S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

03/04/2016 - 05:40

ఏ కొరత లేకుండా కాపాడుతున్నాను. అటువంటి నాపట్ల ఇటువంటి ఘోర పాపం తలపెట్టావు నీవు. అనకూడదు కాని నీ వంటి దుర్మార్గుడు ఎక్కడా ఉండడు. ఇంత ద్రోహం తలపెట్టావు నీవు. ఒట్టితులువైనావు. ఇన్ని ఏండ్లు వచ్చాయి. ఇంత పెద్దవాడివైనావు ఎట్లా ఇంతకాలం మనగలిగావో నాకే ఆశ్చర్యంగా ఉంది. మిథ్యాశీలం నీది. అబద్ధపు బతుకు నీది. కుట్రదారుడివి. ఏమీ ఎరగనట్లు నటిస్తావు. వెనుక గుంతలు తవ్వుతావు.

03/03/2016 - 06:49

బహుశా బలి చక్రవర్తిని పాతాళానికి అణగద్రొక్కి మళ్లీ ఇంద్రుడికే స్వర్గరాజ్యం కట్టబెట్టిన వాడు కూడా వీడే అయి ఉండాలి. ఇక పరశురాముడు కూడా వీడేనని స్పష్టపడుతూనే ఉంది. గొప్ప యజ్ఞం చేసి కశ్యప మహర్షికి సమస్త భూవలయాన్ని దక్షిణగా ఇచ్చినవాడు కూడా వీడే అయి ఉంటాడు. ఇక దశరధుడికి నలుగురు కుమారుల అంశతో పుట్టి రావణుడి వంటి మహా బలపరాక్రమవంతుణ్ణి వధించింది వీడు కాక మరెవరికైనా సాధ్యమవుతుందా?

03/02/2016 - 04:23

మీ పరాక్రమం, మీ బుద్ధి వైభవం, మీ రాజ్య తంత్రజ్ఞతవల్లనే యదు కులానికి లోకంలో గొప్ప కీర్తి ప్రతిష్ఠలు లభించాయన్నాడు. ఇపుడు నాకొక గొప్ప అనర్థం సంభవించగా ఎందుకు నాకు ప్రతీకారోపాయం చెప్పకుండా ఉపేక్షిస్తున్నారు!

02/28/2016 - 19:24

కాలకూటానికి కాళ్ళు వచ్చినట్లు ఆ రాక్షసుడు చెలరేగాడు. ప్రళయకాలపు చీకట్లు రూపుదాల్చినట్లు వృషభాకృతి ధరించాడు. రాహువులాగా కృష్ణచంద్రుణ్ణి మింగటానికి పశు రూపంలో పరుగుల మీద వచ్చాడు.

02/28/2016 - 04:26

కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారు. ఆయన పాడితే వాళ్ళు ఆడుతున్నారు. ఆయన మురళి మోవిపై ఆనిస్తే కరతాళ మృదంగ భంగిమలతో విలాస నర్తనలు చూపుతున్నారు. ఆయన పట్ల వారు బద్ధానరాగలైనారు. ఆయన వలపు చూపుల కోసం పరితపించిపోతున్నారు. ఆయన వేణువు చేత బట్టి ఆవుల వెంట వన వీధులలో సంచరిస్తూ వుంటే గోప భామలు కూడా ఆయన గోవుల వెంట తామూ అనుసరిస్తున్నారు.

02/26/2016 - 20:18

నీవు ఎవరివో తెలియక నీతో చనువుగా మెలగాలంటే మాకు భయమవుతున్నది. ఎక్కడ ఏం తప్పు జరిగిపోతుందో, అపచారంగా నడుచుకొంటామో అని తికమకపడుతున్నాం. ‘మా యశోద కొడుకు, మా నందుడి ముద్దుల పట్టి, మా సంగిడికాడు, మా ఇళ్ళల్లో అల్లరి చేసినవాడు, మా చిన్నికృష్ణమ్మ అని భ్రమసి ఏం తప్పులు చేస్తామో కదా! అని అలజడి చెందుతున్నాము. నీవు ఎవరివైనా కానీ, నీకు మొక్కి మేము చల్లగా ఉంటాము. బతికిపోతాము.

02/26/2016 - 08:00

లోకాలన్నీ నీ దయావీక్షణంతో సుఖిస్తాయి అని తానే స్వయంగా రెండు చేతులతో కనక కలశాలతో శ్రీపతిని ఇంద్రుడు అభిషేకించాడు. గోపల్లె వాసులు గోపకులు తమ గోవులతో అక్కడకు చేరారు. గోవులు కూడా తమ క్షీర ధారలతో ఆయనను అభిషేకించాయి. ఆ సమయంలో సమస్త ప్రకృతి పులకించింది. గగనతలంలో అచ్చరలు ఆడిపాడారు. ఆయనపై పుష్పవృష్టి కురిపించారు. అప్పుడింద్రుడు దేవదేవా! నేను వచ్చిన పని పరమ సంతోషకరంగా నెరవేరింది.

02/25/2016 - 20:57

అపుడు ఇంద్రుడు సర్వలోకేశుడి అనుగ్రహం సంపాదించుకోవటానికి ఆయననిట్లా స్తుతించాడు.
సకల వేదాలు, సమస్త యజ్ఞాలు నీవే అని తెలిసీ, యోగీశ్వరేశ్వరుడవని తెలిసీ, ప్రణవ స్వరూపుడివనీ, పరమాత్మవనీ, ఆత్మజ్ఞాన ఫలప్రదుడవనీ తెలిసి కూడా నీ మాయ తెలియలేక గోపాలుడవని భ్రమ చెందాను. విశ్వజన్మ స్థితి విలయములకు నీవే కర్తవు. ఆశ్రీత మిత్రుడవు. పద్మనేత్రుడవు నీవు.

02/24/2016 - 08:25

ఇళ్ళలో పొయిలు రాజలేదు. చిన్నపిల్లలు హాహాకారాలు చేశారు. పశువుల కాపరులు పశువుల గతి ఏమీ పట్టించుకోలేకపోయినారు. ‘కృష్ణ కృష్ణ రక్షించు రక్షించు’ అని ఆర్తనాదాలు విన్పించాయి. ‘గోవులకూ మాకూ నీవే దిక్కు’ అని వ్రేపల్లె ప్రజలు మొర పెట్టుకున్నారు అపుడు. శ్రీకృష్ణుడిదంతా ఇంద్రుడి దుశే్చష్టితమని గ్రహించాడు. ఈ అవివేకానికి తగిన బుద్ధి వచ్చేట్లు చేస్తానని ఊహించాడు.

02/21/2016 - 23:44

మహదానందాన్ని అనుభవించారు. తరువాత గిరి ప్రదక్షిణం చేశారు. దారి మధ్యలో కొండకు సాగిలపడ్డారు.
ఆ తరువాత వాళ్ళంతా విందు భోజనలు చేశారు. తమ పశువులకు వివిధాలంకారాలు సంఘటించి మురిసిపోయినారు. శ్రీకృష్ణుణ్ణి తమ ముందుంచుకొని మళ్లీ వ్రేపల్లె చేరారు. గోవర్థనాద్రి మహాపూజ్సోవాన్ని ఆ తరువాత చాలా రోజులు ముచ్చటగా చెప్పుకున్నారు.

Pages