S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

04/20/2018 - 21:35

‘సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు’ - కీర్తన 1:33

04/19/2018 - 21:33

వేదాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఉన్నదే అయినప్పటికి, ప్రజలు మరిచి పోయిన అంశాలను తిరిగి ఉటంకిస్తూ అద్వైత మత స్థాపనాచార్యుడైనాడు ఆది శంకరుడు.

04/18/2018 - 20:55

భారతీయ ధార్మిక సమాజంలో వీరశైవం ధార్మిక విప్లవాన్ని తీసుకొని వచ్చింది. వీర శైవాన్ని ప్రభోదించిన బసవేశ్వరుడు ధార్మిక ప్రవక్తగా, ఒక సాంఘిక సంస్కర్తగా బసవేశ్వరుడు చరిత్రలో సుస్థిర స్థానం పొందారు. లింగాలు ధరించిన వారంతా వీరశైవులే అనే ఒక ఉన్నత లక్ష్యంతో వీరశైవం ధర్మాన్ని స్థాపించిన ధర్మయోగి బసవేశ్వరుడు సమాజంలోని ప్రజలంతా భగవంతుని దృష్టిలో సమానులే అనే ధర్మసూత్రాన్ని వీరశైవం చాటి చెబుతుంది.

04/11/2018 - 21:11

* శ్రీపాద వల్లభాచార్య జయంతి సందర్భంగా...

04/05/2018 - 21:38

ఒక్కో భగవంతుని రూపానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. రామసేవకునిగా, రామబంటుగా ఆంజనేయుడు బహు ప్రసిద్ధిపొందాడు. రామాయణంలో ఆంజనేయుని పాత్ర మహోన్నతమైంది. సుగ్రీవుని ప్రోద్బలంతో రామలక్ష్మణులు ఎవరు అని కనుక్కోవడానికి వచ్చిన ఆంజనేయుడు మొదటి చూపులోనే మొట్టమొదట సంభాషణలోనే రామునికి నచ్చాడు. రాముడు ఆంజనేయుడు మాట్లాడిన విధానాన్ని బట్టి అతడు ఉత్తముడని గ్రహించాడు. అందుకే సోదరుని స్థానాన్నిచ్చాడు.

04/04/2018 - 02:32

బౌద్ధమతంలోని మంచి సిద్ధాంతాలను చేర్చి, అద్వైత మత స్థాపనాచార్యుడైనాడు ఆది శంకరుడు. తూర్పున జగన్నాథంలో ‘‘గోవర్ధన మఠం‘‘, పశ్చిమాన ద్వారకలో ‘‘శారదామఠం’’, ఉత్తరాన కేదారంలో ‘‘జ్యోతిర్మఠం’’, దక్షిణాన శృంగేరియందు ‘‘శృంగేరి మఠం’’ స్థాపించి మత కార్యనిర్వహణార్థం దేశం నలు చెరుగులా సంచరించి, అద్వైత తత్వాన్ని వివరించి, దిగ్విజయ యాత్ర కొనసాగించారాయన.

03/21/2018 - 21:10

మనం ఎవరినయినా లేదా దేన్నయినా అమితంగా ఇష్టపడుతున్నప్పుడు, వారి చుట్టూ మన ఆలోచనలు అల్లుకుని దాని ప్రకారం మన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నప్పుడు ఏ చిన్న అవాంతరం వచ్చి దాన్ని కదిలించి వేస్తుందో అనే అభద్రతాభావం నుంచే ఈర్ష్య పుడుతుంది.

03/11/2018 - 21:18

పగ .. శత్రుత్వం.. విరోధం వీటి గురించిన జ్ఞానం మనకు మహాభారతం ఇస్తుంది.

03/08/2018 - 21:09

మానవులు మననశీలురు. ఆలోచించి చక్కగా విచారించి కార్యాన్ని సాధించడమే మానవుని సహజ స్వభావ గుణంగా ఉండాలి. దానాది ధర్మ కార్యాలతో పేదలకూ, దీనులకు, దుఃఖితులకు సాయపడాలి. మంచి జ్ఞానం- సుచరిత్ర- సుశీలంతో నీతివంతమైన జీవనం సాగించాలి. ధైర్యాన్ని ధరించి సత్యభాషణా ధర్మాచరణను పాటించాలి. మానవులు తమ కోసం జీవించడం విశేషం కాదు. పరుల కోసం జీవించడమే శ్లాఘనీయం. ప్రశంసనీయం. ఇతరులకు మేలు చేయడంలోనే ఆనంద ముందని గమనించాలి.

03/07/2018 - 21:06

కర్మ శబ్దము ‘కృ’ ధాతువు వలన నిష్పన్నమైనది. కావున దానికి ‘చేయుట’ అని కాని, ‘నడవడి’ యని కాని, ‘వ్యాపార’మని కాని అర్ధము. ప్రాచీన వైదిక ధర్మానుసారముగా యజ్ఞ యాగాదికములే కర్మలు. త్రేతాయుగం, ద్వాపర యుగాల్లాంటివి వాటిలో తపస్సు, ధ్యానం అనేవి చేస్తేనే భగవంతుడు మోక్షాన్ని ఇస్తాడని అనేవారు. కాని నేడు కలియుగంలో కేవలం నామజపం చేస్తే చాలు భగవంతుడు పాపరాశిని దగ్ధం చేస్తాడు. పుణ్యఫలాలనిస్తాడు.

Pages