S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

02/21/2016 - 01:14

కాబట్టి మన జాతి వేల్పులనే మనం కొలుచుకోవాలి. మన దైవాలను విడిచిపెట్టి అన్య దైవాలను మనం ఎందుకు కొలవాలి? కర్షకులకు గ్రామసీమలు నిలయాలు. వన జీవులకు అడవులు నివాస స్థానాలు. మనకు కొండలు మానవీయాలు. కొండలు మారు రూపాలతో ఉన్న దేవతలు. అడవులను దుర్మార్గులు, శత్రువులు దోచుకోకుండా, నాశనమొందించకుండా కొండలే కాపాడుతాయి.

02/19/2016 - 21:26

శంకర విహార సముత్సుకమైన మహావృషభాలతో అవి ఆనందీశ్వరులతో అవి ఒప్పారుతున్నాయి. వేద సంపదలాగా అవి పొలు పారుతున్నాయి. విష్ణు సంకీర్తనలలాగా అవి శ్రుతిపేయంగా శోభిస్తున్నాయి. యజ్ఞ కలాపాలలాగా పవిత్ర దర్శనీయంగా ఉన్నాయి. పుణ్యక్షేత్రాలలాగా నిత్య నిర్మలంగా ఉన్నాయి.

02/19/2016 - 04:15

నీ దివ్య శక్తితో వీణ్ణి సంహరించు అని హెచ్చరించాడు బలరాముణ్ణి శ్రీకృష్ణుడు. వెంటనే బలరాముడు దివ్య రూపం ధరించి వజ్రాయుధం వంటి తన పిడికిటిని ఆ రాక్షసుడి మస్తకంపై ప్రయోగించాడు.

02/17/2016 - 23:16

ఎవ్వరూ కనె్నత్తి కూడా చూడటానికి భయపడే తాళ వనాన్ని నిరుపద్రవం చేశారు అనుకున్నారు. ఇట్లా ఆ తాళ వనాన్ని గోపకులందరికీ ఆటస్థలం చేసి తన మేనమరిది అయిన శ్రీదాముడు, అన్న బలదేవుడు తనతో ప్రేమమీర బాల్య క్రీడలలో పాల్గొంటూ ఉండగా ఆల మందలు రోజురోజుకు వృద్ధి చెందుతుండగా గోవర్థన సమీప అరణ్యాలలో, బయళ్ళలో శ్రీకృష్ణుడు గోప బాలురతో క్రీడాలోలుడైనాడు.

02/17/2016 - 06:03

అడవిలో మదపుటేనుగు చెట్టును నిర్మూలించటానికి కాని, విరచి వేయటానికి కాని ఇష్టపడక క్రీడ కోసం పట్టి ఊపినట్లుగా ఉంది ఆ దృశ్యం. పెద్ద హోరుగాలి వీస్తే అసంఖ్యకంగా చెట్లనుంచి కాయలు రాలిపడిపోయేట్లు, తాటి పండ్లన్నీ వడగండ్లు కురిసినట్లు రాలిపడ్డాయి. అట్లా అవి నేలమీద రాలిపడిపోవడం పెద్ద ధ్వనిని సృష్టించింది. అంతకన్నా గోప బాలుర హర్షధ్వానాలు మింటాయి. సంతోషంతో వాళ్ళు పెద్దగా అరుపులూ, కేకలూ సాగించారు.

02/14/2016 - 20:09

అపుడు తల్లిదండ్రులు ఇతర పెద్దలూ ఆయనను స్తుతించారు. నీవే మాకు దిక్కు. నీవే మాకు శరణ. నీవే మాకు ఆధారం. నీవే మా దైవం అన్నారు. ఇక ఆల మందలన్నీ స్వేచ్ఛగా యమునా తీరంలో సంచరిస్తాయి. మునులు భయం తీరి తమ క్షేత్ర విధులు ఇక్కడ తీర్చుకుంటారు. ఇదంతా నీ దయ అని కృష్ణుణ్ణి ప్రశంసించారు. మేం అడవి మనుషులం, మాకేం తెలుసు నీవు దేవదేవుడవని! అని అభిమాన నిష్ఠూర వాక్యాలు పలికారు. ప్రదక్షిణలు చేశారాయనకు.

02/13/2016 - 22:53

సిద్ధ సాధ్య చారణులు గంధర్వులు ఈ నాట్యాన్ని చూసి జయగీతికలాలపించారు. అపుడు ప్రాణభయం ఆవహించింది కాళ సర్పానికి. ప్రాణాలుగ్గబట్టుకున్నాడు. మనసునతి కష్టంమీద స్వాధీనం చేసుకున్నాడు. నా తలలపై గోవింద చరణారవిందాలున్నాయి కదా! ఇక భయమెందుకని ఊరట పొందాడు. ఇంతవరకూ భీతితో అతడి నాలుకలు తడి ఆరిపోయి ఉన్నాయి. అయినా స్వాస్థ్యపరచుకొని దీనంగా పరాతత్పరుణ్ణి ఇట్లా స్తుతించాడు.

02/12/2016 - 20:24

ఏదీ నీ చిరునవ్వుతో అమ్మా, నీకెందుకే భయం? అని చెప్పవేమి? నీవు కనపడకపోయేసరికి హడలిపోతూ గోవులన్నీ దీన వదనాలతో శోకిస్తూ ఈ దిక్కుకూ ఆ దిక్కుకూ ఎట్లా తొలగిపోతున్నాయో చూసైనా నీవు వెంటనే వచ్చి నన్ను రక్షించవెందుకు? ఈ పొడల పాము నీకు ఒక లక్కెటరా! నాయనా, పూతనను, బండి రాక్షసుణ్ణి, వెలగచెట్టు అసురునూ రూపుమాపావు కదా! అని రోదించింది యశోద.

02/12/2016 - 03:40

పూర్వం ఒకసారి సర్పాస్త్రానికి కట్టుపడి సుప్తి పొందిన వృత్తాంతం మళ్లీ ఒకసారి వేడుకగా అనుభవించాలని అనుకున్నాడేమో అన్నట్లు నీల నీరద శుభాంగుడైన ప్రభువు కాళియ నాగుడికిప్పుడు కట్టుబట్టాడు. లేకపోతే ఆదిశేషుడిపై పవ్వళించి యోగనిద్ర పొందే స్వామికి వీడొక లెక్కా పత్రమా? పాపసెజ్జను మళ్ళీ ఒకసారి తలపోసినట్లు ఆయన ఒకింత సేపు ప్రసుప్తి పొందాడు. మూర్ఛితుడైనాడు అనుకున్నాడు కాళియనాగుడు.

02/11/2016 - 07:11

అంతేకాక వీడి పరివారంలో బల ప్రాభవాలు కల దుష్టో రగాలు (క్రూర సర్పాలు) గోరూపం ధరించి నాకు కీడు చేయటానికి కూడా దుస్తంత్రాలు ఆలోచిస్తున్నాయి. కాబట్టి వీణ్ణి కనుక చచ్చిన పామును చేసినట్లైతే వీడి సకల పరివారం తోకలు ముడుచుకొని పారిపోతాయి. ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు? అనుకున్నాడు పద్మదళాయతాక్షుడు.

Pages