S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/20/2019 - 23:50

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలతో కూడిన ‘దక్షిణ ప్రాంతీయ సమన్వయ కమిటీ’ సమావేశం హైదరాబాద్‌లోని కాకతీయ హోటల్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో దేశ అంతర్గత భద్రతకు సంబంధించి రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అందించుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు.

09/20/2019 - 23:45

హైదరాబాద్, సెప్టెంబర్ 20: అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసును ఈనెల 27కి కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం నాంపల్లిలో ఈ కేసుకు సంబంధించిన వాదనలను ఇరుపక్షాల న్యాయవాదులు కోర్టుకు వివరించారు. పెన్నా సిమెంట్ అదనపు చార్జిషీట్‌పై నాంపల్లిలోని సీబీఐ న్యాయస్థానం వాదనలు జరిగాయి.

09/20/2019 - 23:45

షామీర్‌పేట్, సెప్టెంబర్ 20: మహిళను చితిలో పడేసి యువకుడిని సజీవ దహనం చేసిన కేసులో నలుగురిని షామీపేట పోలీసులు అరెస్టు చేశారు. చేతబడి అనుమానమే ఓ అమాయకుడిని బలిగొన్న ఆ మూఢ నమ్మకమే ఆ యువకుడిని సజీవ దహనం చేసింది.

09/20/2019 - 23:21

లారీని ఢీకొన్న మారుతీ వ్యాను
ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం
మరో ఐదుగురికి తీవ్రగాయాలు బాధితులంతా విశాఖ జిల్లావాసులు

09/20/2019 - 23:18

రంపచోడవరం, సెప్టెంబర్ 20: గోదావరి వరద ఉద్ధృతంగా ఉన్న సమయం లో నిబంధనలకు విరుద్ధంగా పాపికొండలు విహారయాత్రకు బోటు నడిపి, అనేకమంది యాత్రికుల మరణానికి కారణమైన శ్రీ వశిష్ఠపున్నమి రాయల్ టూరిస్టు బోర్డు యజమాన్యానికి సంబంధించి ముగ్గురిని అరెస్టుచేశామని రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

09/20/2019 - 23:04

షాజహన్‌పూర్, సెప్టెంబర్ 20: న్యాయవాద కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణ కేసులో బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానందను ఉత్తర్ ప్రదేశ్ ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) శుక్రవారం అరెస్టు చేసింది. చిన్మయానందను స్థానిక కోర్టులో హాజరుపరచగా చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆయన్ను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.

09/20/2019 - 22:54

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గత ఆదివారం సంభవించిన బోటు ప్రమాదానికి సంబధించి శుక్రవారం ఒక మహిళ మృతదేహం లభించింది. గాలింపు చర్యలో భాగంగా మహిల మృతదేహాన్ని గుర్తించారు. కచ్చులూరు వద్ద లభించిన ఈ మృతదేహాన్ని విశాఖ జిల్లా గోపాలపురానికి చెందిన మదుపాక అరుణకుమారి (38)గా నిర్ధారించారు.

09/20/2019 - 22:53

చిత్తూరు, సెప్టెంబర్ 20 : చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్.శివప్రసాద్ ఆరోగ్యం విషమించింది. కిడ్నీవ్యాధితో బాధపడుతున్న ఆయనను వారం రోజుల కిందట మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో వైద్యశాలకు తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్నారు.

09/20/2019 - 22:52

కడప, సెప్టెంబర్ 20: కడప ఆర్టీఓ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. ఏసీబీ డిఎస్పీ ఎం.నాగభూషణం సిబ్బందితో కలిసి ఉదయం 11 గంటలకు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మంది ప్రైవేట్ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.90,310 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారికి సహకరించిన 17 మంది కార్యాలయం సిబ్బందిని సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

09/20/2019 - 22:50

మిడుతూరు, సెప్టెంబర్ 20: వరద నీటిలో పంట పొలం మునడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు జయరామిరెడ్డి(54), శేషమ్మ(49) గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా మిడుతూరు మండలం పి.లింగాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వృద్ధ రైతు జయరామిరెడ్డి(54) తన 4 ఎకరాల పొలంతో పాటు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.

Pages