S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 08:05

కర్నూలు సిటీ, ఏప్రిల్ 28 : ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ ఒక పెద్ద ఇగో మాస్టర్ అని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి విమర్శించారు. జగన్ పద్ధతి మార్చుకోకపోవటం వల్ల సలహాదారుడిగా చేరిన మైసురారెడ్డి సైతం గోళ్లు గిల్లుకుటూ ఉండలేమని భావించి వైకాపాను వదిలి టిడిపిలో చేరుతున్నారని తెలిపారు.

04/29/2016 - 08:04

నంద్యాల, ఏప్రిల్ 28: నంద్యాల పార్లమెంటు పరిధిలో వైకాపా చుక్కాని లేని నావలా డీలా పడింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వారానికే నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరి బోణీ చేయగా, కొంత విరామం అనంతరం వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలోకి క్యూ కట్టారు.

04/29/2016 - 08:02

నేలకొండపల్లి, ఏప్రిల్ 28: పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి శుక్రవారం నామినేషన్ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త తరలి రావాలని పార్లమెంటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాంరెడ్డి చరణ్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. గురువారం ఆయన మాట్లాడుతూ రాంరెడ్డి మృతి తర్వాత జరిగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టిడిపి, వైసిపి పార్టీల మద్దతు ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

04/29/2016 - 08:01

ఖమ్మం, ఏప్రిల్ 28: టిఆర్‌ఎస్ 15వ ప్లీనరీ విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఖమ్మంలో బుధవారం నిర్వహించిన ప్లీనరీ, భారీ బహిరంగ సభ విజయవంతమైన నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధిస్తారని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

04/29/2016 - 08:00

ఖమ్మం(కల్చరల్), ఏప్రిల్ 28:ప్రతి ఎన్నికల సందర్భంలో అనేక వాగ్దానాలు కురిపిస్తూ ప్రజలను మోసం చేస్తున్న అధికార పార్టీ పతనావస్థకు చేరువలో ఉందని వామపక్ష పార్టీల నాయకులు జోస్యం చెప్పారు. గురువారం పాలేరు ఉప ఎన్నిక సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావు నామినేషన్ సందర్భంగా జరిగిన సభలో వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడారు.

04/29/2016 - 07:59

భద్రాచలం, ఏప్రిల్ 28: ఇటీవల ఐటీడీఏలోని గిరిజన ఆశ్రమాల్లో నకిలీ పిజి సర్ట్ఫికేట్లతో ఉద్యోగం వెలగబెడుతున్న ఇద్దరిని గుర్తించి తొలగించిన సంగతి విదితమే. వీరిద్దరే కాకుండా మరో ఉపాధ్యాయుడు కూడా ఉన్నారనే సమాచారంతో విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగకుండానే ఐటీడీఏలోనే వైద్య, ఆరోగ్యశాఖలోనూ ఇలాంటి అక్రమాలు ఉన్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.

04/29/2016 - 07:59

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 28: పాలేరు ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రజ్ఞా సమావేశ మందిరంలో పాలేరు ఉప ఎన్నిక నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

04/29/2016 - 07:57

చిలకలూరిపేట, ఏప్రిల్ 28: 36 లక్షల రూపాయల విలువ కల్గిన బంగారు ఆభరణాలు, వస్తువులను, 4 లక్షల రూపాయల నగదు అపహరణ జరిగిందన్న ఫిర్యాదు ఆధారంగా చిలకలూరిపేట పట్టణ పోలీసులు ఆ నగదును రికవరీ చేశారని నరసరావుపేట డిఎస్‌పి కె నాగేశ్వరరావు తెలిపారు. చిలకలూరిపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు.

04/29/2016 - 07:56

గుంటూరు, ఏప్రిల్ 28: అమరావతిని వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కాంతిలాల్‌దండే సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్‌తో పాటు పలు శాఖల అధికారులతో అమరావతి అభివృద్ధిపై సమీక్షించారు.

04/29/2016 - 07:55

గుంటూరు, ఏప్రిల్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లనన్నింటినీ జిల్లా యంత్రాంగం పూర్తిచేసింది. గుంటూరు నగరంతో పాటు గురజాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

Pages