S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 08:16

ఒంగోలు, ఏప్రిల్ 28 : ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే ఎక్కువగా హెల్మెట్ ధరించని కారణంగా మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని జిల్లా ఎస్పీ సిహెచ్ శ్రీకాంత్ తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటనలో ప్రమాదాల వివరాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగా జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 90 మంది మృతి చెందినట్లు ఆయన తెలిపారు.

04/29/2016 - 08:16

మార్కాపురం టౌన్, ఏప్రిల్ 28: రైతు సంక్షేమమే టిడిపి ధ్యేయమని, అన్నదాతల అభివృద్ధి కోసం ఆర్థిక లోటును తట్టుకొని ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు దక్కిందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.

04/29/2016 - 08:16

గిద్దలూరు, ఏప్రిల్ 28: అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా భావించి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని పరిపాలిస్తోందని రాష్టమ్రున్సిపల్ శాఖామంత్రి పి నారాయణ అన్నారు. జిల్లా పర్యటనకు వచ్చి ఆయన గురువారం గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన అనంతరం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ సమర్థుడైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన ప్రజలకు అందుతోందన్నారు.

04/29/2016 - 08:12

కోట, ఏప్రిల్ 28: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన పథకం ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి మాణిక్యాలరావు అన్నారు. కోటలోని రెడ్డి కల్యాణ మండపంలో గురువారం జరిగిన బిజెపి గూడూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

04/29/2016 - 08:11

వేదాయపాళెం, ఏప్రిల్ 28: ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చరల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎంసెట్ పరీక్షను అధికారులు జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షకు 16,290 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు విభాగాలకు సంబంధించి పరీక్ష జరుగుతుంది.

04/29/2016 - 08:12

ఆత్మకూరు, ఏప్రిల్ 28: ప్రజా బాహుళ్యంలో ప్రతి వస్తుసేవకు విక్రయ ధర నిర్ణయం ఉత్పత్తిదారుడి అభీష్టం మేరకే ఉండటం పరిపాటి. రైతుల పంట విషయంలో మాత్రం కొనుగోలుదారుడు చెప్పిన ధరకు అమ్ముకోవడం దేశ దౌర్భాగ్యానికి నిదర్శనం. జాతిని బతికించే అన్నదాతలైన రైతన్నలు తాము ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంట చేతికొచ్చాక కొనుగోలుదారుడి ఇష్టానుసారంగా మసలుకోక తప్పడంలేదు.

04/29/2016 - 08:14

నెల్లూరు, ఏప్రిల్ 28: స్వచ్ఛ భారత్ అమలులో జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు జిల్లా అధికారగణం కంకణం కట్టుకుంది. జిల్లా కలెక్టర్ ఎం.జానకి ప్రత్యేక చొరవ చూపిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. దీనికి ‘ఆత్మగౌరవం’ పేరు పెట్టి గ్రామీణుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బహిరంగ మల విసర్జన సాంఘిక దురాచారంగా గ్రామీణులకు తెలియచెప్పడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.

04/29/2016 - 08:13

వెంకటాచలం, ఏఫ్రిల్ 28 : భవిష్యత్ తరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు జరుగుతున్న నీటి పొదుపు ఉద్యమంలో పార్టీలకతీతంగా అందరూ భాగస్వాములు కావాలని సర్వేపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన వెంకటాచలంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆయన గురువారం ఇంకుడుగుంత తవ్వారు.

04/29/2016 - 08:08

సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: ఒకప్పుడు బంగాళాఖాతానికి తూర్పు వైపున చీమలు దూరని చిట్టడవిలో చిరుదీవిలో ఉన్న శ్రీహరికోట నేడు రాకెట్ ప్రయోగాలకు గుండెకాయలా మారింది. అంతరిక్ష ప్రయోగాలకు రాచబాటగా మారి అంతరిక్షంలో కోట నిర్మించుకునేందుకు మన శాస్తవ్రేత్తలు ఎదిగారు. విదేశాలకు దీటుగా భారీ ప్రయోగాలకు శ్రీహరికోట వేదికయింది.

04/29/2016 - 08:06

కర్నూలు, ఏప్రిల్ 28 : జిల్లాలో ఉష్ణోగ్రతల్లో కాస్త తగ్గుదల కనిపించింది. గత రెండు, మూడు రోజులుగా 45 డిగ్రీల స్థాయికి చేరిన ఉష్ణోగ్రత గురువారం కాస్త తగ్గి జిల్లా వ్యాప్తంగా సగటున 43 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కర్నూలు నగరంలో 43.4, నంద్యాలలో 43, ఆదోనిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. అయితే వడగాలుల ప్రభావం మాత్రం అలాగే కొనసాగుతోంది.

Pages