S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/11/2017 - 22:25

ఆకాశమంత నమ్మకం.. భూమంత బంధం పెనవేసుకున్న బంధమే ప్రేమ. పలికేందుకు రెండక్షరాల్లో ఇమిడినా.. భావం మాత్రం అనంతం. దానికి వర్ణాలు.. వర్గాలూ లేనే లేవు. నాకు నీవు.. నీకు నేనే అనే రెండు హృదయాల స్పందనలతో మొగ్గ తొడిగే ఈ ప్రేమ కావ్యానికి చివరి పేజీ లేదు. కష్టాల సుడిగుండాలు ఎదురైనా.. కన్నీళ్ల ఉప్పెనలు చుట్టిముట్టినా.. కుంగిపోదు.. జంకిపోదు. నాకు నీ తోడుంటే చాలు.. ఈ ప్రపంచంలో ప్రతిరోజు నాకు నిత్య నూతనమే..

02/10/2017 - 22:49

అనాసలో కెలోరీలు చాలా తక్కువ. వంద గ్రాముల ముక్కల్లో యాభై కెలోరీలు ఉంటాయి. దీనిలో హాని చేసే కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఉండవు. పెక్టిన్ అనే కరిగిపోయే పీచు అనాసలో వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అజీర్తి సమస్య తలెత్తకుండా చూస్తుం ది. అనాసలో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికం.

02/10/2017 - 22:48

పెరుగుతున్న వయసును కనిపించనీయకుండా, వార్థక్యం దరికి రాకుండా చేయగలిగే ఒక అద్భుత ఫలం ‘బొప్పాయి’. చర్మ సౌందర్యానికి, ముఖ సౌందర్యానికి బాగా పనిచేసే బొప్పాయి చాలా మంచిది. టీనేజ్‌లో ముఖమంతా మొటిమలు వచ్చి ఎండిపోయి చర్మం గురుకుగా తయారవుతుంది. దీనివల్ల ముఖ సౌం దర్యం పాడైపోతుంది. దీనికి బొప్పాయి మంచి పరిష్కారాన్ని చూపిస్తుంది. తొక్కతో సహా బొప్పాయి పండుని తరిగి, దానిని ముఖానికి మసాజ్ చేసుకోవాలి.

02/10/2017 - 03:14

మహిళలు తమ సొంత నిర్ణయాలపై జీవితాన్ని నిర్మించుకోవాలి. ఆలోచనా విధానంలో స్పష్టతతోనే అది సాధ్యమవుతుంది. స్వీయశిక్షణ, నియంత్రణ, సాధ్యాసాధ్యాలపై క్లారిటీ అవసరం. అప్పుడే సాధికారత సాధ్యమవుతుంది. మహిళల్లో ప్రశ్నించే తత్వం పెరిగినప్పుడే అసలు మార్పు మొదలవుతుంది. హక్కుల సాధనకు బాధ్యతాయుతమైన ప్రవర్తన ముఖ్యం. మహిళ సామాజికంగా తన బాధ్యతలను నిర్వర్తించాలంటే సాధికారత అవసరమే.

02/08/2017 - 22:43

హిట్ అండ్ రన్ కేసులు అంటాం- అలాగే శకటాలే కాదు చతుష్పాద జంతువులు కూడా యిలాంటివి చేస్తాయిట. బంగలూరులోని ‘అడిగొడి’ ప్రాంతంలో ఓ ‘గోవు మాలచ్చిమి’ ఒక వయోవృద్ధురాలి మీద కొమ్ము విసిరింది. కాని, పాపం! ఆమె ఆ పోటుకి తట్టుకోలేక కుప్పకూలింది. ఈ బాధితురాలి కుమారుడు ఒక హెడ్ కానిస్టేబుల్. దాంతో అతడు- ‘‘మా అమ్మనే పొడుస్తావా?

02/08/2017 - 22:39

ఓటు అడిగేవాడు వూరికే అడిగితే ఎవడూ చెవిని బెట్టడు. తృణమో, పణమో- క్యాషో, కైండో ఏదో ఒకటి వుండాలి. మోదీ మహాశయుడు ‘క్యాష్’ తోక కోసేశాడు కనుక వోటర్‌లకి మరేవో, మరేవో ముట్టజెప్పి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఐనా, మొన్న పోలింగ్ ముగిసిన గోవా పోలింగ్‌లో రికార్డు స్థాయి సుమారు 86 శాతం దాకా ఆడా, మగా ఓటర్లు పాల్గొన్నారు.

02/08/2017 - 22:45

ఉత్తరాఖండ్ చిత్రమైన రాష్ట్రం. అక్కడి ‘్ఫతోర్‌ఘడ్’ జిల్లాలోనూ చంపావతీ జిల్లాలోనూ ఒక యాభై దాకా దెయ్యాల స్కూళ్లున్నాయి. అంటే పిల్లలు రాక వాటిని మూసేసి వుంచుతారు గానీ ఎన్నికల టైమ్‌లో అంటే ఐదు ఏళ్లకోసారి, స్కూలు తలుపులు తెరిచి, బూజులు దులుపుతారు.

02/07/2017 - 23:09

సర్వసాధారణంగా అందాన్ని ద్విగుణీకృతం చేసుకునేందుకు పనికి వచ్చేవాటిలో ‘పన్నీరు’ కూడా ఉంటుంది. ఈ పన్నీటిని మనం మన ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పన్నీటి తయారీకి, లేత గులాబీ రంగున్న పూలను తీసుకుంటే ఎన్ని రోజులైనా పాడైపోకుండా ఉంటుంది. 50 లేత గులాబీ రేకులను తీసుకుని రెండు లీటర్ల వేడి నీటిలో వేయాలి. ఆ నీరు బాగా మరిగి సగం అయిపోయిన తరువాత బాగా చల్లారనివ్వాలి.

02/03/2017 - 05:08

నున్నగా వుండే తారు రోడ్డుమీద జోరుగా, హుషారుగా సాగిపోయే వాహనాకైనా అక్కడక్కడా గతుకులు, గుంటలు, స్పీడ్‌బ్రేకర్లు తగిలి ప్రయాణం ఇబ్బందికాక తప్పదు. అలాగే సజావుగా సాగే జీవన ప్రయాణంలోనూ అప్పుడప్పుడు కలతలు, కన్నీళ్ళు, సమస్యలు తప్పవు. అవి తనకు తానుగా తెచ్చిపెట్టుకున్న స్వయంకృతాలూ కావచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తనవల్ల తలెత్తే మనస్పర్థలూ కావచ్చు! సమస్య ఏదైనా..

02/02/2017 - 02:08

చెప్పులు, బూట్లు, సాండల్స్, స్లిప్ ఆన్స్, కిక్ ఆన్స్- లాంటి రకరకాల పేర్లతో- మగ, ఆడ చెప్పులు తయారవుతున్నాయ్. అన్నీ పాదరక్షలే. కాకపోతే ఆడాళ్లు అందమయిన పాదరక్షలు ధరిస్తారు. మగాళ్లు అవసరమయిన జోళ్లు వేసుకుంటారు. కానీ, రుూమధ్యనే వయ్యార భామలయిన అమ్మాయిలు ధరించే చెప్పల్స్ హైకోర్టుకెక్కాయి.

Pages