S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 08:24

శ్రీకాకుళం(టౌన్), ఏప్రిల్ 28: జిల్లాలో కొబ్బరి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కంచి కామాక్షి కొబ్బరి కార్మిక యూనియన్ నేతలు గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సత్యాగ్రహం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కంచిలి కొబ్బరి కార్మికుల పొట్టకొడుతూ అక్రమ లాకౌట్ ప్రకటించడం అన్యాయమన్నారు.

04/29/2016 - 08:23

పలాస, ఏప్రిల్ 28: తనను మోసం చేశారని, ఆర్డీవో వచ్చి న్యాయం చేయాలంటూ గురుదాసుపురం సాయినగర్‌కు చెందిన సొర్ర భీమారావు గురువారం రంగోయిలోని సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందడంతో డిఎస్పీ దేవప్రసాద్, సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ శ్రీరాములు సంఘటన స్థలానికి చేరుకొని భీమారావుతో సెల్‌ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు.

04/29/2016 - 08:23

శ్రీకాకుళం(రూరల్), ఏప్రిల్ 28: జిల్లాలో ఇంజినీరింగ్, వ్యవసాయ, వైద్య కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎంసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఎంసెట్ జిల్లా కన్వీనర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.బాబూరావు తెలిపారు. ఈనెల 29న జిల్లాలో 11 కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఇంజినీరింగ్ కోసం 6022మంది, వ్యవసాయ, వైద్య విభాగాలకు సంబంధించి 2164మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు.

04/29/2016 - 08:22

ఇచ్ఛాపురం, ఏప్రిల్ 28: స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి ప్రసవం కోసం వచ్చిన గర్భిణితోపాటు ఆమె కడుపులోని చిన్నారి కూడా హఠాత్తుగా మరణించడంతో మృతురాలు బంధువులు, రత్తకన్నకొండపోలమ్మవాసులు ఆందోళన దిగారు. పండింటి బిడ్డతో ఇంటికి పంపుతారనుకుంటే వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరించి మృతదేహాలను పంపుతున్నారని విలపించారు.

04/29/2016 - 08:21

శ్రీకాకుళం, ఏప్రిల్ 28: జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు దోహదడాల్సిన ప్రభుత్వ శాఖల పనితీరుపై రాష్ట్ర కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహిస్తే... ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలంటూ అధికారులకు కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం క్లాసులు తీసుకున్నారు. ఇక్కడ జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం సర్వసభ్య సమావేశం జరిగింది.

04/29/2016 - 08:21

కొత్తూరు, ఏప్రిల్ 28: హిందూధర్మ పరిరక్షణకు హిందువులంతా సంఘటితం కావాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ సహాయ కార్యదర్శి జి.సత్యం అన్నారు. గురువారం స్థానిక వేంకటేశ్వర కల్యాణ మండపం ఆవరణలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందుధర్మ పరిరక్షణపై సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సత్యం మాట్లాడుతూ హిందువులు హక్కులు కాపాడుకోవడంలో బాధ్యతగా ఉండాలన్నారు.

04/29/2016 - 08:20

శ్రీకాకుళం, ఏప్రిల్ 28: ముప్పై ఏళ్ళు నాటి పరిస్థితి మరల ఇప్పుడు వంశధారకు దాపురించింది! రెడ్‌స్టోరేజీని మిగల్చకుండా వాడేశారు. లక్షలాది క్యూసెక్కుల నీటి నిల్వలు సామర్థ్యం కలిగిన వంశ‘్ధర’ ఆవిరైపోయింది. రైతాంగం అల్లాడిపోతోంది. వంశధార దిగువ గల 2.45 లక్షల ఎకరాలు కరవు కోరల్లో చిక్కుకుపోయాయి.

04/29/2016 - 08:18

చీరాల, ఏప్రిల్ 28: కట్టుకున్నోడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. తాను మరో మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధానికి అడ్డుగా మారిందన్న అక్కసుతో అతని మనసు కర్కశంగా మారింది. మాజీ రౌడీషీటర్ కూడా కావడంతో అతను తనలోని క్రిమినల్ బుర్రకు పదునుపెట్టాడు. భార్య హత్యకు పథకం రచించి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.

04/29/2016 - 08:17

ఒంగోలు, ఏప్రిల్ 28 : జిల్లావ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాల్లో ఎంసెట్ పరీక్షలు శుక్రవారం జరగనున్నాయి. ఆ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జిల్లావ్యాప్తంగా ఇంజనీరింగ్, మెడిసిన్‌కు సంబంధించి 12వేల 742మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. వారిలో ఇంజనీరింగ్ అభ్యర్థులు 9,782 మంది, మెడిసిన్ విద్యార్థులు 2,960 మంది ఉన్నారు.

04/29/2016 - 08:17

ఒంగోలు, ఏప్రిల్ 28 : జిల్లాలో ఆక్రమణలకు గురైన ఇరిగేషన్ చెరువులను గుర్తించి నీరు-చెట్టు పథకం కింద చెరువుకట్టలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక తన కాన్ఫరెన్స్ హాల్లోఇరిగేషన్ చెరువుల ఆక్రమణలు, నీరు-చెట్టు పథకం, కౌలురైతులకు గుర్తింపుకార్డులు, ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకం తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Pages