S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/02/2017 - 21:41

‘‘మిస్టర్ రాహుల్.. రాహుల్.. రాహుల్’’ గట్టిగా పిలిచాడు కోర్టు జవాన్.
అనే్వష్, కమల్, రాహుల్ తప్ప మిగతావాళ్ళంతా ఆశ్చర్యంగా చూశారు. రాహుల్ తల్లి నీరజ విస్తుపోయింది. అంతలోకే దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకు. ఏమిటి ఈ ప్రారబ్దం? అజిత్ నిరపరాధిగా బయటపడ్డాడు అని సంతోషించే లోపు ఇప్పుడు రాహుల్ అంటున్నారు.. ఇదేం కేసో.. గోలో.. శనిలా తన పిల్లల చుట్టూ తిరుగుతోంది.

04/02/2017 - 06:57

‘‘ఏమిటో.. ఈవేళ అంతా ఆయన అదోరకంగా ఉన్నాడు.. ముందంతా ‘ఇంద్రజిత్’ తనే చంపేనని ఒప్పుకొని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేడు కదా.. ఎటూ ఆత్మహత్య చేసుకు చనిపోయాడు కనుక యింక కేసు క్లోస్.. అజిత్‌ని నిరపరాధిగా వదిలేస్తారు అన్నాడు.. నేను ఇంద్రజిత్ చెప్పినదానిలో వేరే ఎవరో అసలు దోషి ఉండగా కేసు ఎట్లా క్లోజ్ అవుతుంది? మాకు లైఫ్ థ్రెట్ కదా..అంటే..

03/31/2017 - 21:18

ఒకవేళ అప్పుడు న్యూయియర్ నాడు హిల్‌స్టేషన్‌కి వెళ్లిన నాటి మర్డర్ తమలో ఎవరైనా చూశారా.. లేక అలాంటి అనుమానం ఆ హంతకుడికి కలిగి తమ మీద కక్షగట్టాడా.. ఒకవేళ నిజంగా మిగతా ముగ్గురిలో ఒకరు చూసి వుంటే ఆ సంగతి మిగతావాళ్లకి చెప్పకుండా ఉంటారా.. అయినా ఆ రోజు హత్య జరిగిందని వినడమే కానీ సాహూ సర్ తమని ఆ పక్కకి కూడా వెళ్లనియ్యలేదే.. అయినా అదేమిటో అంతమంది తిరిగేచోట ఒక్కళ్లూ చూడకపోవడం నిజంగా ఆశ్చర్యంగా వుంది.

03/30/2017 - 22:33

‘‘మొన్న ఆ లారీ ప్రమాదం నుంచి కాపాడినదే అతను.. అప్పుడే పరిచయం.. చాలా మంచివాడు.. తెలివైనవాడు..’’ అభిమానం ధ్వనించింది అనే్వష్ గొంతులో.

03/30/2017 - 08:38

అలా అని మరణవాగ్మూలం కూడా రిజిస్టర్ అయిందట. ఇంకేం ప్రాబ్లం సాల్వ్ అయినట్లే.. హంతకుడు ఎటూ ఆత్మహత్య చేసుకు మరణించాడు.. మరణించే ముందు తనే చేశానని ఒప్పుకున్నాడు.. సో కేసు క్లోజ్ అయినట్టే.. మన అజిత్ నిరపరాధిగా బయటపడ్డట్టే.. కానీ అవవసరంగా మధ్యలో ఆ రాహుల్ ఎంట్రీ వలన మిస్లీడ్ అయ్యాం.... సో..

03/28/2017 - 21:14

ఏమాశించి ఇదంతా చేస్తున్నారు? రాహుల్ కనక అయితే అతని కోపం.. పగ ఒక్క అజిత్‌మీదనే ఉండాలి. అమర్, అరుణ్, నేను.. మేమేం చేశాం.. మరి ఇదంతా ఎవరు చేయిస్తున్నారు.. ఎందుకు చేయిస్తున్నారు?

03/26/2017 - 21:27

‘‘ఓ.. ఏదో కోర్ట్ కేస్ నడుస్తున్నది.. మీ ట్రైనింగ్ సెంట్రల్ వాళ్ళమీద.. ఏమై రైట్..?’’’
‘‘అవును.. హతుడు నా స్నేహితుడే.. హత్యానేరం క్రింద అరెస్టు అయినదీ నా స్నేహితుడే.. ఏమిటో ఈపాటికి ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ వచ్చి ఉండవలసిన వాళ్ళం... యిలా చెయ్యని నేరానికి కోర్ట్... కేసు అంటూ తిరుగుతున్నాం.. ప్చ్’’ దిగులుగా అన్నాడు అనే్వష్.

03/25/2017 - 21:38

అదే పాదం కృత్రిమమైనదే.. మనం అనుకున్నది నూటికి నూరు పాళ్లు రైటే.. దానిని నిరూపించే ఆధారం మాత్రం ఒకటి రెండు రోజుల్లో వస్తుంది.. యింకొక విషయం... వాడికి మనం అనుమానిస్తున్నట్లు తెలిసిపోయింది.. నన్ను ఇంట్లో బంధించి ఉదయానే్న కొంప తాళమేసుకుని ఎటోపోయాడు.. యిదిగో నాకు రాసిన చీటీ’’.

03/24/2017 - 20:48

అయినా తన పిచ్చిగాని వాడు రాత్రికి రాక ఎక్కడికి పోతాడు.. వాడు యింటికి వచ్చి తన కాలు డ్రెస్సింగ్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితిలో కుదరదు.. కనక వాడు రాత్రికైనా సరే ఇక్కడికి వచ్చి తీరతాడు.. తన గాలానికి చిక్కితీరతాడు.. తను అనవసరంగా హైరానా పడకుండా.. ఆరామ్‌గా తిని రెస్ట్ తీసుకోవడం బెటర్..

03/23/2017 - 21:57

తర్వాత చట్టానికి చిక్కక ఎక్కడకు పోతాడు.. ఒకరకంగా వాడిని పట్టించే అవకాశం వాడే కల్పించాడు.. అనుకుంటూ బాత్‌రూంలో వాడు కూర్చుని కాలు డ్రెస్సింగ్ చేసుకునే చోటు కనిపించి అంతా క్లియర్‌గా రికార్డ్ అయ్యే విధంగా బాత్‌రూం వెంటిలేటర్‌లో బయటకి కనిపించకుండా, వాడి కాలు అంతా క్లియర్‌గా కనబడేలా అమర్చాడు..
‘‘ఇంకెక్కడికి పోతావ్‌రా రాహుల్‌గా?’’ అనుకుంటూ.

Pages