S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 06:04

హైదరాబాద్, ఏప్రిల్ 28: వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశపరీక్షలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సేవకుల వంశీ మొదటి ర్యాంకు సాధించారు. ఏప్రిల్ 6 నుండి 17వ తేదీ వరకూ భారతదేశంలో 118 నగరాలతో పాటు దుబాయ్, కువైట్, మస్కట్‌లలో కూడా ఈ ప్రవేశపరీక్షను నిర్వహించారు. విట్ ఫలితాలను గురువారం నాడు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాధ్ ప్రకటించారు.

04/29/2016 - 06:03

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వచ్చే నెల ఒకటో తేదీన విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో ఎండల తీవ్రత, తీసుకుంటున్న జాగ్రత్తల గు రించి చర్చించనున్నారు. అలాగే కృష్ణా పుష్కర పనులను సమీక్షించి, తీసుకోవల్సిన చర్యల గురించి చర్చించే అవకాశం ఉంది.

04/29/2016 - 06:02

హైదరాబాద్, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేసేందుకు ప్రభుత్వం ఎంక్వయిరీ కమిషనర్ డాక్టర్ ప్రేమ్‌చంద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా తడ మండలం బివి పాలెం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై విచారణ నిర్వహించాలని ఆదేశించింది.

04/29/2016 - 05:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బ్యాంకులకు ఉద్దేశ్యపూర్వకంగా వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి, రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యాను భారత్‌కు తిప్పి పంపాలని కేంద్ర ప్రభుత్వం గురువారం లాంఛనంగా బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.

04/29/2016 - 05:55

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ధరలతో పాటు ఉత్పత్తిలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని నిలబడే విధంగా రైతులకు చేయూతనిచ్చేందుకు తేయాకు, కాఫీ, రబ్బరు తదితర ఉద్యాన పంటలకు మార్కెట్ ఆధారిత బీమా పథకాన్ని ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.

04/29/2016 - 05:53

ముంబయి, ఏప్రిల్ 28: గత రెండు రోజులుగా లాభాల బాటలో సాగిన స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలు చవి చూశాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 461 పాయింట్లకు పైగా నష్టపోయి 26 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. గత మూడు వారాల్లో సెనె్సక్స్‌ఒక్క రోజులో ఇంత నారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి.

04/29/2016 - 05:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: భారత దేశ ఆర్థిక వ్యవస్థ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 7.6 శాతం మేర వృద్ధి చెందవచ్చని, 2017-18లో అది మరింత వేగవంతమై 7.8 శాతానికి చేరుకోవచ్చని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ఐక్యరాజ్య సమితి నివేదిక ఒకటి పేర్కొంది.

04/29/2016 - 05:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: వెండి యేతర ఆభరణాలపై విధించిన ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని ఉపసంహరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. విలాస వస్తువులను ఈ పన్ను పరిధి నుంచి తొలగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభలో స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

04/29/2016 - 05:46

నిజామాబాద్, ఏప్రిల్ 28: ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మూతబడ్డ బీడీ కార్ఖానాలు శుక్రవారం నుండి మళ్లీ తెరుచుకోనున్నాయి. బీడీ కంపెనీల యాజమాన్య సంఘంతో కార్మిక శాఖ అధికారుల సమక్షంలో బీడీ కార్మిక సంఘాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనతో లక్షలాది మంది బీడీ కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

04/29/2016 - 05:45

సూళ్లూరుపేట, ఏప్రిల్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ట మరో సారి ఇనుమడించింది. ఇస్రో నమ్మిన బంటు పిఎస్‌ఎల్‌వి రాకెట్ల విజయ పరంపరలు షార్‌లో కొనసాగుతున్నాయి. భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్తవ్రేత్తల ఉత్సాహం ఉరకలేయడంతో పాటు విజయగర్వం తొణికిసలాడుతోంది.

Pages