S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

03/26/2018 - 21:26

సీ॥ సర్వేశ! నీపాదసరసిజ ద్వయమందుఁ
జిత్తముంపఁగలేను జెదరకుండ
నీవైన దయయుంచి నిలిచియుండెడియట్లు
చేసినన్నిపుడేలు సేవకుఁడను
వనజలోచన! నేను వట్టిమూర్ఖుఁడఁజుమ్మి
నీ స్వరూపముఁజూడ నేర్పు వేగ
తనకుమారులకుగ్గు తల్లిపోసినయట్లు
భక్తిమార్గంబను పాలుపోసి
తే॥ ప్రేమతో నన్ను ఁబోషించి పెంచుకొనుము
ఘనత కెక్కించు నీ దాసగణములోన

03/25/2018 - 21:27

నరసింహ శతకం
*

03/23/2018 - 20:24

సీ॥ వసుధాస్థలంబున వర్ణహీనుఁడు గాని
బహుళ దురాచారపరుఁడు గాని
తడిపి కాసీయని ధర్మశూన్యుఁడు గాని
చదువనేరని మూఢజనుఁడు గాని
సకల మానవులు మెచ్చని కృతఘు్నఁడు కాని
చూడ సొంపును లేని శుంఠకాని
యప్రతిష్ఠలకు లోనైన దీనుఁడు గాని
మోదటికే మెఱుఁగని మోటుగాని
తే॥ ప్రతిదినము నీదు భజనచేఁ బరగునట్టి
వానికే వంక లేదయ్య! వచ్చు ముక్తి

03/22/2018 - 21:24

నరసింహ శతకం
*
సీ॥ వ్యాసుఁడే కులమందు వాసిగా జన్మించె?
విదురుఁడే కులమందు వృద్ధిపొందె?
కర్ణుఁడే కులమందు ఘనముగా వర్థిల్లె?
నా వసిష్ఠుండెందు నవతరించె?
నింపుగా వాల్మీకి యే కులంబునఁ బుట్టె?
గుహుఁడను పుణ్యుఁడే కులమువాఁడు?
శ్రీశుకుండెచ్చటఁ జెలఁగి జన్మించెను?
శబరి యే కులమందు జన్మమొందె?
తే॥ నే కులంబున వీరు జన్మించినారు?

03/20/2018 - 22:01

సీ॥ స్తంభమందుదయించి దానవేంద్రునిఁ ద్రుంచి
కరుణతోఁ బ్రహ్లాదుఁ గాచినావు
మకరిచేఁజిక్కి సామజము దుఃఖింపంగఁ
గృపయుంచి వేగ రక్షించినావు
శరణంచు నా విభీషణుఁడు నీ చాటుకు
వచ్చినప్పుడె లంకనిచ్చినావు
ఆ కుచేలుఁడు చేరెడడుకుల ర్పించిన
బహుసంపదలనిచ్చి పంపినావు
తే॥ వారివలె నన్నుఁ బోషింప వశముగాదె
ఇంతవలపక్షమేల శ్రీకాంత! నీకు?

03/20/2018 - 01:30

నరసింహ శతకం
*
సీ॥ వాంఛతో బలిచక్రవర్తి దగ్గరఁజేరి
భిక్షమెత్తితివేల బిడియపడక!
అడవిలో శబరి తీయని ఫలాలందియ్యఁ
జేతులొగ్గితివేల సిగ్గుపడక!
వేడ్కతో వేవేగ విదురు నింటికి నేగి
విందుగొంటివదేమి వెలితి పడక?
అడుకులల్పము కుచేలుఁడు గడించుకుఁ దేఁగ
బొక్కసాగితివేల లెక్కఁగొనక?
తే॥ భక్తులకు నీవు పెట్టుట భావ్యవౌను
వానినాశించితివి తిండివాడఁవగుచు

03/18/2018 - 21:20

నరసింహ శతకం
*
సీ॥ ప్రహ్లాదుఁడే పాటి పైడి కానుకలిచ్చె?
మదగజంబెన్నిచ్చె వౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబుల?
హల్య నీకే యగ్రహారమిచ్చె?
ఉడుత నీకేపాటి యూడిగంబులు చేసె?
ఘన విభీషణుఁడేమి కట్నమిచ్చె?
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు?
ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చె
తే॥ నీకు వీరందరయినట్లు నేను కాన?
ఎందుకని నన్ను రక్షింప విందువదన?

03/16/2018 - 21:22

నరసింహ శతకం
*
సీ॥ వనజాతనాభ! నీ వంకఁజేరితి నేను
గట్టిగా ననుఁ గావు కావు మనుచు
వచ్చినందుకు వేగ వరములియ్యక కాని
లేవఁబోయిన నిన్ను లేవనియ్య
కూర్చుండఁబెట్టి నీ కొంగు గట్టిగఁ బట్టి
పుచ్చుకొందును జూడు భోగశయన!
ఈవేళ నీకడ్డ మెవరు వచ్చినఁగాని
వారికైనను లొంగి వణఁకఁబోను
తే॥ గోపగాఁడను నీవు నా గుణము తెలిసి
యిప్పుడే నన్ను రక్షించి యేలుకొమ్ము

03/15/2018 - 21:37

నరసింహ శతకం

03/14/2018 - 21:01

నరసింహశతక
సీ॥ వేదముల్ చదివెడు విప్రవర్యుండైన
రణము సాధించెడు రాజులైన
వర్తక కృషికుఁడౌ వైశ్యముఖ్యుండైనఁ
బరిచరించెడి శూద్రర్యుఁడైన
మెచ్చు ఖడ్గముఁబట్టి మెఱయుమ్లేచ్ఛుండైన
ప్రజల కక్కఱపడు రజకుఁడైన
చర్మమమ్మెడి హీనచండాలపరుఁడైన
నీ మహీతల మందునెవ్వడైన
తే॥ నిన్నుఁ గొనియాడుచుండెనా నిశ్చయముగ
వాఁడు మోక్షాధికారి రుూ వసుధలోన

Pages