S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

04/07/2016 - 06:45

కాబట్టి నన్ను పరిగ్రహించవలసింది అని వారుణీదేవి బలదేవుణ్ణి ప్రార్థించింది. ఇంతలోనే మరొక మానిని అక్కడికి వచ్చింది. బలరాముడితో ఇట్లా చెప్పింది. నా పేరు కాంతి. నేను చంద్రుడిని ఆశ్రయించుకొని ఉంటాను. నీపట్ల నాకు అనురాగం కలిగింది. ఆ చంద్రుడికన్నా నీవు సౌందర్యశాలివి. నీ రూపలావణ్యం అసదృశం అని ఈ ఇంతి బలదేవుణ్ణి వరించింది. ఇంతలో ఇంకొక కామిని కూడా ఆయనను సమీపించింది.

04/05/2016 - 21:39

ఆ రంగస్థలమంతా ..... అసలు ఆ గైరికాది ధాతువులతో ఉజ్వలంగా వాళ్లకు దర్శనమిచ్చింది. వాళ్లప్పుడు సువర్ణుడు వేగంగా ఎక్కడికైనా చేరగలిగేట్లు ఆ కొండకొమ్ము చివర ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నారు. అప్పుడు పరశురాముడు వాళ్ల దగ్గర శెలవు తీసుకుంటూ వాళ్లను అనేక విధాల స్తుతించాడు. నాపట్ల మీ అనుగ్రహం చూపటానికే , నన్ను సన్మానించటానికే ఈ సన్నివేశం కల్పించారు మీరు అని నేను ఎరుగనా? ఇది ఒక నెపం మాత్రమే.

04/04/2016 - 00:55

ఇక్కడకు దగ్గరలోనే కరవీరపురం రాజధానిగా చేసుకొని స్పగాలుడనే దుష్ట రాక్షసుడు అహంకరిస్తున్నాడు. జరాసంధుడు వచ్చాడా అంటే వాడూ, వీడూ ఏకమవుతారు. జరాసంధుడు పెద్ద సైన్యంతో వచ్చినా వాడు హతాశుడై, పరాజయం పాలయ్యే రక్షణ స్థలం మీ వెంట స్వయంగా వచ్చి నేను చూపిస్తాను. దానిని చుట్టు ముట్టినా వాడేమీ చేయలేడు. ఈ ఏర్పాటంతా నేను ముందే ఆలోచించి ఉంచాను.

04/02/2016 - 20:05

ఒకవైపున హోమధేనువు, వత్స సహితంగా అక్కడ కనపడింది. మరొకవైపున యజ్ఞ పరికరాలన్నీ కన్పించాయి. అక్కడ ఒక దర్భాసనంపై మహాదివ్య దీప్తుడైన ఒక మహర్షిని వాళ్ళు చూశారు. ఆయన ఉదయార్క బింబ సుందర శరీరుడుగా ఉన్నాడు. ఆయన శీర్ష జటావశుల రోచులు తరుణారుణ సూర్య కిరణ సంకాశంగా ఉన్నాయి. ఆయన ముందు దివ్యాయుధాలు కనపడ్డాయి. దివ్య ధనుస్సు, తూణీరాలు, గొప్ప ఖడ్గం, భయంకరమైన గండ్రగొడ్డలి వాళ్ళకు నయన గోచరమైనాయి.

04/01/2016 - 22:21

‘నీ సలహా అన్ని విధాలా బాగుంది. అవశ్యం ఆచరణీయం. కాబట్టి అన్నా, నేనూ ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ జరాసంధుడి ఎదుట పడి, అతణ్ణి తృణీకరించి, తర్జించి దక్షిణ దిశకు వేగంగా చేరుకుంటాము. అతడు మా వెంట బడతాడు. అప్పుడు మధురానగరం నిరుపద్రవంగా ఉంటుంది’ అని సభవారినుద్దేశించి విక్రదుడి మాటను బలపరచాడు కృష్ణుడు.

03/31/2016 - 22:09
03/31/2016 - 22:00

మీ రాజు నాకు చెప్పవలసిందిగా చెప్పిన మాటలు చెప్పారు. నేను ఎక్కువ మాటలు చెప్పను. ‘నీ అల్లుణ్ణి యముడికి అతిథిగా పంపాను. శత్రుశేషం ఉండకూడదు. నిన్ను కూడా నీ అల్లుడి దగ్గరకు పంపుదామనుకుంటూ ఉండగా, ఇంతలో నీవే వచ్చావు. నీవు పుట్టగానే ‘జర’ నిన్ను అతుకుపెట్టింది కదా, మళ్లీ నీ శరీరం ఇప్పుడు యథాస్థితికి తెస్తాను. చీల్చి రెండు శకలాలు చేస్తాను.

03/30/2016 - 23:42

తక్కిన రాజులందరినీ రెచ్చగొట్టాడు. ఇరవై ఒక్క అక్షౌహిణుల సైన్యం సమకూర్చున్నాడు. మధురానగరంపైకి దండెత్తి వచ్చాడు. జరాసంధుడి కూతుండ్రైన అస్తి, ప్రాస్తి అనే వారు కంసుడి భార్యలు. వాళ్ళు భర్తృహీనులైనారు. వాళ్ళను ఓదార్చి కృష్ణుడిపై పగ తీర్చుకోవటం కూడా ఉద్దేశించి అశేష సేనావాహినితో వచ్చి యమునానది ఒడ్డున మోహరించాడు జరాసంధుడు.

03/30/2016 - 01:14

కుపిత స్వరంతో కృష్ణచంద్రుడు తనకు వెంటనే అప్పగించవలసిందని యముణ్ణి ఆజ్ఞపించాడు. అపుడు యముడు గడ గడ వణికిపోయినాడు. ‘దేవా! దేవదేవా! దేవాదిదేవా! యమలోకంలోకి వచ్చిన సర్వ జీవుల పాపపుణ్య వర్తనలకు అనుగుణమైన శిక్షలు, రక్షలు, నిర్ణయించే హక్కు, అధికారం మాత్రమే నాకున్నాయి కాని, ప్రాణహరణం చేసి ఇక్కడు తీసుకొని వచ్చే కర్తవ్యం నాది కాదు. దానిని నేను అనుపాలించలేను. ఆ పని నిర్వహించేది మృత్యుదేవత.

03/27/2016 - 22:50

ఆయన అక్కజానికి అంతులేకుండా పోయింది. వీళ్ళ రహస్యమేమిటో తెలుసుకుందామని సాందీపని మహర్షికి జిజ్ఞాస కలిగింది. వాళ్ళను దీక్షగా పరీక్షించసాగాడాయన. అప్పుడాయనకు ఒక మహాద్భుతం కంటపడింది. వీళ్ళు శివపూజా దురంధరులు. పరమశివుడు వీళ్ళపట్ల అత్యంత ప్రీతుడైనాడు. ఈ అన్నదమ్ములు శుభ తిథులలో పర్వదినాలలో శంకరుణ్ణి అర్చించగా ఆయన స్వయంగా వీరి అర్చనలు స్వీకరిస్తున్నాడు.

Pages