S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

03/15/2016 - 22:27

నీవు తీసుకొనిపోతున్న వాటిలో చాలా సుందరమైనవి కొన్ని మాకివ్వకూడదా?’ అని అడిగాడు ఆ రాచకొలువరిని శ్రీకృష్ణుడు. ఆ మాటలకు ఆ రాచ రజకుడు ముఖం నిండా కోపం పులుముకున్నాడు. వాళ్ళను ఛీత్కరించాడు. ‘మీరు చూడబోతే ఒడ్డి మడ్డివాళ్ళూ, జడ్డివాళ్ళులాగా కనపడుతున్నారు. పల్లెటూరి వాలకంతో పశువుల కాపరుల వేషాలు మీవి. మీకు కంస మహారాజు ధరించే వస్త్రాలు కావాలా?

03/14/2016 - 00:09

నీ మాయ తెలియ ఎవరి వశము? ఆ బ్రహ్మాదులకు కూడ నీకల రూపు గ్రహించటం అసాధ్యం. నీ అనుగ్రహం నాపట్ల ఇట్లానే ప్రసరింపజేయి. నాకదే చాలు’ అని నమస్కరించి, మనం ఎంత త్వరగా మధుర చేరితే అంత ప్రసన్నుడవుతాడు కంసుడు. మసలితే కోపిస్తాడు. ఇక బయలుదేరుదాము అని విన్నవించాడు.

03/12/2016 - 22:14

ఇంటి వాళ్ళు ఎన్ని ఆటంకాలు కలిగించినా మేము ఇక్కడ ఉండం. ఆయన మా పట్ల చూపే ప్రేమ, బుజ్జగింపులు, లాలింపులు, నవ్వులు, వేడుకలు, మేము ఎట్లా మరచిపోగలం!అని ఆక్రందించారు గోపికలు. ఆ రథం కంటి చూపు కానినంత మేరా చేష్టలుడిగి చూస్తూనే ఉండిపోయినారు.

03/11/2016 - 23:25

మధుర వచ్చి వాళ్ళ రక్షణోపాయం నీవు వెంటనే పూనాలి.

03/11/2016 - 00:39

అంతేకాక ఈ సంవత్సరానికి చెల్లించవలసిన కప్పం కూడా తెచ్చి చెల్లించవలసిందిగా కోరాడనీ, పాడి పంటలలో తనకు చెల్లించవలసిన పన్ను వెంటనే చెల్లించవలసిందని చెప్పమన్నాడనీ, గొప్ప ఆమెత ఆయన తలపెట్టాడు కాబట్టి పాలు పెరుగు, వెన్న, నెయ్యి ఇంకా తేనె, వన్యఫలాలు సమృద్దిగా తీసుకొని రావసిందిగా తనను చెప్పమన్నాడనీ ఆ గోప ప్రముఖులకు కంసుడి ఆనతి విన్పించాడు అక్రూరుడు.

03/10/2016 - 04:05

ప్రకృతి అంతా రాగరంజితమైంది. కృష్ణుడు గోవులను తోలుకొని పల్లె చేరాడు. ఇక నేను కూడా అస్త్రాది చేరుతాను అని ఉల్లసించాడు సూర్యుడు. ఆకాశమంతా ఎర్రబడింది కేశి మహాసురుడి మృత శరీరంలా. తమ కులం పెద్దను భీకరంగా వధించాడనే క్రోధంతో నిశాచర గణం పరిగెత్తివచ్చినట్లు నాలుగు దెసలా చీకట్లు ఆవరించాయి.

03/08/2016 - 22:09

మహోద్రేకంతో ముందు రెండు కాళ్ళు పైకెత్తి శ్రీకృష్ణుడి వక్షస్థలాన్ని తాటించాలని ఆ చెనటి అశ్వం ఆయన మీదకు ఉరికింది. ఆయన ఒడుపుగా తన శరీరాన్ని కుంచించి ఒక పక్కకు తప్పుకోవటంతో ఆ కేశి రాక్షసుడి రెండు కాళ్ళు అవతల పక్కకు మెలిపిడి భూమివైపు ఒరిగిపోయినాయి. తన పూనిక ఘోరంగా విఫలం కావటంతో కేశిదనుడు తన వక్త్రాన్ని భయంకరంగా తెరచి ఆయనను కరవ వచ్చాడు.

03/06/2016 - 22:26

కుద్ధతుడై చాలా ఆటోపంతో అశ్వరూపుడై బృందారణ్య తరు ప్రదేశాలకు చేరుకున్నాడు కేశి రాక్షసుడు. అక్కడి పశువుల మందలో బీభత్సం సృష్టించాడు. మదమెక్కి దయ్యం పట్టి ఉన్మత్త తీవ్రతతో భయంకరంగా ప్రవర్తించాడు. వెనక కాళ్ళు ఉద్ధతితో ఎత్తి కొన్ని పశువులను వాటి గుండెలు పగిలిపోయేట్లు తాటించాడు.

03/06/2016 - 00:17

‘సద్గుణ భూషితమైన రాజ వంశంలో జన్మించిన వాడెవడూ ఇట్లా కారుకూతలు కూస్తాడా? అసలు నీకు రాజ్యార్హత వుందా? రాజ వంశంలో జన్మించావా? నిన్ను అనవలసిన పనిలేదు. నీ తల్లిదండ్రుల దౌర్భాగ్యం ఇది. వాళ్ళు కొర నోములు నోచుకున్నారు. నీవలవల్ల వంశనాశనం జరగబోతున్నది. నీవల్ల యాదవ కులమంతా నిందాస్పదమైంది. తనను తాను పొగడుకోవటం ద్వారా లోకంలో ఎవడూ ప్రజామోదాన్ని పొందలేడు.

03/04/2016 - 23:53

మహానుభావులైన విప్రులెందరో వస్తున్నారు. ప్రతిరోజూ కొల్లలుగా విందులు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. కాబట్టి బృందావన ప్రజ నివాసులను అపరిమితంగా నెయ్యి, పాలు, పెరుగు, అడవి తేనెలు తీసుకొని రమ్మన్నానని నా ఆజ్ఞగా వాళ్లకు చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్య విషయం మరొకటి ఉంది. నా మేనళ్ళులను చూద్దామని నాకెంతో ఉత్కంఠగా ఉంది. వాళ్ళనింతవరకు నేను చూడనే లేదు.

Pages