S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

06/10/2019 - 22:11

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
తనకు సహాయపడే మిత్రుడు ‘అన్నాభిలాషియై రాగా అతడికింత అన్నంపెట్టి ఆదరించనివాడు మిత్రుడే కాడు. అటువంటి మిత్రుడినుండి దూరంగా వెళ్లిపోవాలి. ఎందుకంటే అటువంటి వాని ఇల్లు ఇల్లేకాదు. వానిని విడిచి సులభంగా ఆశ్రయమిచ్చే దాతనాశ్రయించాలి.

06/06/2019 - 19:23

సరే, వర్ణాలు నాలుగే అయితే దానికి ప్రమాణమేది? అంటే భగవంతుని విరాట్ స్వరూపాన్ని వేదం ఒక మానవుడుగా, ఒక మానవ సమాజంగా భావించింది. దానిని నాలుగు భాగాలుగా చూపింది. అవే శిరస్సు, బాహువులు, ఊరువులు (తొడలు), పాదాలు. ఈ అన్నీ కలిసినపుడే ఒక పరిపూర్ణ మానవుడవుతాడు. అట్లే సమాజంలో విడిగా ఉన్న భాగాలన్నీ కలిసినపుడే ఒక పరిపూర్ణ సమాజమవుతుంది. దీనికి ప్రతిరూపమే ఈ ‘బ్రాహ్మణో-స్య...’అన్న మంత్రం.

06/05/2019 - 19:48

6. అసుర్యం వర్ణం ని రిణీతే అస్య తమ్... ఋ.9-71-2
7. పరివర్ణం భరమాణో రుశంతమ్... ఋ.9-97-15
8. శుచిం తే వర్ణం అధి గోషు ధీధరమ్... ఋ.9-105-4
9. స్పార్హే వర్ణే... ఋ.2-1-12
10. ఉభౌ వర్ణౌ... ఋ.1-179-6
11. రుశద్భిర్వర్ణైరభి... ఋ.10-3-3
12. దాసం వర్ణమధరం గుహాకః ... ఋ.2-12-4
13. హత్వీ దస్యూన్ ప్రార్యం వర్ణమావత్... ఋ.3-34-9

06/04/2019 - 19:33

నాలుగు వర్ణాలు
బ్రాహ్మణో- స్య ముఖమాసీద్ బాహూ రాజన్యః కృతః
ఊరూ తదస్య యద్వైశ్యః పద్భ్యాం శూద్రో- అజాయత॥ ॥
భావం:- బ్రాహ్మణులు భగవంతుని ముఖం-వంటివారు. బాహువుల వంటివారు క్షత్రియులు. తొడల వంటివారు వైశ్యులు. శూద్రులు పాదాల వంటివారు.
వివరణ:- అలంకారిక రీతిలో ఈ మంత్రం చాతుర్వర్ణ్య వ్యవస్థను వర్ణిస్తూంది.

06/03/2019 - 19:46

5. ఆనందమయ కోశం:- ప్రీతి- ప్రసన్నత- ఆనందాలకు నిలయమైన కోశం ఆనందమయ కోశం. జీవాత్మ ఆచరించే కర్మ- ఉపాసన మరియు జ్ఞానాది వ్యవహారాలను దీనియందే అంతర్భవిస్తాయి.
(సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసం)

06/03/2019 - 19:36

పంచకోశాలు
కేష్వంతః పురుష- ఆ వివేశ కాన్యంతః పురుషే- అర్పితాని
ఏతద్ బ్రహ్మన్నుప నల్హామసి త్వా కింస్విన్నః ప్రతి వోచాస్యత్ర॥
51॥
పంచ స్వంతః పురుష ఆ వివేశ తాన్యంతః పురుషే- అర్పితాని
ఏతత్త్వాత్ర ప్రతిమన్వానో- అస్మి న మాయయా భవస్యుత్తరో మత్
॥ 52॥
॥ 52॥

06/03/2019 - 19:16

ఇక ఉత్తరార్థ మంత్రంలో పుణ్యకర్మనాచరించే ఉపాయాన్ని ఈ విధంగా వివరించింది.

06/03/2019 - 18:57

కర్మఫలప్రదాతా!
మాకు శుభప్రదాతవు కమ్ము
విభూషన్నగ్న ఉభయాన్ అను వ్రతా దూతో దేవానాం రజసీ సమీయసే
యత్తే ధీతిం సుమతిమావృణీమహే- థ స్మా నస్ర్తీవరూథః శిరో భవ॥ ॥

05/27/2019 - 18:33

నా శరీరమే ఒక భారవంతమైన బండి. దానిని కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం అనే జ్ఞానేంద్రియాలు మరియు మనస్సు కలిసి ఆరు ఇంద్రియాలు లాగుతున్నాయి. అవి కూడ చాల బలహీనమైనవి. ఓ దేవా! దుర్బలమైన కళ్లు ప్రకాశమానుడవైన నినె్నట్లు చూడగలవు? గియ్‌య్... మంటూ ప్రతిధ్వనించే బధిర ప్రాయమైన చెవుల నీ యశోగానాన్ని ఎలా వినగలవు? ఇష్టరుచులకు మరగిన నాలుక నీ నామామృత రసాన్ని పానం చేయగలదా? భవతారకమైన నీ నామాన్ని పలుకగలదా?

05/22/2019 - 20:01

1. సదాపృణః:- తాను ముందుగా ప్రసన్నంగా ఉండి తనతోబాటు ఇతరులను కూడ ప్రసన్నంగా ఉంచేవాడు.
2. యజతః:- యజనశీలుడు. అనగా నిరంతరం సత్కర్మలను యజ్ఞంచేసే క్రియావంతుడు.
3. బాహువృక్తః:- విఘ్నకారులైన వారిని తన శారీరక (బాహు) శక్తితో అణచివేయగలవాడు.
4. శ్రుతవిత్:- విన్నదానిని అర్థంచేసుకోగలవాడు. అర్థం చేసుకొని ఆచరించగలవాడు.

Pages