S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 06:49

మార్కాపురం, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మే 1వతేదీ నుంచి నిత్యం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖమంత్రి నారాయణ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ సమావేశం హాల్‌లో అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

04/29/2016 - 06:48

కర్నూలు, ఏప్రిల్ 28: వరుస కట్టి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల తీరుతో ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో పోలింగ్‌పై చూపే ప్రమాదం ఉందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

04/29/2016 - 06:48

తిరుపతి, ఏప్రిల్ 28: తిరుమలలో టిటిడి కల్యాణ వేదికలో వివాహాలు చేసుకునే వధూవరులకు మే 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని టిటిడి ఇ ఒ సాంబశివరావు ఐటి అధికారులను ఆదేశించారు. గురువారం టిటిడి పరిపాలనాభవనంలో తన కార్యాలయంలో ఆయన ఐటి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 9న అక్షయ తృతీయ సందర్భంగా ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంచాలన్నారు.

04/29/2016 - 06:47

గుంటూరు, ఏప్రిల్ 28: కాంగ్రెస్ కురువృద్ధుడు, ఏఐసిసి సభ్యుడు గాదె వెంకటరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 1967లో ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన గాదె మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొలువులో పలు మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.

04/29/2016 - 06:45

విజయవాడ, ఏప్రిల్ 28: మే 15 నాటి నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని ప్రధానమైన పలు శాఖల ద్వారా నిర్వహించే ఫైళ్ల నిర్వహణ ఇ-ఆఫీసు ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యదర్శి, ఎక్స్ అఫిషియో ఐటి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు.

04/29/2016 - 06:44

విజయవాడ, ఏప్రిల్ 28: వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడుతున్న శాసనసభ్యులందరూ తక్షణం రాజీనామాలు చేసేందుకు సిద్ధమే, అయితే రోజుకొకరు వచ్చి చేరుతున్నారు. పదే పదే ఉప ఎన్నికలు ఎందుకు జగన్ మినహా 66 మంది వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనిఇటీవలే తెలుగుదేశంలో చేరిన విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అన్నారు. ఖచ్చితంగా మే 15లోగా 50 శాతం మంది అంటే 34 మంది టిడిపిలో చేరిపోగలరన్నారు.

04/29/2016 - 06:43

గుంటూరు, ఏప్రిల్ 28: ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనారోగ్యకరంగా ఉన్నాయని ఈ పరిస్థితుల్లో తాను ఇమడలేక ఇక వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

04/29/2016 - 06:42

మడకశిర, ఏప్రిల్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కరవు కవల పిల్లలని, చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా కరవు కూడా వస్తోందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.

04/29/2016 - 06:42

కర్నూలు, ఏప్రిల్ 28: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరు కారణంగానే ఆ పార్టీకి నష్టం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. కర్నూలు నగరంలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అహంభావం కారణంగానే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారని తెలిపారు.

04/29/2016 - 06:40

కల్లూరు, ఏప్రిల్ 28: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రామకృష్ణాపురం గ్రామ సమీపాన గురువారం ఉదయం రాష్ట్రీయ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. ఈ విషయమై ఎస్సై పి సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ఐటి పాయల గ్రామానికి చెందిన సింగారపువెంకన్న (25) సుద్ద లోడు లారీతో సత్తెనపల్లి వైపు వెళుతున్నాడు.

Pages