S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/24/2019 - 21:24

ప్రేమించడం
మరచిన మనసు
తన సహజ
గుణాన్ని వదిలి
పగతో రగిలిపోతుంది
ప్రశాంతంగా పారుతున్న
రక్తం కాస్తా
పగ పగ అంటూ
పరితపిస్తుంది
కులమతాలని
ఏకం చేసిన
ప్రేమని చూసి
కత్తి పగబట్టింది
నడిరోడ్డుపై దాని
గొంతుని తెంపివేసింది..

02/24/2019 - 21:23

సప్తస్వరాల కోయల రాగమా
ఆమని గీతమా
సుమధుర నీ కుహుకుహుల
ఆలాపన విన నా
మది నిండా మరుమల్లెలు పూచే
కన్నుల్లో మెరుపులు మైమరపించే
అధరాలపై చిరునవ్వుల వర్షం కురిసే
కడలి తరంగమల్లే ఉత్సాహం పెల్లుబికే
మయూఖాలు మురిసి మెరిసే
మయూరాలు పురివిప్పి నాట్యమాడే
ముసి ముసి నవ్వులతో భానుడే ఎరుపెక్కె
తెల్లని వెండిమబ్బు
నురగలు తరగలై ఇలకు జారె

02/24/2019 - 21:21

ఇదంతా మామూలే
అలవాటుగా వింటూన్న, కంటూన్న
విషయాలన్నీ మామూలే
ఉదయం వార్తతో ఒకింత ఉలిక్కిపడ్డానే్నను
వింటూండటం మామూలే అయనా
విస్ఫోటక విషయం హృదయ విదారకం.

02/17/2019 - 23:26

ఎగిరే పక్షికి తెలుసు
నింగిలోని సౌఖ్యం
ఎంతగా అంబరాన్ని చుంబిస్తుందో
నీటిలోని చేపకు తెలుసు
నీళ్లలోన ఊపిరి
ఎంత చక్కగా నిలబడుతుందో
మట్టిలోని మొక్కకు తెలుసు
మట్టికున్న పట్టు
ఎదగడానికి ఎంతగా ఉపకరిస్తుందో
అడవిలోని జంతువుకు తెలుసు
వన విహారం
తన నైజాన్ని ఎంతగా తృప్తిపరుస్తుందో

02/17/2019 - 23:24

పద్యాలు మాలగా అల్లితే
చక్కని కావ్యం ప్రత్యక్షం
కవిత్వానికి ప్రాణం పోస్తే
మది అంతా సుగంధ పరిమళం
కథగా కదిలితే
కనుల చెమరింపు తథ్యం
నవలై ప్రతిబింబిస్తే
జీవిత పాఠం సాక్షాత్కారం
నాటిక సంభాషణలు పండితే
మనుషుల్లో మార్పు అనివార్యం
గజల్గా ఉదయస్తే
పదపదంలో ప్రేమ సందేశం
అసలు తెలుగంటేనే
అందమైన సాహిత్య విన్యాసం

02/17/2019 - 23:23

రంగురంగుల బొమ్మల కోసం
పసికూనలు ముచ్చటపడతారు
చేతికందితే మురిపెంగా స్పృశిస్తారు
కేరింతలు కొడతారు

02/17/2019 - 23:21

అరిగపూడి పూర్ణచంద్రరావు స్మారకార్థం లయన్ డా. అరిగపూడి విజయకుమార్ సౌజన్యంతో ‘మల్లెతీగ’ కథల పోటీ నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు కలిమిశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీకి రొటీన్ కథలకు భిన్నంగా మన సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని చక్కటి శిల్పం, కథనాలతో తెలుగువారి జీవన సంస్కృతిని ప్రతిబింబించే కథల్ని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.

02/17/2019 - 23:21

ఏ కవికైనా తాను వ్రాసిన కవిత్వాన్ని నలుగురికి చూపించాలనీ, పదిమందికి వినిపించి ఆనందింపజేసి అభినందనలు అందుకోవాలనే తపన సహజంగా ఉంటుంది. కానీ గతంలో కవి పుంగవులందరికీ అన్ని వేళల్లోనూ ఇది సాధ్యం కాక ఇబ్బందులు పడుతుండేవాళ్ళు నేడు సోషల్ మీడియా పుణ్యమా అని ఆ ఇబ్బంది కొంత తొలగినట్లుంది. కారణం చాలా కవితా సమూహాలు వాట్సప్‌లో ప్రారంభం కావడం. దీనివల్ల పాఠకులకు కూడా చాలా ఇబ్బందులు తొలగిన మాట వాస్తవం.

02/12/2019 - 23:38

ష్! నెమ్మదిగా, గోడకు చెవులుంటాయ్!
జైలుగోడల మధ్య, కోట గోడలు చెప్పిన చారిత్రక కథలు
దేవాలయ గోడలపై భక్తి కథా చిత్రాలు
సంకుచితాభిప్రాయాల, భావాల గోడలచే
విడగొట్టబడని, వసుధైక కుటుంబంగా
నా దేశం వెలుగొందాలన్న విశ్వకవి,
గోడమీద బొమ్మ, గొలుసుల బొమ్మ,
గోడ దూకిన దొంగ
గోడ పత్రికలు, గోడమీద పిల్లివాటం
ప్రహరీగోడ, చైనాగోడ,
బెర్లిన్ గోడ, మెక్సికో గోడ

02/12/2019 - 23:30

మంత్ర తంత్రాల
విభూతి చంమత్కారాలన్నీ
గాలికెగిరిపోయ...
మందుమాకులన్నీ
చేతులెత్తేసిన సమయాన,
మృత్యువు దరిదాపుల్లో
స్వర్గనరకాల భ్రమావరణంలో
ఇక దిక్కెవరని -
దిక్కులు చూస్తున్న మనిషి
జీవాణువుల
ప్రకృతి రహస్యాల
గహనాటడువులలో
అర్థిస్తున్నాడు మోకరిల్లి
ప్రాణభిక్ష పెట్టమని!!

Pages