S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేర్చుకుందాం

08/30/2017 - 23:18

చ. అనుపమశక్తిమంతులు మదాత్మజు లేవుడు దేవతావరం
బున నుదయించి యున్న కృతపుణ్యులు వారలలోన నగ్రజుం
డనఘుఁటు రాజసూయము మహామతిఁ జేయఁగ నోపు శత్రుసూ
డనుఁడయి సార్వభౌముఁడయి తమ్ముల బాహుబలంబు పెంపునన్

08/29/2017 - 23:36

చ. గొనకొని మర్త్యలోకమునకుం జని సమ్మనినాథ! యిందు నా
యునికిని రాజసూయమఖ మున్నతిఁ జేసిన ధన్యు లింద్రునం
దునికియు నా తనూజున కనూనయశోనిధి యైన ధర్మ నం
దనుదకుఁ జెప్పి వాని నుచితస్థితిఁ బన్పుఁడు దానిఁ జేయఁగన్

08/27/2017 - 20:43

ఉ. దీపిత సత్యసంధుఁడు ధృతిస్మృతి ధర్మపరాయణుండయో
ధ్యాపురనాయకుండు జలజాప్తకులైక విభూషణుండు వి
ద్యాపరమార్థవేది శరదబ్జసముజ్జ్వల కీర్తిచంద్రికా
స్నాపితసర్వలోకుఁడు త్రిశంకునరేంద్రసుపుత్రుఁడున్నతిన్

08/26/2017 - 20:56

మధ్యాక్కర
పరమధర్మాత్మకుఁడయిన పాండు భూపతిఁడొట్టి సకల
ధరణీశులెల్ల యమసభ నుండంగఁ దానేమి పుణ్య
చరితఁ బ్రవర్తిల్లెనయ్య దేవేంద్రసభ హరిశ్చంద్రుఁ
డురుతరమహిమతో దేవపూజ్యుఁడై యుండంగఁ గనియె?

08/24/2017 - 21:46

చ. అతుల విభూతితో మణిమయాభరణ ద్యుతు లొప్పఁగా శత
క్రతుఁడు శచీసమేతుఁడయి కాంచన చారు విమాన మాలికా
గత విదిజోత్తముల్ గొలువఁగా గొలువుండు పరాప్సరోంగనా
యత విలసత్కటాక్ష కుసుమార్చిత సుందర వక్త్ర చంద్రుఁడై

08/23/2017 - 22:07

క. శతమఖుసభ శుభరత్నాం
చితకాంచన నరచిత మతివిచిత్రము, లోక
త్రితయాఖిల లక్ష్మీ సం
శ్రీత; మలవియె దానిఁ బొగడ శేషున కయినన్

08/22/2017 - 21:04

క. సురపతి యమ వరుణ ధనే
శ్వర కమలాసనుల దివ్య సభలెల్ల సరే
శ్వర చూచితి ; నవి దీనికి
సరిగా వత్య్త విభవ సౌందర్యములన్

08/20/2017 - 21:44

క. భూనాథ! యిది యపూర్వ మ
మానుషము, విచిత్ర రత్నమయ మిట్టి సభన్
మనావలోకేశ్వరులం
దేనెన్నఁడు జూచి వినియు నెఱుఁగ ధరిత్రిన్

08/20/2017 - 00:20

తే. నా యథాశక్తిఁ జేసి యన్యా పథముఁ
బరిహరించి మహాత్ముల చరితలందు
బుద్ధి నిలిపి మీ యుపదేశమున శుభంబు
లయిన వాని ననుష్టింతు ఁబ్రియము తోడ

08/18/2017 - 22:19

తే. కడిఁది రిపులపైఁ బోవంగఁ గడఁగి యున్న
నీకు ముందఱఁ జని రిపునృపుల యందుఁ
దగిలి సామాద్యుపాయంబు లొగిన సంప్ర
యోగమున ఁ జేసి వర్తిల్లుచునె్న చెపుమ

Pages