S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

01/18/2019 - 19:16

అందుకే లింగ వివక్ష లేక వారిని విచారింపకయే వధింపమని అథర్వవేదం రాజును ఆదేశించింది. అయితే రాజు ఎవరు ఆతతాయే, ఎవరుకాదో నిర్ణయించే విషయంలో బహుజాగరూకుడైయుండాలి. అందుకై దానికి తగిన న్యాయ- ధర్మవ్యవస్థను, తత్కార్య నిర్వహణ వ్యవస్థను సువ్యవస్థితం చేయవలసి యుంది.
**
అతిథి పూజ
హిరణ్యస్రగయం మణిః శ్రద్ధాం యజ్ఞం మహో దధత్
గృహే వసతు నో - తిథి.

01/17/2019 - 19:08

నిద్రించుటకు శయ్యమీద వాలినా వెంటనే ఓంకారాన్ని జపించు. నిద్రవచ్చేవరకు ఆ జపాన్ని కొనసాగించు. ఆ స్మరణలోనే నిద్రపో. వాసనామయ శరీరం అణగిపోతుంది. దానివలన ప్రయోజనమెంతో ఉంటుంది’’.
పరమాత్మ ధ్యానం చేత సకల దురితాలు నశిస్తాయి. స్వప్నమంటే అది కేవలం మిథ్యయే. జాగ్రద్దశలోని సంస్కారాల ఖేలనమే స్వప్నం. ఈ స్వప్నాన్ని గూర్చి వేదమిలా హెచ్చరించింది.

01/16/2019 - 18:18

‘‘ప్రకటితమూ మరియు రహస్యమూ అయిన రెండు ధనాలను నీవే వహించి యున్నావు. ఆ రెండు సుఖదాయకమైనవే. ఓ ప్రభూ! నా కోరికను తిరస్కరించకు. సర్వప్రబోధకుడవు నీవే. నా అభిమతమేదో తెలిసినవాడవు కూడ నీవే. సర్వప్రదాతవు నీవే.’’

01/14/2019 - 18:30

కాని నీవద్ద గల ధనరాశికి తరుగుదల కానరాదు.
త్వాం హి సత్యమద్రినో విద్మ దాతారమిషామ్‌ విద్మ దాతారం రరుూణామ్‌॥
(ఋ.8-46-2)

01/13/2019 - 23:12

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512

01/10/2019 - 19:43

మరో పర్వత శిఖరారోహణమే జీవిత ధ్యేయంగా మనసులో నాటుకుపోతుంది. ఇదే రీతిగా జీవితంలో ప్రతి దినమూ క్రొత్త క్రొత్త కర్తవ్యాంశాలు ఎదురుగా నిలిచి ఉత్సాహపరుస్తూ ఉంటాయి. అలా ఎనె్నన్ని కర్తవ్యాలు నిర్వహించినా ఎప్పటికప్పుడు మరో క్రొత్త క్రొత్త కర్తవ్యాంశాలను జీవితం సూచిస్తూనే ఉంటుంది.

01/09/2019 - 19:07

మనిషి తానుచేసే పనికి ఏ విఘ్నాలు సంభవించకుంటే తన నిశ్చితాభిప్రాయాలను సవరించుకోవడంగాని విరమించడంగాని చేయడు. అట్టివాడు ఎవడూ ఎవరి సహాయమూ అర్థించడు. కాని లోకంలో యుద్ధముంది. ఒకరికి మరొకరిమీద విరోధముంది. ఒకడు మరొకణ్ణి హీనంగా చూస్తాడు. దీని పేరే యుద్ధం.

01/08/2019 - 19:40

మనసా, వాచా, కర్మణా త్రికరణశుద్ధిగా ఆచరించినవాడే సుప్రావియై పరమాత్మకు ప్రీతిపాత్రుడు కాగలడు.

01/07/2019 - 19:39

ఓ ప్రభూ! నీవు సమస్త జీవులకు పోషకుడవని చెబుతారు. అలా ఎందుకు చెబుతున్నారు? నేనాకలితో చచ్చిపోతున్నా. నీ వెవరిని రక్షిస్తూ ఉన్నావు? అందరిని కదా. మరి ననే్నల రక్షింపవు? ఆకలి మరణానికి నన్ను నీవు వదిలివేసావు. నాపై నీ కేల దయరాదు? ఓ సంరక్షకా! ‘శిశయం త్వా శ్రుణోమి’ ‘‘నీవు వెంటనే సంరక్షించేవాడవని విన్నాను’’ నేను అలసుడను. ఆపద వచ్చినపుడు చింతింపవచ్చునులేనని సోమరిగా ఉండే దీర్ఘసూత్రుడను. నీవో!

01/06/2019 - 22:19

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

Pages