S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యాటకం

03/18/2018 - 21:11

నేను నా కుటుంబంతో కలసి యాత్రలు చేయడం మామూలు విషయమే. కాని ఈ మధ్య మేము పాండిచ్చేరి, మహాబలిపురం లాంటి ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు పాండిచ్చేరికి సుమారు 12కి.మీ దూరంలో ఆరోవెల్లి అనే గ్రామంలో ఒక ధ్యానమందిరాన్ని చూసాం. ఇది మాకు ఎంతగానో నచ్చింది. దాన్ని గురించి రెండు మాటలు మీతో చెబుదామని ... దిమదర్ ఆఫ్ ది శ్రీ అరవిందో ఆశ్రమం వారు దీన్ని ప్రారంభించారని అక్కడివాళ్లు చెప్పారు.

02/16/2018 - 21:00

జ్యోతిష శాస్త్రం అనేది గ్రహ గతులపై ఆధారపడిఉండేది. . సౌరమండలంలోని తొమ్మిది గ్రహాల భ్రమణాన్ని బట్టి మానవుడి జీవన స్థితిగతులు ఎలా ఉంటాయో, ఎలా ఉండనున్నాయో భవిష్యద్దర్శనం చేసేది జ్యోతిష శాస్త్రం. గ్రహాల నుంచి వచ్చే కిరణాలు ఆయా సమయాల్లో జన్మించే జీవరాసులపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

02/15/2018 - 20:55

భక్తవశంకరునిగా, భోళాశంకరునిగా అపార కృపాంబోనిధిగా, కరుణావత్సలుడు కీర్తిగాంచిన కైలాసవాసుడు పరమశివుడు. శివపూజచేయాలంటే పూర్వజన్మ పుణ్యం ఉండాలి. దానికి శివానుగ్రహంఉండాలి. భక్తితో రెండు చుక్కలు నీరుపోస్తే మహాదేవుడైన ఆ స్వామిమనలను కాపాడుతాడు. తెలిసి చేసినా తెలియక చేసినా శివుడు పొంగిపోయ తన భక్తులను కాపాడడానికి పరుగెత్తుకు వస్తాఢు.

02/12/2018 - 22:17

1. సిరిగలవానికి జెల్లును దరుణు పదియారు వేల దగ బెండ్లాడన్ దిరిపెమున కిద్దరాండ్రా పరమేశా గంగ విడుము పార్వతి చాలున్’’ అని శ్రీనాధుడు ఏ సందర్భంగా ఈ చాటువును అల్లేడు?
ఎ) శ్రీనాధుడు కృష్ణుడుకి అఖండ భక్తుడు
బి) శివుడు అంటే గిట్టదు
సి) పల్లవులు పాలించిన పల్నా డులో నీటి ఎద్దడి చూసి
డి) రాయలసీమలో పర్యటించినపుడు గుక్కెడు త్రాగు నీళ్లు దొరకనపుడు

02/08/2018 - 22:24

భారద్వాజ మహర్షి: బృహస్పతి పుత్రుడు ద్రోణాచార్యుని తండ్రి అయిన ఈయన అనేక శాస్త్రగ్రంథాలను రచించారు. అందు ‘అంశుబోధిని’ అను గ్రంథమొకటి. ఈ గ్రంథమందు గ్రహములకు చెందిన సమాచారము - కాంతి (లైట్) ఉష్ణము (ఉష్ణశక్తి -నేడు హీట్ అంటున్నాం), ధ్వని శాస్తమ్రు (సౌండ్), విమాన నిర్మాణ విధి విధానములు, విద్యుచ్ఛక్తి దాని ప్రయోగ విషయముల వంటి అనేక శాస్త్ర విషయాలు చెప్పబడ్డాయి.

02/07/2018 - 21:20

ఓం రుద్రాయ నమః, ఓం నీల కంఠాయనమః, ఓం నమశ్శివాయనమః అంటూ పండితులంతా పరమేశ్వరుడిని అభిషేకాదులతోను, అర్చనాదులతోను పూజిస్తుంటారు. అటువంటి శివుణ్ణి పామరులే కాదు జంతువులుకూడా పూజించి తమ జన్మను సాఫల్యం చేసుకొన్నట్లు మనకు చరిత్ర చెబుతోంది. అటువంటి శివుడు నేడు...

02/05/2018 - 21:04

నరసింహ అను శ్రీకృష్ణ భక్తుడొకడు చిలకలపూడిలో నివసిస్తుండేవాడు. ఆయన నిరంతరం భాగవత సేవ చేస్తుండేవారు. చిన్నతనం నుంచి జ్ఞానదేవుడు, నామదేవుడు, తుకారాం లాంటి భక్తుల కథలను వింటూ తన్మయం చెందేవాడు. తాను వారిలాగా భగవంతుడికి ఇష్టుడిగా ఉండాలనుకొని సాధుజన సేవ చేస్తుండేవాడు. అతడు పూర్వ ఋషుల్లాగా చేతనైనంత లోకానికి మేలు చేయాలని అనుకొనేవాడు.