S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

02/28/2019 - 23:20

వాషింగ్టన్, ఫిబ్రవరి 28: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులకు మద్దతు ఇస్తామని, ఉగ్రవాద నిర్మూలనకు అమెరికా అండదండలు ఉంటాయని ఆ దేశ విదేశాంగ శాఖ కార్యదర్శి మైక్ పాంపియో స్పష్టం చేశారు. ఆయన గురువారం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ తో ఫోన్‌లో ముచ్చటించారు. ఈ సందర్భంగా భారత్‌కు అమెరికా బాసటగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

02/28/2019 - 23:19

లండన్, ఫిబ్రవరి 28: బ్రిటన్ వీసాలు పొందుతున్న దేశాల్లో భారతీయులే ఎక్కువగా ఉన్నట్టు తాజా గణాంకాలు వెల్లడించాయి. నైపుణ్యంతోకూడిన నిపుణులు, విద్యార్థులకే ఎక్కువ వీసాలు జారీ చేసినట్టు బ్రిటన్ హోమ్‌శాఖ స్పష్టం చేసింది. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్ నిపుణులు, ఇంజనీర్లు టైర్-2 వీసాలు పొందినట్టు తెలిపారు. గతంతో పోల్చుకుంటే 2018 నాటికి 54 శాతం భారతీయ నిపుణులేనని పేర్కొన్నారు.

02/28/2019 - 06:57

ఇస్లామాబాద్, ఫిబ్రవరి 27: భారత్‌కు చెందిన రెండు మిగ్ యుద్ధ విమానాలను కూల్చివేసిన తరువాత, ఇద్దరు భారత పైలట్లను అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రకటించారు. అణ్వస్త్ర దేశాలయిన భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే, పాకిస్తాన్‌ను తక్కువగా అంచనా వేయొద్దని ఆయన భారత్‌ను హెచ్చరించారు.

02/28/2019 - 06:55

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: తమ భూభాగం నుంచి నిర్వహిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకట్ట వేయడానికి పాకిస్తాన్ వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలని అమెరికా బుధవారం హెచ్చరించింది.

02/28/2019 - 06:54

బీజింగ్, ఫిబ్రవరి 27: జైషే ఉగ్రతండాలపై లక్షిత దాడుల నేపథ్యంలో తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశంగా భారత్-పాకిస్తాన్ ఆలోచన చేయాలని చైనా బుధవారం మరోసారి విజ్ఞప్తి చేసింది. సరిహద్దులో శాంతి స్థాపనకు కృషి చేయాలని, సంయమనం పాటించాలని చైనా సూచించింది. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలన్న చైనా ‘ఇరుదేశాలు ఆ దిశగా దృష్టిసారించాలి’అని కోరింది.

02/28/2019 - 06:50

హనోయ్, ఫిబ్రవరి 27: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ మధ్య రెండవ విడత అంతర్జాతీయ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రంప్, కిమ్ ఆత్మీయతతో పరస్పరం కరచాలనం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అణ్వాయుధాలను విడనాడిన పక్షంలో ఉత్తర కొరియాకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని ఆకాంక్షించారు.

02/28/2019 - 07:04

ఖాట్మండు: నేపాల్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు నేపాల్‌లోని తాప్లేజంగ్ పర్వత ప్రాంతాల్లో ఓ ప్రేవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పర్యాటక, పౌర విమానయాన మంత్రి రబీంద్ర అధికారి, ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు.

02/28/2019 - 06:45

ఇస్లామాబాద్/దుబాయ్, ఫిబ్రవరి 27: వచ్చే నెలలో ఇస్లామిక్ సహకార సంస్థ (ఐవోసీ) సమావేశానికి భారత్ విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హాజరైన పక్షంలో తాము ఈ సదస్సును బహిష్కరిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ ప్రకటించారు. ఈ సమావేశానికి సుష్మా స్వరాజ్‌ను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. ఈ సమావేశం మార్చి 1,2 తేదీల్లో అబూదాబీలో జరుగుతుంది.

02/28/2019 - 03:57

వుజెన్ (చైనా), ఫిబ్రవరి 27: పాకిస్తాన్.. జైషే మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు ఆశ్రయం కల్పించి మద్దతు ఇచ్చిన ఫలితమే పుల్వామా ఉగ్రవాద దాడి అని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా వద్ద ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రవాద దాడిని ఆమె బుధవారం ఇక్కడ చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ రుూ వద్ద ప్రస్తావించారు.

02/28/2019 - 00:29

ఇస్లామాబాద్/లాహోర్, ఫిబ్రవరి 27: భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేసినట్టు పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో తన గగనతలంలోకి ప్రవేశించిన రెండు భారత యుద్ధ విమానాలను కూల్చివేయడంతోపాటు భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్టు పాకిస్తాన్ మిలిటరి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ పేర్కొన్నారు.

Pages