S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 03:57

నార్సింగి, జనవరి 22: లంగర్‌హౌస్‌లో టిఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం అన్నారు. శుక్రవారం లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్, బాపూఘాట్, గాంధీనగర్‌లలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నగరంలో టిఆర్‌ఎస్ వంద సీట్లను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఆడ్రస్ లేకుండా పోతాయని తెలిపారు.

01/23/2016 - 03:56

బేగంపేట, జనవరి 22: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బేగంపేట డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి తరుణి గెలుపుకోసం ఆయన శ్యామ్‌లాల్, తాతాచారినగర్, ఎరుకలబస్తీ, పోచమ్మబస్తీ, భగత్‌సింగ్‌నగర్, గురుమూర్తినగర్ ప్రాంతాల్లో ప్రచారం చేసారు.

01/23/2016 - 03:55

హైదరాబాద్, జనవరి 22: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి అధికారుల మధ్య సమన్వయలోపం ఏర్పడింది. ఇందుకు ఇప్పటివరకు అధికారులు ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన నామినేషన్ల స్వీకరణ, ఆ తర్వాత 18న నిర్వహించిన నామినేషన్ల పరిశీలన, ఆ తర్వాత ఉపసంహరణ ప్రక్రియలకు సంబంధించి అధికారులు తప్పులతడకగా వెల్లడించిన వివరాలే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు.

01/23/2016 - 03:54

హైదరాబాద్, జనవరి 22: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో జాతీయ విచారణ సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

01/23/2016 - 05:01

సైదాబాద్, జనవరి 22: సరైన ధ్రువపత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును సంతోష్‌నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌నగర్ ఏసిపి వి.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్నికల బందోబస్తులో భాగంగా సంతోష్‌నగర్ పోలీసులు స్థానిక శ్రీనివాస ఆసుపత్రి సమీపంలో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు నిర్వహించారు.

01/23/2016 - 03:52

దాచేపల్లి, జనవరి 22: గుంటూరు జిల్లా దాచేపల్లిలోని మాచర్ల అడ్డరోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఆగివున్న లారీని కారు ఢీకొని హైదరాబాద్‌లోని సచివాలయ భధ్రతాధికారి రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం గుంటూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు మాచర్ల అడ్డరోడ్డు వద్ద ఆగివున్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ సచివాలయంలో భధ్రత అధికారి రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

01/23/2016 - 03:51

హైదరాబాద్, జనవరి 22:జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని మూడురోజులుగా ప్రధాన రాజకీయపార్టీలకు అసంతృప్తి జ్వాలల సెగ తగులుతోంది. కాంగ్రెస్ పార్టీ ఈ మంటల సెగ తగలటంతో ఆందోళనకు దిగిన కార్యకర్తలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో గాంధీభవన్‌కు నేతలు తాళాలు వేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి నిరసన జ్వాలలు బిజెపి, టిడిపి పార్టీలను కూడా వెంటాడుతోంది.

01/23/2016 - 04:08

హైదరాబాద్, జనవరి 22: మహానగర పాలక సంస్థ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా సిద్ధం కావటంతో అభ్యర్థులు ప్రత్యర్థులను ఎంచుకుని నేటి నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రేటర్‌లోని 150 డివిజన్లలో క్షేత్ర స్థాయి సమాచారం తెప్పించుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీ పలు డివిజన్లలో అన్ని పార్టీల కన్నా ప్రచారంలో ముందుందని చెప్పవచ్చు.

01/23/2016 - 03:09

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా అందాల భామ మరియా షరపోవా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఐదో సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమె శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో 6-1, 6-7, 6-0 సెట్ల తేడాతో 22 ఏళ్ల అన్‌సీడెడ్ క్రీడాకారిణి లారెన్ డేవిస్‌ను ఓడించి కెరీర్‌లో 600వ విజయాన్ని అందుకుంది.

01/23/2016 - 03:09

వెల్లింగ్టన్, జనవరి 22: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఆటగాడు కొరీ ఆండర్సన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించాడు. బ్యాటింగ్‌లో అతను విజృంభించి అజేయంగా 82 పరుగుల కెరీర్ బెస్టు స్కోరు సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ చక్కగా రాణించి రెండు వికెట్లు కైవసం చేసుకున్నాడు.

Pages