S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్వాధ్యాయ సందోహం
దైవం జీవులకు
కర్మానుగుణంగానే దేహాన్ని ఇస్తుంది
ఆ యో ధర్మాణి ప్రథమః ససాద తతో వపూంషి కృణుషే పురూణి
ధాస్యుర్యోనిం ప్రథమ ఆ వివేశా యో వాచమనుదితాం చికేత॥ ॥
భావం:- సర్వేశ్వరుడు ముందుగా జీవులకు ధర్మాలను- కర్తవ్యాలను సృజించి తదుపరి అనేక జీవరూపాలను సృష్టించాడు. ఆ సర్వేశ్వరుడే విధాతయై మొదటగా జీవులను అనేక జన్మలలో ప్రవేశపెట్టి ఉచ్చారణ చేయబడని మాటలను తెలియచేస్తున్నాడు.
పాప సంస్కారాలను వీడు
యో నః పాప్మన్న జహాసి తము త్వా జహిమో వయమ్
పథామను వ్యావర్తనే- న్యం పాప్మాను పద్యతామ్॥ అథ.వే.6-26-2॥
భావం:- ఓ పాపమా! నీవు మమ్మువీడవు. కాని నినే్న మేము వీడెదము. నీ మార్గాన్ని మార్పుచేస్తే మరొక మార్గంలో నీవు వస్తుంటావు.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ఈ మర్త్యలోకమంటే దేవతలకు ప్రియమే
అయం లోకః ప్రియతమో దేవానా మపరాజితః
యస్మై త్వమిహ మృత్యవే దిష్టః పురుష జజ్ఞిషే
స చ త్వాను హ్వయామసి మా పురా జరసో మృథాః॥
॥
అయితే పాప మంధకారంలో జరిగినంత మాత్రం అది రహస్యంగా ఉండిపోదు సరికదా ‘తద్ ద్యామేతి మహద్ వ్యచః’ ఆ పాపం బాగా విస్తరించి ఆకాశం వరకు వ్యాపిస్తుంది’’ అంటే పాపకర్మ బాగా బహిర్గతమై అంతట వ్యాపిస్తుందని భావం. అయితే పాపం దూరం వరకు వ్యాపించిపోయింది కదా అని పాపం చేసినవాడు ఆ పాప తీవ్రత నుండి రక్షింపబడడు.
‘‘సుదీర్ఘమైన యాచకుని జీవితమార్గాన్ని గ్రహించి ధనవంతుడాతనిని ప్రసన్నుడిగా చేయాలి’’అంటే దానం తాత్కాలిక ప్రయోజన పరిమితంగా గాక జీవితంలో ఎన్నడు యాచకుడు కానట్లుగా దానం చేయాలని భావం. ఇట్టి దానం సాధ్యమా అని ధనవంతుడు చింతింపవలసిన పనిలేదంటూంది వేదం. ఎందుకంటే-
నిష్కాములయిన జ్ఞానులు ధర్మరూపమైన యజ్ఞానికి అంగమైన వ్రతసహితమైన తపస్సుచేత కీర్తివంతుడై మరణానంతరం సత్కర్ములు పొందే మోక్ష కేంద్రమైన ఆనందమయ ప్రకాశమయ లోకాన్ని పొందుతున్నారు. అదే విధంగా మేమును అట్టి లోకాన్ని పొందుతాము.
మోక్షవర్ణన సందర్భంలో ప్రకాశమూ మరియు ఆనందాల చర్చ తప్పక వస్తుంది. ఈ రెండింటిని ఋగ్వేదమిలా వివరిస్తూంది.
ఈ ముప్పదిమూడు మంది దేవతలు అంటే ఎవరు? ఎనిమిది మంది వసువులు, పదకొండు మంది రుద్రులు, పనె్నండుమంది సూర్యులు, ఇద్దరు అశ్వనీ దేవతలు. వీరే ముప్పదిమూడు మంది దేవతలు. వీరంతా మన శరీరావయవాలలో నిలిచి ఉంటారు. ఇందరు దేవతలు వివిధ శరీరాంగాలలో నిలిచియుండగా మానవుడు తాను బలహీనుడుగా భావించి వారి బలాన్ని తనయందు నింపుమని దైవాన్ని ప్రార్థిస్తున్నాడు.
వానినన్నింటిని మనకంటెముందే హృదయస్థుడైన సర్వేశ్వరుడు సాక్షిగా చూస్తూనే ఉంటాడు. మరియు మనంచేసే కర్మలకు ప్రత్యక్షసాక్షిగా కూడ ఉంటాడు. ఈ ఎరుక కలిగియుండడమే ఉపాసన. సామవేదం సూచించిన ఈ అర్థానే్న శుక్లయజుర్వేదం ‘విశ్వాని దేవ వయునాని విద్వాన్’ (శు.య.40-16) ‘‘ఓ దేవా! నీవు మా సమస్త ఆచారాలనేకాదు విచారాలనుగూడ తెలిసినవాడవు’అని పునరుద్ఘాటించింది. కాబట్టి ఉపాసన అంటే దైవ సమీపంలో మనం ఉండటమేకాదు.
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
ప్రభూ!