S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/04/2018 - 02:27

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునికి కర్మయోగ మహిమను ఆచరించవలిన విధానమును, దానివలన కలిగే ఫలితమును వివరించిన తీరు అర్జునునికే గాక అన్ని యుగాలకూ అద్భుత సందేశం. అన్నివేళలా అందరూ ఆచరింపదగినది. ఈ విషయాన్ని శ్లోకాలలో విపలీకరిస్తూ, అర్జునా! కర్మలనాచరించు వేళల్లో, ఆ కర్మనెట్లు చేయవలెనో, దానిని గూర్చిన వివేకమవసరము. ఆ వివేకమునే బుద్ధి అంటారు.

04/01/2018 - 21:56

ఇక్ష్వాకుల కులదైవమైన శ్రీరంగనాథుడు అర్చాస్వరూపముగా వెలసి వున్న దివ్య దేశం శ్రీరంగక్షేత్రం. తమిళనాడులోని చోళమండలంలో వున్న తిరుచునాపల్లి అనే పట్టణం అనేక భవ్య దేవాలయములకు నెలవై వున్నది. ఆ దేవాలయములలో అత్యంత విశిష్టమైనది శ్రీరంగక్షేత్రము.

04/04/2018 - 02:17

452. అనుచు లంఖిణి శూరుని హనుమ నంపె
శత్రు శిరముపైపాదము బెట్టునట్లు
ఎడమ కాలును లంకలో బెట్ట జనక
తనయకు శుభశకునమయ్యె హర్షమొదవె

453.రాజవీధిని జనుచున్న హనుమ వీధు
లందు జల్లిన పరిమళ జలము పుష్ప
సౌరభంబును నాసికా నేత్రములకు
విందు గూర్పగ ధరజను వెదక సాగె

03/22/2018 - 21:06

292. భానునందను డవనిజ పతిని జూచి
‘‘రాఘవా! మే మొక దినము పర్వతాగ్ర
మందు నుండగ గగన మార్గమ్మునందు
రావణాపహృతయగు స్ర్తి మమ్ముజూచి

293. భూషణంబుల కొంగున మూటగట్టి
మా దరికి విసరగ నవి మేము దెచ్చి
భద్రపరచితి’’ మని గుహన్ పదిల పరచి
నట్టి నగలను రాఘవునెదట నుంచ

03/21/2018 - 21:15

మీ పూజా మందిరంలో ఉన్న ఇష్ట దైవం గురించి తెలియజేయాలనుకొంటున్నారా!
దైవానికి మీరు ఎలా చేరువ అయ్యారో, దానివల్ల మీరు పొందే మానసిక ప్రశాంతత,
ఆనందం గురించి వివరించాలనుకొంటున్నారా!
మీ పూజాగది అలంకరణ, అక్కడి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పంచుకోవాలనుకుంటున్నారా!
అయితే ఆ అవకాశాన్ని మీకు ఆంధ్రభూమి కల్పిస్తోంది
మీ దేవుని గది విశేషాలు, అలంకరణ, పూజాపద్ధతులను వివరిస్తూ

03/21/2018 - 21:14

ధార్మిక, పౌరాణిక, ఆచార, ఆధ్యాత్మికపరమైన సందేహాలపై ప్రశ్నలు అడగవచ్చు. వాటికి త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యముగారు సమాధానాలను ధర్మభూమి శీర్షికలో ఇస్తారు. ఈ కింది కూపన్‌లో రాసిన ప్రశ్నలకు మాత్రమే సమాధాన మిస్తారు. కనుక మీరు వెంటనే మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ కూపన్ నింపి మాకు పంపండి.

ధర్మసందేహాలు

03/20/2018 - 21:29

263. అన్న దమ్ములట్లు పురోగమించి ఋష్య
మూక నగసమీపంబున సంచరింప
దేవసముల నద్భువ భద్రమూర్తులైన
రాజనందనులను కపిరాజు జూచి

264. ‘‘మంత్రులార! జూచితిరె వారి శరచాప
ధరుల ధీరుల ముని వేషధరుల వాలి
పంపునన్ వచ్చి నట్టున్నవారు గాక
తాపసులకేల శరచాప ధారణములు?’’

04/09/2018 - 21:57

ఈ సుయోధనుడు నిశ్చయంగా కురువంశ వినాశకుడు అవుతాడు. సర్వనాశనమూ ఇతని వల్లనే జరుగుతుంది.’’ అని అనగా దుర్యోధనుడు విదురుని ధిక్కరించి
‘‘ప్రాతికామీ! ద్రౌపదిని తీసికొనిరా! పాండవుల గురించి భయపడవలసిన అవసరము లేదు. విదురుడు పిరికివాడు.’’ అని అనగా ప్రాతికామి సింహపు గుహలోనికి కుక్క ప్రవేశించినట్లుగా రాజ భవనంలోనికి ప్రవేశించి ద్రౌపది వద్దకు చేరాడు. ద్రౌపదిని చూచి ఆమెతో

03/20/2018 - 21:22

* ఆత్మ విమర్శ ప్రతివారికి అవసరమే. కాని అందరూ ఆత్మ విమర్శ చేసుకోరు. ఆ దిశగా ఆలోచించేవారు అరుదుగా కనిపిస్తారు. కాని కపిలబోధలో దేవహూతికి కపిలుడు బోధ చేస్తూ గర్భస్థ శిశువు చేసే ఆత్మ విమర్శ గురించి చెప్పినట్టు ఉంది.

03/19/2018 - 22:19

ప్రస్తుత సమాజంలో ధర్మము దారితప్పుతున్నది. అధర్మం రాజ్యమేలుతున్నది. ఎక్కడ చూసినా ఏరంగంలోనైనా అవినీతి బహుధా కనిపించడం శోచనీయం. నేటి యువతకు ఏది ధర్మమో? ఏది అధర్మమో తెలియని పరిస్థితి నెలకొని యుండుట విచారకరం. తుదకు దైవసన్నిధిలో కూడా నిర్భయంగా అవినీతిని కొనసాగించుట చూస్తే అతిత్వరలో ధర్మసంస్థాపనా యజ్ఞ క్రతువు ప్రారంభమగుట తథ్యము.

Pages