకంలోకి చైనాను పరుగులు పెట్టిస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మరో ఐదేళ్ల పదవీకాలాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ ధ్రువీకరించింది. పార్టీ వ్యవస్థాపకులు మావో, ఆయన వారసుడు డెంగ్ జియావో పింగ్ స్థాయికి జీ జిన్‌పింగ్‌ను చేరుస్తూ ఆయన పేరును సిద్ధాంతాన్ని అందులో పొందుపరిచింది.

10/24/2017 - 04:25

టోక్యో, అక్టోబర్ 23: జపాన్ జాతీయ ఎన్నికల్లో ప్రధాని షింజో అబే సారథ్యంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ మూడింట రెండొంతుల మెజార్టీతో ఘన విజయం సాధించింది. మొత్తం 465స్థానాలు కలిగిన పార్లమెంట్ దిగువ సభలో మరో చిన్న భాగస్వామ్య పక్షంతో కలిసి 312 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో లిబరల్ డెమొక్రటిక్ పార్టీ నాయకుడిగా మరో మూడేళ్ల పాటు షింజో అబే ఎన్నికయ్యే అవకాశాలు మరింతగా బలపడ్డాయి.

10/24/2017 - 03:01

ఢాకా, అక్టోబర్ 23: బంగ్లాదేశ్‌తో సంత్సంబంధాలను పెంపొందించుకునే పథంలో ఎదురవుతున్న సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు.

10/23/2017 - 03:15

వాషింగ్టన్, అక్టోబర్ 22: భారత్ తన వైమానిక దళంకోసం ఆర్మ్‌డ్ డ్రోన్లను సరఫరా చేయవలసిందిగా చేసిన విజ్ఞప్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఉన్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అన్‌ఆర్మ్‌డ్ గార్డియన్ డ్రోన్లను భారత్‌కు విక్రయించడానికి కొన్ని వారాల క్రితమే అమెరికా ఆమోదం తెలిపింది.

10/23/2017 - 03:09

టోక్యో, అక్టోబర్ 22: జపాన్ ప్రధాని షింజో అబే ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధిస్తారని రాజకీయ పండితులు జోస్యం చెబుతున్నారు. ఆదివారంనాటి సార్వత్రిక ఎన్నికల్లో అబే పార్టీకి ఓటర్లు తిరిగి పట్టం కడతారని వారంటున్నారు. ప్రపంచంలోనే ఆర్థికంగా మూడో అతిపెద్ద దేశమైన జపాన్‌కు అబే పెద్దగా చేసిందేమీ లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే ప్రజలు ఆయనకు మద్దతు ఇస్తున్నారని తెలిపారు.

Pages