S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/06/2018 - 21:28

గడ్డిపరకలని పేని మదపుటేనుగును బంధించవచ్చు.. అనే పద్యాన్ని చిన్నప్పుడు వల్లెవేశాం కదా! అలాగే పావురాలన్నీ వలతో సహా పైకెగరడం పంచతంత్ర కథల్లో చదువుకున్నాం కూడా.. అచ్చం అలాగే ఆ పాఠశాల విద్యార్థినులందరూ ఏకమై ఆపరేషన్ గ్రీన్‌పోలీస్ పేరుతో నగరాన్ని శుభ్రం చేసే పనిలో పడ్డారు. కలిసికట్టుగా నడుం బిగిస్తే ఎంత పెద్ద సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు అని నిరూపించారు వీరు.

04/05/2018 - 21:13

పిల్లల పెంపకం ఒక కళ. అందునా ఆడ పిల్లల్ని పెంచటం మరింత కష్టతరం. ఈరోజుల్లో చాలామంది తల్లులు ఆడపిల్లలను తమ కు నచ్చిన విధంగా అలంకరించుకోవడానికి గానీ, పాశ్చాత్య దుస్తులు ధరించటానికి గానీ అడ్డు చెప్పలేకపోతున్నారు.
ఫలితంగా చాలామంది అమ్మాయిలు సమయం సందర్భం లేకుండా, ఎండాకాలమా, చలికాలమా అనే విచక్షణ లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు తమ ఇష్టానుసారం జీన్స్, టీషర్టు ధరించి తిరుగుతున్నారు.

04/04/2018 - 22:30

బందనా భర్త మనీష్ లక్నోలోని ఐఐఎమ్‌లో చదువుకునేవాడు. బందనా భర్త దగ్గర ఏ విషయం దాచకుండా అన్నీ చెప్పేసింది. తనకు ఆర్ట్ అంటే చాలా ఇష్టమని, మీరు గనక ముంబైలో ఉద్యోగ ప్రయత్నం చేస్తే మనం ముంబైకి మారిపోవచ్చు. అప్పుడు అక్కడ నేను జె.జె. కాలేజీలో చేరవచ్చు అని చెప్పింది. అందుకు మనీష్ అంగీకరించడంతో బందనా జె.జె. కాలేజీకి దరఖాస్తు చేసుకుంది.

04/04/2018 - 00:03

పేరు: భావన దుర్గం
వయసు: 21 సంవత్సరాలు
చదువు: ఇంజనీరింగ్
లక్ష్యం: సేవాకార్యక్రమాలు
తపన: మిస్ ఇండియాగా ఎంపిక కావడం
సాధించినవి: మిస్ కఠ్ణాటక కిరీటం

04/02/2018 - 21:23

ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనం..
కాలవేగాన్ని వెనక్కి నెట్టాలన్న కోరిక..
అన్నింటిలో ముందుండి ఆకాశానికి నిచ్చెన వేయాలనే ఆశ..
వీటన్నింటి నడుమ జీవితం విసిరే చిన్న చిన్న సవాళ్ళను కూడా ఎదుర్కోలేని మానసిక స్థితి.. ఫలితంగా డిప్రెషన్.. దీనికి అత్యంత సులువైన పఠిష్కారం ఆత్మహత్య. ఇదీ ఇప్పటి యువత పరిస్థితి.

04/01/2018 - 22:30

ఈ రోజులలో నగరాల్లో కానివ్వండి, పట్టణాలలో కానివ్వండి, విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ సమస్య ఒక్క యువతను తప్పించి మిగిలినవారందరికీ భయాందోళనలు కలిగిస్తున్న విషయం అందరూ అంగీకరించేదే!
ఇలా ఎందుకన్నానంటే వారికి భయం గియం లేకుండా వారు బస్సుల్లో ప్రయాణించే పద్ధతి చూసి, అతి గారాబంతో కొందరు తల్లిదండ్రులు ద్విచక్రవాహనాలను నడిపించడానికి వారికిస్తున్న అనుమతిని చూసి ...

03/30/2018 - 21:30

కాలేజీ చదువుతున్న యువతకు మొబైల్, సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫ్యాషన్స్.. ఇవే లోకం. కానీ కాలేజీ విద్యార్థిని అయిన శ్రీలక్ష్మి మాత్రం ఔత్సాహిక వ్యాపారవేత్తగా ప్రపంచం దృష్టిని ఆకఠ్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మందికి పైగా క్లయింట్లకు ఆమె కంపెనీ సేవలు అందిస్తోంది. శ్రీలక్ష్మి ఇప్పటిదాకా నలభైకి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది.

03/29/2018 - 21:45

‘రుతుపవనాల జూదం’లో ఎప్పుడూ ఓటమి పాలయ్యేది- పొలాన్ని నమ్ముకున్న రైతులే.. కాస్తో కూస్తో వర్షాలు పడి కర్షకులు ఆరుగాలం శ్రమించినా- పంటకు గిట్టుబాటు ధరను నిర్ణయించే అవకాశం వారికి ఏనాడూ లేదు.. కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో ప్రభుత్వాలకు రైతులంటే అనాదిగా చిన్నచూపే.. కొండకోనల్లో గిరిజనులు చెమటోడ్చి పంటలు పండించినా భూమిపై వారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు..

03/28/2018 - 21:52

ఎవరైనా ఒక ఆటపై మోజు పెంచుకుంటారు. ఆ ఆటనే ఆడతారు. కానీ మనూ భాకర్ మాత్రం తనకెదురైన ప్రతి ఆటనూ నేర్చేసుకుంది. మనూ ఆరేళ్ళ వయస్సు ఉన్నప్పుడు ఆమె తండ్రి రామ్‌కిషన్ ఆమెను బాక్సింగ్‌లో చేర్పించాడు. తర్వాత ఆమె కబడ్డీ, మణిపురి మార్షల్ ఆర్ట్ అయిన టంగ్‌టా, కరాటే, టెన్నిస్.. ఇలా చాలా ఆటలు నేర్చేసుకుంది. ఆడటమే కాదు పతకాలనూ తెచ్చుకుంది.

03/27/2018 - 21:16

మహిళలు అన్ని రంగాల్లోనూ క్షిపణుల్లా దూసుకుపోతున్నారు. పురుషాధిక్య రంగాలుగా స్థిరపడ్డ కొన్ని రంగాల్లోకి మహిళలు ప్రవేశించడానికి చాలా కష్టపడాల్సివస్తోంది. ఒక్కసారి అడుగుపెట్టాక వారు కనబరిచే ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి పురుషాధిక్య రంగమైన ‘ఫైర్ ఫైటింగ్’లోకి తొలిసారిగా ఓ మహిళ ప్రవేశించి చరిత్ర సృష్టించడమే కాకుండా బుల్లెట్‌లా దూసుకుపోతోంది. ఆమే హర్షిణీ కనే్హకర్.

Pages