S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/01/2018 - 22:28

అన్ని రంగాల్లో పురుషులతోపాటు సమానంగా రాణిస్తున్నారు మహిళలు. ఇది నిజమే..కేవలం ఉద్యోగాలే కాదండోయ్... వ్యవసాయంలోనూ మేము పురుషులతోపాటు ఏమాత్రం తీసిపోము అంటారు ఓ పల్లెలోని మహిళలు. పట్టుచీరలు కట్టుకుంటే పుత్తడి బొమ్మల్లా కనిపిస్తారు మహిళలు. ఆ పట్టు తయారీకి మూలం మల్బరీ. అనంతపురం జిల్లాలో మల్బరీ గ్రామంగా పేరొందిన నల్లమాడ మండలంలోని కుటాలపల్లిలో వ్యవసాయం చేయడంలో మహిళలదే పైచేయి.

03/01/2018 - 02:26

బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, సైక్లింగ్, స్కూబాడైవింగ్.. ఈ జాబితాకు అంతే లేదు.. అన్ని రకాల ఆటల్లోనూ సత్తా చాటుకుంటానని ఆమె సవాలు చేస్తోంది.. శారీరకంగా ఎలాంటి లోపం లేని వారు ఇలాంటి సవాలు చేస్తే ఎవరూ అంతగా విస్మయం చెందనక్కర్లేదు.. చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ఆమెలోని ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం.. అసాధారణ ప్రతిభకు ఆమె ఓ నిదర్శనం..

02/27/2018 - 22:03

నేడు ఎటు చూసినా ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణాలకు అంతే లేకుండా పోతున్నది. యువత ప్రేమ పేరుతో జీవితాలను సర్వ నాశనం చేసుకొంటున్నారన్నది అక్షర సత్యం. అల్లారుముద్దుగా పెంచుకొంటున్న అమ్మనాన్న లకు తీరని వ్యధను మిగులుస్తున్నారు. నిజమైన ప్రేమ ఎదుటి వారి అంతం చూడదు. కాని యువత అదేమీ పట్టకుండా ప్రేమ పేరుతో చేస్తోన్న ఆరాచకాలు ఎన్నని చెప్పగలము.. మరికొంతమంది క్షణికమైన ఆకర్షణ కు గురై..

02/26/2018 - 22:17

ఈనాటి పిల్లల్లో చాలామందికి వాళ్ళ నాన్నమ్మ, తాతయ్యల ప్రేమ ఎంత రుచిగా వుంటుందో తెలియకపోవచ్చునేమో కానీ నాకు మాత్రం అట్టి అదృష్టం లభించినందుకు గర్వపడకుండా ఉండలేకపోతున్నాను.
ఇపుడు మా తాతయ్యకు 95 ఏళ్ళు, నాన్నమ్మకు 90 ఏళ్ళు, ఇద్దరి జీవితాలూ ఇప్పటివరకూ మంచి ఆరోగ్యంతోనే గడపడం చెప్పుకోతగిన విషయం. అయితే గత ఐదేళ్లుగా వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చిందనే చెప్పాలి.

02/25/2018 - 19:22

భళా భారతీయ రైల్వే!
టిక్కెట్ కలెక్టర్ మొదలుకొని స్టేషన్ సూపరింటెండెంట్ వరకూ, విచారణ కేంద్రంలోని ఉద్యోగి నుంచి స్టేషన్ మాస్టర్ వరకూ ఆఖరికి స్టేషన్‌లోకి
ప్రవేశించే రైళ్ళకు మార్గాలను నిర్దేశించే పాయింట్స్‌మెన్ విధులను కూడా నిర్వహించే వారందరూ మహిళలే !

02/23/2018 - 20:58

ఈ రోజు సరిత తన భర్త కొలీగ్ కల్పనని డిన్నర్‌కి పిలిచింది. కల్పన తన భర్తతో కలిసి అనుకున్న సమయానికి సరిత ఇంటికి వచ్చింది. సరిత, భర్త వినయ్, కల్పన దంపతులు నలుగురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా భోజనం కానిస్తున్నారు. ఇంతలో సంభాషణ కల్పన, వినయ్‌ల ఆఫీసు విషయాలవైపు మళ్లింది.

02/22/2018 - 21:04

మనుష్యులందరూ సమానమే అయినా స్ర్తికి మాత్రం ప్రకృతి ఎక్కువ బాధ్యతలనే పెట్టింది. ఇక జీవితంలోను అంతా ఆడాళ్లదే బాధ్యత అంటూ స్ర్తిని కొన్నాళ్లు వంటింటికి పరిమితం చేసినా నేడు పరిమితులు లేవు మీరు సంపాదించుకోండి. మీకూ సమాన అవకాశాలు అంటూ అన్నిరంగాల్లోకి స్ర్తి దేదీప్యమానంగా దూసుకెళ్లే అవకాశాలు వచ్చాయి.

02/21/2018 - 20:33

ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని ఏడడుగులు నడిచి పదిమంది ఆశీర్వాదంతో వధూవరులు ఒకటవుతారు. గృహస్థాశ్రమంలోకి అడుగుపెడతారు. అప్పటిదాకా ఇరువురు వేరువేరు ప్రదేశాలల్లో జీవించినవారు ఇకపై ఒకచోటనే కలిసి జీవిస్తారు. ఇద్దరికీ వేర్వేరు అభిప్రాయాలు నిన్నటి దాకా ఉంటాయి. కాని ఇకమీద ఒకరి అభిప్రాయానికి మరొకరు గౌరవిస్తారు. ఒకరికి నచ్చిన విషయాలను మరొకరు నచ్చుకునేలా తమను తాము మార్చుకుంటారు.

02/20/2018 - 21:16

ఏడాదికొకసారి మహిళలను గౌరవించినంత మాత్రాన మహిళాభివృద్ధి జరిగిపోతుందా? దేశంలో ఎంతోమంది మహిళలు ఉంటే 100మంది మహిళలు గెలిస్తే అది అందరి విజయం అవుతుందా? ఆకాశంలో సగం అన్నారు. ఎక్కడ స్ర్తిలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు.. అని అన్నారు. అది ఆనాటి మాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో పురుషులతోపాటు మహిళలకు అవకాశాల్లో మాత్రం సమానత్వం ఎక్కడ ఉంది.

02/19/2018 - 21:31

నిజమే అమ్మ అంటే అమృతమూర్తే. అనురాగం, అప్యాయత లే ఆమెను చూస్తే గుర్తుకువస్తాయి. మహాభారత కాలంలో భృంగాశ్వుడు అను ఒక రాజు ఉండేవాడు. అతనికి సంతానం లేదు. ఎన్నో యజ్ఞాలు యాగాలు చేశాడు. కాని సంతానాన్ని పొందలేకపోయాడు. ఎలాగైనా సంతానం కావాలని ఇంద్రుడికి సమ్మతి లేని యాగం చేశాడు. దాంతో ఆయనకు వంద మంది పుత్రులు కలిగారు.
ఎంతో సంతోషంతో పుత్రులతో కాలం గడుపుతున్నాడాయన.

Pages