S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/30/2019 - 22:20

చారిత్రక నవలా చక్రవర్తి బిరుదాంకితులు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్‌కు 2019 పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి సాహితీ పురస్కారం అందజేస్తున్నట్టు శ్రీమతి పోలాప్రగడ రాజ్యలక్ష్మి తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శ్రీ త్యాగరాయ గానసభలో 2, జనవరి 2020న జరుగుతుంది. సభకు శ్రీ త్యాగరాయ గానసభ అధ్యక్షులు శ్రీ కళా జనార్దనమూర్తి, డాక్టర్ ఓలేటి పార్వతీశం, ముక్తేవి భారతి ప్రభృతులు విచ్చేస్తున్నారు.

12/30/2019 - 22:17

ఏరువాకొచ్చి ఎనే్నళ్ళయింది
ఏటా వచ్చేదిప్పుడు ఎటో వెళ్లిపోయింది
నాగలి కఱ్ఱు వేసే నలువారు చాళ్ళదువ్వెన
కనపడక అఱకను వెతుక్కొంటూ
అటెటో వెళ్లిపోయింది
అతీ గతీ లేదు; ఆనుపాన్లు అసలే వేవు
చేను చవిటి పఱ్ఱగ మారే
చలపొడుస్తున్న కాలం గదా
చలవ దుక్కులు పోయి
చాలా కాలమే అయింది
పురా వస్తుశాల వంటి పాత నిఘంటవుల్లో
స్వేచ్ఛావశేషాలు పడివున్న

12/23/2019 - 22:11

నిషాల నిశిలో తుషార జల్లుల్లో
తూర్పు కనుమల కోమలాంగి సిగలో
తురిమిన ధవళ పుష్పాంగి లంబసింగి
మంచు కౌగలి వీడుతున్న 3అరుణు2డి
సొగసు చూస్తే నారింజ కనకాంగి
చలికి వణికి పెదాలు పొణిగే
వింతభాషకి అక్షరాలుపొదిగి
గొంతుపలికే రాగాలకు
తలలూపే వృక్షాల లతాంగి
మంచును కళ్లతో కొలుస్తూ
లంబసింగి అందాన్ని చూస్తుంటే
తనివితీరని సుధాంగి

12/23/2019 - 22:09

ఊరి చెరువు నిండారై
మత్తడి పారినాక పరదేశం పోయే
పనేమున్నది నిర్వాజ్యం పల్లె!
నాల్గుగుంటల భూమైతేనేం
కుంటుపడకుండ సూసుకుంటే
కలకాలం కుబేరులమన్నట్లే
కుచేలుని కాలం పోయేనట్లే
ఇక పడితి వడుగడు మాటలేదు
కాపుకు గడియ తీరికెక్కడిది
నిద్రల గూడ ‘పంటభూదేవి’
కలలకచ్చి తడిపెట్టుమని లేప్తది
పాల పాలలెక్క
ఒక్కో వడ్లగింజ మీద

12/23/2019 - 22:08

అడుగడుగునా
పురుషాహంకార కంటకాలు
పాదాలకు గుచ్చుతున్నా
బతుకు పుస్తకంలో
అణచివేత పుటలు దర్శనమిస్తున్నా
అన్ని రంగాల్లో దూసుకుపోయే
మగువకు హక్కుల రక్షణ ఏది?

12/23/2019 - 22:05

కవిత్వమంటే ఏమిటో, కావ్య ప్రయోజనమేమిటో దిఙ్మాత్రంగా తెలిసికొన్నాం. ఎన్ని శాస్త్రాలు, లక్షణ గ్రంథాలు చదివినా అవి కార్యరసాస్వాదనకు కొంతవరకుపకరించవచ్చు. వాని ప్రయోజనమంతే.

12/16/2019 - 04:02

గుండెల్లో గూడల్లుకుపోతున్న
స్వార్థ సంకుచిత భావగణాలు
వేళ్లూనుకుపోతూ విస్తరిస్తున్నాయి
మానవత్వాన్నీ వెక్కిరిస్తూ
అరంగుళం జాగాకోసం సలిపే
అవిశ్రాంత అంతర్యుద్ధాలు!
పగలూ ప్రతీకారాలూ
ఆరని అగ్ని జ్వాలలై
మన్ఫఃలకాలను పగులగొట్టేస్తున్నాయి!
విచక్షణా జ్ఞాన శూన్యతకు
పరాకాష్ఠగా నిలుస్తున్న ప్రబుద్ధులు
అంతటాతారసపడుతున్న నేపథ్యంతలో

12/16/2019 - 04:00

సంగీత - సాహిత్య సంచారిణి
*సుహృల్లేఖ -5
**

12/11/2019 - 23:59

ఖాళీ చేయబడ్డ
మహా శూన్యంలోంచి
ఓ దృశ్యం

జీవితంగా చిగురు తొడిగి
దేదీప్యమానంగా వెలిగిపోతుంది
అంతుచిక్కని ఈ చిక్కుముడిని
బహిరంగ రహస్యంగా విప్పిపరిస్తే

మరుక్షణమే
హృదయ ప్రపంచమంతా
నీ పాదాక్రాంతమవుతుంది

కొద్ది క్షణాలు
నాలోకి నేనే ప్రత్యక్షమవుతాను
లోలోపటి ఒంటరితనమంతా
కళ్లముందే బద్దలై
మహా విస్ఫోటనాన్ని సృష్టిస్తుంది

12/11/2019 - 23:57

శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారం ప్రారంభించాక ఇది పదమూడో సంవత్సరం. ఇంతవరకు నవలకు (2008, 2011, 2014, 2017), నాటకానికి (2009, 2012, 2015, 2018), పరిశోధనకు (2010, 2013, 2016, 2019) ఈ పురస్కారం ప్రదానం చేశాము.

Pages