S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 03:08

సిడ్నీ, జనవరి 22: ఆస్ట్రేలియాతో ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్ డేమ్యాచ్‌లలో ఘోరంగా పరాజయం పాలయిన టీమిండియా శనివారం ఇక్కడ జరిగే చివరివన్‌డేలోనైనా విజయం సాధించి వైట్‌వాష్ అవమానాన్ని తప్పించుకోవాలని గట్టిగా భావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు వన్‌డేలలో మొదటి మూడు మ్యాచ్‌లలో 300కుపైగా పరుగులు చేసినప్పటికీ ధోనీ సేన పరాజయాలను తప్పించుకోలేక పోయింది.

01/23/2016 - 03:07

సిడ్నీ, జనవరి 22: భారత్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో ఆస్ట్రేలియా పిచ్‌లు స్వభావానికి భిన్నంగా బౌలర్లకు ఏమాత్రం అనుకూలించని విధంగా ఉండడం పట్ల ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంతికి, బ్యాట్‌కు సరయిన పోటీ ఉండేలా చూడడం కోసం పిచ్‌లు ఇంతకు ముందుమాదిరి కాస్త పేస్, బౌన్స్ కలిగి ఉండాలని అభిప్రాయ పడ్డాడు.

01/23/2016 - 03:06

పెనాంగ్ (మలేసియా), జనవరి 22: మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు పివి.సింధు, కిదాంబి శ్రీకాంత్ తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం వీరు ఇక్కడ తమతమ ఈవెంట్లలో ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

01/23/2016 - 03:06

మెల్బోర్న్, జనవరి 22: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గ్రాండ్‌శ్లామ్ మ్యాచ్‌లలో 300 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా అతను రికార్డులకు ఎక్కాడు.

01/23/2016 - 02:56

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపినే కింగ్ మేకర్ అవుతుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు శుక్రవారం శిక్షణా తరగతి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ వారికి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం వంటి సలహాలు, సూచనలు చేశారు.

01/23/2016 - 02:55

హైదరాబాద్, జనవరి 22: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు కమిటీల నిర్మాణంపై మరి కొంత సమయం ఇవ్వాలని రెండు ప్రభుత్వాల న్యాయవాదులు హైకోర్టును కోరారు. ఇసుక అక్రమరవాణాపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ పిల్‌ను కటకం మృత్యుంజయం దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇసుక అక్రమ రవాణాను నిరోధించేందుకు రెండు రాష్ట్రాలు ఉన్నత స్ధాయి కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

01/23/2016 - 02:55

నల్లగొండ, జనవరి 22: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో శ్రీలంక ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొలంబోలోని నాలుగు ఆసుపత్రుల్లో విదేశీయులకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లను నిలిపివేస్తున్నట్లుగా శ్రీలంక వైద్య శాఖ మంత్రి రజిత సేనరత్నే ప్రకటించారు.

01/23/2016 - 02:54

సంగారెడ్డి, జనవరి 22: ఐదేళ్లుగా జీవనోపాధి కల్పిస్తున్న కన్నతల్లి లాంటి శాఖకు ఏకంగా ఓ చిరు ఉద్యోగి పెద్ద మొత్తంలో సున్నం పెట్టాడు. జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ రూ.3.13 కోట్ల రూపాయలు స్వాహా చేసిన ఉదంతం శుక్రవారం వెలుగు చూసింది.

01/23/2016 - 02:54

నల్లగొండ, జనవరి 22: నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజలకు రక్షిత కృష్ణా మంచినీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన సిపిడబ్ల్యుపి పథకాలు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఆ పథకాల మనుగడును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. తాజాగా కృష్ణా మంచినీటి పథకాల విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ ఐదు నెలల వేతన బకాయిల కోసం శుక్రవారం నుండి సమ్మెకు దిగారు.

01/23/2016 - 02:53

హైదరాబాద్, జనవరి 22: ‘గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి-బిజెపిలను ఆశీర్వదించండి..’ అని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ, బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా టియుడబ్ల్యుజె శుక్రవారం నిర్వహించిన మీట్-ది-ప్రెస్ కార్యక్రమంలో ఎల్. రమణ, కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

Pages