S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

02/19/2018 - 20:58

నరసింహ శతకం

సీ॥ కువలయశ్యామ! నీ కొలువుచేసిన నాకు
జీతమెందుకు ముట్టఁజెప్పవైతి
మంచి మాటల చేత కొంచెమియ్యఁగ లేవు
కలహవౌనికఁ జుమ్ము ఖండితముగ
నీవు సాధువుగాన నింతపర్యంతంబు
జనువుచే నిన్నాళ్లు జరుపవలసె
నిఁక నే సహింపనీ విపుడు ననే్నమైన
శిక్షఁజేసిన చేయు సిద్ధ మైతి

02/16/2018 - 21:27

సీ॥ దనుజారి నావంటి దాసజాలము నీకు
కోటి సంఖ్య గలుగ కొదువలేదు
బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను
మఱచి పోకుము భాగ్యమహిమ చేత
దండిగా భృత్యులు దగిలి నీకుండంగ
బక్క మంటే పాటి పనికివచ్చు?
నీవు మెచ్చెడి పనుల్ నేను చేయఁగ లేక
ఇంత వృథా జన్మమెత్తినాను.

02/15/2018 - 20:25

నరసింహ శతకం

సీ॥ అడవి పక్షులకెవ్వఁడా హారమిచ్చెను
మృగజాతికెవ్వఁడు మేత పెట్టె?
జల చరాదులకు భోజనమెవ్వఁడి ప్పించె?
చెట్ల కెవ్వఁడు నీరు చేది పోసె?
స్ర్తిల గర్భంబులన్ శిశులనెవ్వఁడు బెంచె?
ఫణుల కెవ్వఁడు పోసెఁ బరగవిషము
మధుపాళికెవ్వండు మకరందమొనరించె?
పశుల కెవ్వఁ డొసెంగెఁ బచ్చిపూరి?

02/15/2018 - 00:00

సీ॥ ధరణిలోపల నేను తల్లిగర్భమునందుఁ
బుట్టినప్పటి నుండి పుణ్యమెరుఁగ
ఏకాదశీ వ్రతంబెన్నడుండఁగ లేదు
తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు
పారమార్థికమైన పనులు సేయఁగ లేదు
భిక్షమొక్కనికైనఁ బెట్టలేదు
జ్ఞానవంతులకైనఁబూని మ్రొక్కఁగలదు
ఇతర దానములైన నియ్యలేదు

02/13/2018 - 21:37

సీ. దేహమున్నవఱకు మోహసాగరమందు
మునుఁగు చుందురు శుద్ధ మూఢ జనులు
సలలితైశ్వముల్ -శాశ్వతంబనుకొని
షడ్బ్రమలను మానఁ జాలరెవరు

సర్వకాలము మాయ సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి
నిందఁ జేయక తాము నిలువ లేరు

02/15/2018 - 00:12

సీ. ఇలలోననే జన్మ మెత్తినప్పటి నుండి
పలుగడించితి నయ్య పాతకములు
తెలిసి చేసితిఁ గొన్ని తెలియఁజాలక చేసి
బాధ నొందితినయ్య పద్మనాభ!

అనుభవించెడు నప్పుడతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పఁగ జాల భయము గలిగె
ఎగిరి పోవుటకునై ఏ యుపాయంబైనఁ
జేసి చూతమటన్న ఁ జేతకాదు

02/11/2018 - 20:03

దేహమున్నవఱకు మోహసాగరమందు
మునుఁగు చుందురు శుద్ధ మూఢ జనులు
సలలితైశ్వముల్ -శాశ్వతంబనుకొని
షడ్బ్రమలను మానఁ జాలరెవరు
సర్వకాలము మాయ సంసార బద్ధులై
గురుని కారుణ్యంబు గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి
నిందఁ జేయక తాము నిలువ లేరు
తే. మత్తులైన ట్టి దుర్జాతిమనుజులెల్ల
నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!

02/09/2018 - 21:18

సీ. నరసింహ! నిన్నునే నమ్మినందుకు చాల
నెనరు నాయందుంచు నెమ్మనమున
న్ని వస్తువులు నిన్నడిగివేసట పుట్టె
నిఁకనైన ననుఁ గటాక్షింపవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు
భూమియందే యుంచు భోగి శయన!
నయముగా వైకుంఠ నగరమందే యుంచు
నరకమందే యుంచు నళిన నాభ!
తే. ఎచట నన్నుంచినను గాని యెపుడు నిన్ను
మఱచి పోకుండ నీ నామస్మరణ నొసఁగు

02/08/2018 - 21:07

నరసింహ శతకం
*

02/07/2018 - 21:59

సీ. కాయమెంత భయానఁ గాపాడినను గాని
ధాత్రి లోనది చూడఁ దకక్కఁబోదు
నీ వేళ నేరోగ మేమరించునొ సత్త్వ
మొందంగఁజేయ నే చందమునను
ఔషధంబులు మంచి ననుభవించినఁగాని
కర్మక్షీణంబైనఁ గాక విడదు
కోటి వైద్యులు గుంపు గూడి వచ్చినఁగాని
మరణమయ్యెడి వ్యాధి మాన్పలేరు
తే. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన
నిలుచునా దేహమిందొక్కనిముషమైన

Pages