S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

12/30/2017 - 02:17

లండన్, డిసెంబర్ 29: శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న అవసరాలకు అనుగుణంగా పుట్టుకొస్తున్న కొత్త యాప్‌లు ఎన్నో జటిల సమస్యలకు పరిష్కారాన్నీ అందిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ ఆధారం లేకుండా గల్లంతైన వ్యక్తులు ఎక్కడున్నారన్నది తెలుసుకోవడం ఓ పెద్ద సమస్యగానే ఉండేది.

12/30/2017 - 02:14

లాహోర్, డిసెంబర్ 29: పాక్ మాజీ నియంత పర్వేష్ ముషారఫ్ ఓ పెద్ద పిరికిపంద అని, ఆయన స్వయంప్రకటిత అజ్ఞాత వాసం నుంచి దేశానికి తీసుకురావాలని పదవీచ్యుత ప్రధాని నవాజ్ షరీఫ్ శుక్రవారం న్యాయ వ్యవస్థను డిమాండ్ చేశారు. దేశాధ్యక్షుడిగా నియంతగా పాల్పడిన అరాచకలన్నింటికీ ముషారఫ్‌ను బాధ్యుడిని చేయాలని షరీఫ్ కోరారు. ముషారఫ్‌పై ఎమర్జన్సీ విధింపు, దేశద్రోహ నేరాలకు సంబంధించిన కేసులు దాఖలయ్యాయి.

12/29/2017 - 19:41

ఉన్నచోట ఉండలేని, అన్య ప్రాంతాల్లో దిక్కూమొక్కూలేని దయనీయ పరిస్థితిలో మైన్మార్ మైనార్టీ ముస్లిం రోహింగ్యాలు సతమతమైపోయారు. దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం అహరహం పోరాడిన అంగ్‌సాన్ సూకీ కూడా వీరి విషయంలో ఏమీ చేయలేకపోయింది. మైన్మార్‌లో సైనిక దాడులు తాళలేక లక్షల సంఖ్యలోనే రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు తరలిపోయారు.

12/29/2017 - 19:41

జింబాబ్వేను ఏళ్లకు ఏళ్లు పరిపాలించి తన నియంతృత్వ పోకడలతో జనాన్ని అన్ని విధాలుగా వణికించి, హక్కులను కాలరాసిన రాబర్ట్ ముగాబే ఎట్టకేలకు గద్దె దిగడం..ప్రపంచ ప్రజలు ప్రజాస్వామ్యానే్న కోరుకుంటున్నారని, తమ హక్కులకు భంగం కలిగితే సహించరని చాటి చెప్పే మరో అంతర్జాతీయ కీలక పరిణామం. రాజకీయాల్లో ముఖ్యంగా నియంతృత్వాల్లో వారసత్వమేమిటంటూ జింబాబ్వే ప్రజలు వీధికెక్కడంతో ముగాబేకు తోకముడవక తప్పలేదు.

12/29/2017 - 19:33

శాస్త్ర,సాంకేతిక విజ్ఞానంలో ప్రపంచం కొత్తపుంతలు తొక్కింది. 2017 వీడ్కోలు పలుకుతూ సరికొత్త శాస్తవ్రిజ్ఞాన సౌరభాలను అందించింది. రోదసికి సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. మన సౌరవ్యవస్థను దాటిన పరిశోధకులు ఎన్నో కొత్త గ్రహాలను కనిపెట్టారు. అలాగే రానున్న కాలంలో మరికొన్ని ఆవిష్కరణలకు బలమైన పునాదులు వేశారు.

12/29/2017 - 19:34

ప్రపంచ దేశాలను గడగడలాడించిన ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ కొరకరాని కొయ్యగా మారారు. ఒకదాని తర్వాత ఒకటిగా క్షిపణి పరీక్షలు జరుపుతూ, ఖండాంతర పరీక్షలూ నిర్వహిస్తూ ప్రపంచ దేశాలను వణికించాడు. ఇటు ఐరాస, అటు అమెరికాలు ఆంక్షల మీద ఆంక్షలు విధిస్తున్నా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించిన ఉత్తర కొరియా నేత తన చర్యలతో ఇరుగు పొరుగు దేశాలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

12/29/2017 - 18:55

ఉత్తర కొరియా, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విడ్డూర పోకడలు, మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం,
జెరూసలెంను ఇజ్రాయెల్‌లో భాగమంటూ అమెరికా తీసుకున్న వివాదాస్పద నిర్ణయం అంతర్జాతీయ
రాజకీయాలను మలుపుతిప్పాయి.

12/29/2017 - 02:39

ఇస్లామాబాద్, డిసెంబర్ 28: తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట చేస్తున్నారన్న అభియోగంపై పాకిస్తాన్ నిర్బంధించిన భారత జాలర్లలో 145 మందికి విముక్తి లభించింది. పాక్, భారత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత జాలర్లను దాయాది దేశం విడిచిపెట్టడం గమనార్హం.

12/29/2017 - 02:36

కాబూల్, డిసెంబర్ 28: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి పంజా విసిరారు. నగరంలోని ఓ సాంస్కృతిక కేంద్రం వద్ద గురువారం నాడు ఉగ్రవాదులు బాంబులు పేల్చి జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది మరణించారని, సుమారు 80 మందికి పైగా గాయపడ్డారని ఆఫ్ఘన్ హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బాధితుల్లో మహిళలు, చిన్నారులు, పాత్రికేయులు ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

12/27/2017 - 04:38

లండన్, డిసెంబర్ 26: బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టేసి 2018 నాటికి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది. ఈ విషయాన్ని సీఈబీఆర్ (సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చి) విడుదల చేసిన ‘2018- ప్రపంచ ఆర్థిక సంఘం’ నివేదికలో పేర్కొన్నారు.

Pages