S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 05:44

సూళ్లూరు పేట, ఏప్రిల్ 28: నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి గురువారం మధ్యాహ్నం తాజాగా ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి రాకెట్‌తో మనకంటూ సొంత దిక్సూచి వ్యవస్థకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఉపగ్రహ బరువు 1425కిలోలు. ఇది 12సంవత్సరాలు పాటు సేవలు అందించనుంది. భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన నావిగేషన్ సిరీష్‌లో ఇది చివరిది.

04/29/2016 - 05:43

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశంలోకి చౌకగా వచ్చిపడుతున్న ఉక్కు దిగుమతులను నియంత్రించేందుకు వీలుగా మరిన్ని చర్యలు చేపట్టేందుకు తమ శాఖ సుముఖంగా లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఉక్కుపై తాము కనీస దిగుమతి ధర (ఎంఐపి)ను విధించామని, ఈ దిగుమతులను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టే విషయం గురించి తాను ఆలోచించడం లేదని ఆమె విలేఖర్లకు తెలిపారు.

04/29/2016 - 05:42

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఆర్ధిక కార్యకలాపాలు అందించేందుకు ఏర్పాటైన సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ వెల్లడించారు. గురువారం నాడిక్కడ ఒక హాటల్‌లో సింక్రోనీ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జయేష్ రంజన్ హాజరయ్యారు.

04/29/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చేనేత కార్మికులను మహత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కిష్టప్ప గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

04/29/2016 - 05:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని తెలుగుదేశం సభ్యుడు సిహెచ్ మల్లారెడ్డి ఎన్‌డిఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లారెడ్డి గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో తెలంగాణలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో నెలకొన్న తాగునీటి సమస్య గురించి ప్రస్తావించారు.

04/29/2016 - 05:40

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో 377 నిబంధన కింద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్ ఎంతో అవసరమని చెప్పారు.

04/29/2016 - 05:23

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కాంలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సోనియాకు సంబంధించి మరో బాంబు పేల్చారు. ‘వీవీఐపి చాపర్ కేసులో ముడుపులు తీసుకున్న సోనియాగాంధీ, ఆ డబ్బును జెనీవాలోని సరాసిన్ బ్యాంకులో దాచి ఉంచార’ని స్వామి గురువారం ఆరోపణ చేశారు. ‘సోనియా ముడుపులు తీసుకున్న మాట వాస్తవం.

04/29/2016 - 05:22

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వివిఐపి హె లికాప్టర్ల కుంభకోణంలో ప్రధానమైన అంశం అవినీతేనని పేర్కొంటూ ఇందులో అవినీతికి, అక్రమాలకు పాల్పడిన వారినెవరినీ వదలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు నిలబెడతామని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ హెలికాప్టర్ల తయారీ సంస్థ అగస్టా వెస్ట్‌లాండ్‌ను యుపిఏ ప్రభుత్వం బ్లాక్‌లిస్టులో పెట్టిందని కాంగ్రెస్ చేసిన వాదనను తోసిపుచ్చింది.

04/29/2016 - 05:30

పోర్ట్ మోరెస్బీ(పీఎన్జీ), ఏప్రిల్ 28: దక్షిణ సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి నేపథ్యంలో సముద్రమార్గంలో ఉద్రిక్తతలు, శత్రుత్వాలు కూడదని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం పిలుపునిచ్చారు.

04/29/2016 - 04:50

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: చేనేత కార్మికులను మహత్మా గాంధీ జాతీయ ఉపాధి కల్పనా హామీ పథకం పరిధిలోకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ లోక్‌సభ సభ్యుడు నిమ్మల కిష్టప్ప ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. కిష్టప్ప గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

Pages