S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయిన్ ఫీచర్
విమర్శ ఆకస్మికంగా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. కవిత్వం కల్లోలంలో కొట్టుమిట్టాడింది. అనువాదం కృంగిపోయింది. అలసిపోకుండానే అర్ధాంతరంగా ఆగిపోయిన అక్షరయోధుని శ్వాసను నిరసిస్తూ సాహిత్యమే తన వంతు నివాళి అర్పించడానికి విశాఖ ప్రయాణమైంది. చదవడం రాయడం తప్ప ఏమి చేయాలో తెలియనితనం కలాన్ని కాలానికి అప్పగించి హఠాత్తుగా ఆకాశంలో ఆవిరైపోయి సాహిత్య లోకంలో భూకంపం సృష్టించింది.
తెలుగు సాహిత్యంలో శేషేంద్రశర్మగారిని ప్రాచ్య పాశ్చాత్య ఆధునిక భావాల మేలుకలయికగా, యుగీన శ్వాసం ఆవిష్కర్తగా భావించాలి. ముఖ్యంగా సనాతన శాస్త్రాల అధ్యయనం, పాశ్చాత్య కళల్లోని ఆధునికత, సమకాలీనతలు, విప్లవ చైతన్యంతోబాటు ఒక మహత్తర తాత్విక సమావిష్కరణం చేసిన రచనలు చేసారు. గుంటూరు శేషేంద్రశర్మగారిలో విభిన్నకోణాల సమగ్ర దృష్టి అనుశీలనలు సమాజ దార్శనికతల్ని తెలియచెప్పేందుకు చేసిన కృషి ఉన్నది.
స్వచ్ఛంద కవిత పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చే పేర్లలో మాదిరాజు రంగారావు పేరు ప్రముఖమైనది. ఈయన ఇప్పటికి 116 గ్రంథాలు రచించి వచన కవితకు నూట పదహార్లు సమర్పించుకున్నాడు. ఆ తరంలో కుందుర్తి ఆరుద్ర శీలావీర్రాజు ఫ్రీవర్స్ ఫ్రంట్ ఉద్యమం నడిపిన మాట నిజమే కాని నిజంగా అవిశ్రాంత ఉద్యమశీలి మాదిరాజు రంగారావు. ఈయన ప్రాచీనతకు భరత వాక్యము ఆధునికతకు నాందీ ప్రస్తావన. ఈయన అంతరంగం విశ్వనాథ బహిరంగం శ్రీశ్రీ.
తెలుగు సాహిత్యం పుట్టి వెయ్యేళ్ళయింది. వివిధ సాహిత్య ప్రక్రియలయిన కావ్యం, నాటకం, కథ, కవిత మొదలైన వాటితో సాహితీ సృజన కొత్త పుంతలు తొక్కుతోంది. ఏ ప్రక్రియలోనైనా వౌలికంగా పరిశీలించాల్సింది వస్తువు, రూపం, సంవిధానం, పాత్రలు. ఈ వర్గీకరణలో పాత్రలు ప్రధాన అంగాలు. పాత్రలు అంటే కథను లేదా ప్రక్రియను నడిపించేవారు, కథావస్తువును భరించేవారు, కథాంశాన్ని సూచించేవారు.
మే 7న విశ్వకవి టాగూర్
158వ జయంతి సందర్భంగా...
*
ఆత్మన్యూనత వ్యక్తి బలహీనతకు పరాకాష్ఠ. ఇట్టివారికి ఆత్మసాంత్వన మొక భ్రమాతర్పణము తప్ప మార్గాంతరము లేదు. మన వారెంత చెప్పినను విపరీతముగనే స్వీకరింతురు. పాశ్చాత్యులు దీనిని డళచి డ్య్ఘషళగా చెప్పిరి గనుక దానిని శిరసావహించి పరిష్కారముగా అక్షరముల నావిష్కరించుచున్నారు. తత్ఫలితమే కవులయి కట్టుబోతులగుట. కవులెందుకో ఈ మార్గమునెంచుకొనుచున్నారో; అదెట్లు పరిష్కారమో తెలియదు.
సాహితీ జగత్తులో కొంతమందికి రామాయణ రచనతో కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. మరికొంతమందికి ‘భారత రచన’తో గొప్ప కీర్తివస్తుంది. సరే, భాగవతాన్ని ఒకవేళ తలక్రిందులుగా తపస్సుచేసి వ్రాసినా ఆ ‘పోతన’గారిని మాత్రం ఎవడూ మించి వ్రాయలేడు. దాటిపోలేడు. అది వేరే విషయం. ఇక అద్యతనాంధ్ర సాహిత్యంలో గొప్పగొప్ప చారిత్రక నవలలు వ్రాసి విశేష కీర్తినార్జించినవారూ ఎందరో ఉన్నారు.
‘‘దశలు దశలుగా సాగుతున్న జీవితంలో
చరమాంకం ఎట్టుండా స్వీకరించాల్సిందే
దుఃఖాన్నయినా ఆనందంగా అనుభవించాల్సిందే
అయితే..
ఒక పనిలో మునిగినవాడికి
కవిత్వమొక తీరని దాహం’ అని అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆ దాహానికి అరదండం వేయకపోతే అనితరసాధ్యమైన కవిత్వాన్ని ఏ కవి అయినా స్పృశించగలడు మరియు సృజియించగలడు. కవిత్వము నిరంతరమూ ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించేదై ఉండాలి. కవిత్వమంటే అచేతనంగా ఉండే మనసులను కదిలించేదిగా ఉండాలి. నిజాన్ని రాయడం, ఆ నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగేదిగా కవిత్వం ఉండాలి.
తొలి తరం అభ్యుదయ కవి ఏటుకూరి వెంకట నరసయ్య. 1933 నుండి 1949 వరకు మొత్తం 16 సంవత్సరాలు మాత్రమే ఏటుకూరి కవిత్వ సృజన చేయగలిగారు. తొమ్మిది పద్య కావ్యాలు, ఒక హరికథ, చందమామ గేయకథలు మొదలైన రచనలు చేశారు. గాధావళి పేరుతో మర్యాద రామన్న తీర్పులు ప్రచురించారు. 13వ ఏట తెనాలి అమృతలూరులో సంస్కృత విద్యాభ్యాసం చేశారు. తెనాలిలోని సూత్రాశ్రమ ప్రవేశం చేశారు.