S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్వాధ్యాయ సందోహం
భగవంతుడు ఉత్తమ రచన చేసాడు
ఉప హ్వయే సుదుఘాం ధేనుమేతాం
సుహస్తోగోధుగుత దోహదేనామ్
శ్రేష్ఠం సవం సవితా సావిషన్నో-
భీద్ధో ఘర్మస్తదు షుప్ర వోచమ్
భావం: ఉత్తమమైన పాలను సులభంగా ఇచ్చే ఈ ధేనువునకు దగ్గరగా ఉండాలని కోరుకొంటున్నాను. చేతులయందు నేర్పరితనం గలవాడే ఆ ఆవును పిండగలడు. తేజస్స్వరూపుడైన పరమాత్మ మా కొరకు ఉత్తమ లోకాలను ఉపదేశాలను కల్పించగలడు.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
నాయకుని లక్షణాలు
భువో యజ్ఞస్య రజసశ్చ నేతా యత్ర నియుద్భిః సచనే శివాభిః
దివి మూర్ధానం దధిషే స్వర్షాం జిహ్వామగ్నే చకృషే హవ్యవాహమ్॥
॥
విద్యవలన సుశిక్షితమైన హృదయంలో జనించే నీతి లేదా ధర్మమని అర్థం. ఎందుకంటే మానవుడుగా సృష్టించిన ద్రవ్యంగాని వస్తువుగాని లోకంలో లేదు. కాబట్టి దైవానికర్పించే వస్తువేదైనా అది భగవానుని సొత్తు మాత్రమే. అలా అర్పించాలంటే ముందుగా ఆ పరమాత్ముడిచేత మానవులకు ప్రదానం చేయబడాలి కదా. భగవానుడు ప్రదానం చేయని ద్రవ్యం మానవుడికెక్కడి నుండి ప్రాప్తమవుతుంది?
నా నేత్రాలయందు, హృదయమందు, మనస్సునందుగల దోషాలను సకల జన మహాసంరక్షకుడగు పరమేశ్వరుడు తొలగించి నన్ను పరిపూర్ణుని చేయుగాక! సకల భువనాలకు ప్రభువైన భగవంతుడు మాకు శాంతి ప్రదాయకుడగుగాక!
శరీరం ఆత్మకు నివాస స్థానం. అదే ఆత్మ అనే సరస్వతీనది ఐదు విధాలుగా ప్రవహిస్తూంది. అయితే బయటనుండి విషయ వాసనలు ప్రవహింపచేసే ఇంద్రియ ప్రవాహాలను నిరోధిస్తే ఆత్మ అనే సరస్వతీనది ఏకైక రూపమై ప్రవహిస్తుంది. ఈ విషయాన్ని కఠోపనిషత్తు ఇలా వివరించింది.
యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతే తమాహుః పరమాంగతిమ్॥ (కఠోపనిషత్తు. 1-6-10)
ఈ ప్రశ్నకు సమాధానంగా యాజ్వవల్క్యుడు ఇలా సమాధానమిచ్చాడు.
‘మహిమాన ఏవై తేషామేతే, త్రయస్ర్తీంశత్వేవ దేవాః’ ‘‘సంఖ్యాపరంగా దేవతలు మూడువేల మూడువందల ముప్పది తొమ్మిది కంటె అధికమే. కాని ప్రధాన దేవతల సంఖ్య మాత్రం ముప్పది మూడు మంది మాత్రమే. ఈ దేవతలందరు ‘అగ్నిం అసపర్యన్’ ‘అగ్ని’ జీవుణ్ణి పూజిస్తారు.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఆ తరువాతపరమాత్మనారాధించి తన్మయుడవుతున్నాడు. ముండక మహర్షి ఈ మంత్రార్థానే్న గ్రహించి ముండకోపనిత్తు ఇలా వివరించాడు.
పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాన్నాస్త్యకృతః కృతేన॥ ॥
ఈ మంత్రంలో భగవంతునకు గల అనేక నామాలలో కొన్ని పేర్కొనబడ్డాయి. శుక్లయజుర్వేదం ముప్పది ఒకటవ అధ్యాయంలో భగవానుడు పురుషునిగా అనగా వ్యాపకరూపునిగా వర్ణనచేయబడ్డాడు. అదే వేదంలో ఆయన ప్రజాపతిగా కీర్తింపబడ్డాడు. ఈ ప్రస్తుత మంత్రంలో అదే విధంగా ‘స ప్రజాపతిః’ (శు.య.31-19)అని భగవానుడు కీర్తింపబడ్డాడు.
ఆత్మకుగల చైతన్యశక్తి సహజసిద్ధమైనది కాదు. అందు మరియొక మహాచైతన్యశక్తినుండి ప్రసారితమై వస్తున్నది అని భావం.
మరి వేదమీవిధంగా చెప్పడంలో ఆంతర్యం ఆత్మకంటే ఉన్నతమైన పరమ ఆత్మను అనే్వషించు. అదే దృత్యమానమయ్యే సర్వచైతన్యాలను చైతన్యపరచే పరమచైతన్యం. మానవుడా! దానినే ఆశ్రయించుమని అర్థం.
***
ప్రజాపతి అజన్ముడు
ప్రజాపతిశ్చరతి గర్భే- అంతర జాయమానో బహుధా విజాయతే