S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/28/2020 - 01:25

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 27: కొత్తపేట పోలీసు స్టేషన్ పరిధిలో వా రం తిరక్కముందే పట్టపగలు మరో దొంగతనం చోటు చేసుకుంది. దీంతో కొత్తపేట పోలీసులు సంఘటనా స్థలానికి పరుగులు తీయాల్సి వచ్చింది. వా రంలోపే రెండు దొంగతనాలు చోటు చేసుకోవటంతో పోలీసులు కంగుతిన్నారు.

02/27/2020 - 04:44

సికిందరాబాద్, ఫిబ్రవరి 26: ఇంట్లో సమాచారమివ్వకుండా బయటకు వెళ్లిన ఓ రిటైర్డు అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం మయూర్‌మార్గ్‌లోని బాలకృష్ణ నిలయంలోని ఫ్లాట్ నెంబర్ 102లో రిటైర్డు అసిస్టెంటు సబ్ ఇన్‌స్పెక్టర్ భోంస్లే భవానీరావు(63) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు.

02/27/2020 - 04:42

వేములవాడ, ఫిబ్రవరి 26 : సిరిసిల్ల జిల్లా వేములవాడలో డీఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో రౌడీషీటర్‌ను కత్తులతో పొడిచి పట్టపగలు దారుణంగా హత్య చేశారు. ఉదయం 9 గంటల సమయంలో యువకునిపై మాజీ కౌన్సిలర్ కత్తులతో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.

02/27/2020 - 04:38

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 26: బర్త్ డే సెలబ్రేషన్స్ ఈవెంట్‌కు ఈవెంట్ ఆర్గనైజర్‌గా వ్యవహరించిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మహిళను కత్తులతో బెదిరించి నగ్నంగా నృత్యం చేయాలని ఒత్తిడి చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో డ్యాన్స్ చేసి తెల్లవారుజామున ఎవరూ చూడని సమయంలో తప్పించుకుని పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం...

02/27/2020 - 02:48

కేపీహెచ్‌బీకాలనీ, ఫిబ్రవరి 26: కూకట్‌పల్లిలోని ఐడీఎల్ ( ఇండియన్ డిటోనేటర్స్ లిమిటెడ్ ) గల్ఫ్ అయిల్ కార్పొరేషన్ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు డిటోనేటర్ పేలి భారీ పేలుడు సంబంవించింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరి కొంత మందికి గాయాలు అయ్యాయి. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోచోటు చేసుకుంది.

02/27/2020 - 02:44

మేడ్చల్, ఫిబ్రవరి 26: ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్ధమన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. బాధితుడు, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బాధితుడు రవితేజ బుధవారం సాయంత్రం తన స్నేహితుడితో కలిసి కారులో బాలానగర్ నుంచి మేడ్చల్‌కు బయలుదేరాడు. సరిగ్గా మేడ్చల్ మండల పరిధిలోని బాసరాయగడి గ్రామం వద్దకు రాగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయ.

02/27/2020 - 02:39

కీసర, ఫిబ్రవరి 26: ఇంటి నిర్మాణం కోసం చెట్లు అడ్డు వస్తున్నాయని చెట్లు నరికివేయగా, 30 వేల రూపాయలు జరిమానా విధించిన వైనం గోధుమకుంట గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గోధుమకుంట గ్రామ పంచాయతీ పరిధిలోని టీపీఎస్ కాలనీలో గతంలో హరితహారం కింద మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవిగా ఎదిగాయి.

02/27/2020 - 02:29

హైదరాబాద్: ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల కబ్జాపై హైకోర్టు బుధవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల తీరుపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ యంత్రాంగం ఆక్రమణదారులతో కుమ్మక్కయ్యారా? అని ప్రశ్నించింది. హైకోర్టుకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమా ర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ హాజరయ్యారు.

02/27/2020 - 02:28

హైదరాబాద్: సిరిసిల్ల రాజన్న జిల్లా, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులపై స్టేను మరోమారు హైకోర్టు పొడిగించింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు గత నవంబర్‌లో స్టే ఇచ్చింది. తాజాగా ఆ ఉత్తర్వులను మార్చి 10వ తేదీ వరకూ పొడిగించింది. బుధవారం నాడు హైకోర్టులో ఈ అంశంపై విచారణ కొనసాగింది.

02/26/2020 - 23:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ గృహ నిర్బింధం కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మెహబూబాను ప్రజా భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. పీడీపీ అధినేతను అక్రంగా నిర్బంధించి నెలల తరబడి విడుదల చేయకుండా ఉంచారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.

Pages