S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/29/2016 - 05:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బిజెపి సభ్యు డు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మూ లంగా గురువారం రాజ్యసభ జీరో అవర్‌లో పెద్దఎత్తున గొడవ జరిగి, సభాకాలం అరగంట వృధా అయింది. కాంగ్రెస్ సభ్యులకు భారత రాజ్యాం గం కంటే ఇటలీ రాజ్యాంగం గురించి బాగా తెలుసంటూ స్వామి చేసిన వ్యాఖ్య రాజ్యసభలో గందరగోళం సృష్టించింది. స్వామి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదని డిప్యూటీ చైర్మన్ పి.

04/29/2016 - 04:26

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం సభ్యుడు అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గురువారం లోక్‌సభలో 377 నిబంధన కింద మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే రైల్వే జోన్ ఎంతో అవసరమని చెప్పారు.

04/29/2016 - 04:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జి ప్రయోగం ఇస్రో శాస్తవ్రేత్తలు సాధించిన ఘనమైన విజయమని, 125 కోట్ల దేశ ప్రజలకు వారు అందించిన అమూల్యమైన కానుక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కొత్త వ్యవస్థకు ‘నావిక్’ అని పేరుపెట్టిన ఆయన ‘నావిక్’ పూర్తి పేరును ‘నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెల్లేషన్’ అని వివరించారు.

04/29/2016 - 04:20

బిష్ణుపూర్ (పశ్చిమ బెంగాల్), ఏప్రిల్ 28: ప్రముఖులు ప్రయాణించడం కోసం అగస్టావెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రూ. 3,600 కోట్లకు పైగా ముడుపులు ఎవరు తీసుకున్నారో వారి పేర్లు బైటికి వచ్చి తీరాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ‘కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరుగుతోంది.

04/29/2016 - 04:44

వాషింగ్టన్, ఏప్రిల్ 28: పాకిస్తాన్‌కు ఎనిమిది ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలన్న ఒబామా ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ విమానాలను అది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి కాక భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగిస్తుందేమోనన్న భయాలు వ్యక్తం చేశారు.

04/29/2016 - 04:13

చెన్నై, ఏప్రిల్ 28: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేపై అన్నా డి ఎంకే చీఫ్ జయలలిత తీవ్ర విమర్శలు చేశారు. తమ పోరాటం తమిళనాడును కబళించి తమ కుటుంబపాలన చేయాలని చూస్తున్న డీఎంకే నుంచి కాపాడాలన్నదేనని జయ అన్నారు. తమ పార్టీలో మాత్రమే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందని, పేదలు, సామాన్య ప్రజలతో అధికారాన్ని పంచుకుంటామని జయలలిత పేర్కొన్నారు. ‘కుటుంబ పాలన ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం.

04/29/2016 - 03:57

వరంగల్, ఏప్రిల్ 28: దశాబ్దాలుగా కోచ్ ఫ్యాక్టరీకోసం ఎదురు చూస్తున్న కాజీపేటకు మొత్తంమీద ఏదో ఒక యూనిట్‌ను కేటాయంచేందుకు సన్నద్ధత వ్యక్తం చేసింది. కోచ్ ఫ్యాక్టరీ స్థనంలో పిరియాడికల్ ఓవర్ హాలింగ్ (పిఓహెచ్) వర్క్‌షాపును ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ ఆయమోదముద్ర వేసింది. 269 కోట్లతో ఈ వర్క్ షాప్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో (2016-17) రూ. 20కోట్లు కేటాయంచారు.

04/29/2016 - 03:54

హైదరాబాద్, ఏప్రిల్ 28: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేయకుండా నిర్మించిన భవన యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ హైకోర్టు జిహెచ్‌ఎంసి, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకుడు గుంతలు కట్టని భవనాలకు మంచినీటి కనెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. ఎస్ వైదేహి రెడ్డి అనే ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది.

04/29/2016 - 03:53

హైదరాబాద్, ఏప్రిల్ 28: మానవీయకోణంలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి కోసం అనేక నూతన విధానాలను చేపట్టడానికి సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని పరిశ్రమల భవన్‌లో అధికారులతో గురువారం మంత్రి కెటిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

04/29/2016 - 03:49

హైదరాబాద్, ఏప్రిల్ 28: కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన తారక రామానగర్ ప్రాథమిక పాఠశాలకు చెందిన విద్యార్థులు స్వయంగా సేకరించిన రెండువేల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తమ విరాళాలు ఉపయోపడాలని ఆకాంక్షించారు.

Pages