-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రజలకు నిరసన తెలియజేసే హక్కు ఉంది, అయితే రహదారులను దిగ్బంధించకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షాహీన్‌బాగ్ కేసులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. షాహీన్‌బాగ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూసేందుకు ఇద్దరు న్యాయవాదులను మధ్యవర్తులుగా కోర్టు నియమించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బీపీ ధర్మాధికారి పేరును సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ ధర్మాధికారి ప్రస్తుతం బాంబే హైకోర్టులోనే తాత్కాలిక సీజేగా ఉన్నారు. ఆయనను పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా ఎంపిక చేస్తూ కొలీజియం నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే అధ్యక్షతన ఈనెల 24న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డెహ్రాడూన్, ఫిబ్రవరి 26: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్‌దామ్ సహా ఉత్తరాఖండ్‌లోని 50 దేవాలయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నిర్ణయాన్ని తీర్థ పురోహితులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి మొండిగా వ్యవహరిస్తూ దేవస్థాన నిర్వహణ చట్టాన్ని తీసుకురావడాన్ని పురోహితులు ఖండించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటారో?
లక్నో, ఫిబ్రవరి 26: సమాజ్‌వాది పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు అజం ఖాన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఆయనతో పాటు భార్య, ఎమ్మెల్యే తాన్‌జీన్ ఫాతిమా, కుమారుడు ఎమ్మెల్యే అబ్దుల్లా ఆజంను కూడా మార్చి 2వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ మిశ్రా బుధవారం పిటీఐ వార్తా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ తెలిపారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఇటీవల అల్లర్లు చోటుచేసుకున్న ఈశాన్య ఢిల్లీలోని చాంద్ బాగ్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉద్యోగి మృతదేహాన్ని పోలీసులు బుధవారం కనుగొన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 26 ఏళ్ల అంకిత్ శర్మ కనిపించకుండా పోయారు. అతని ఆచూకీ గురించి గాలిస్తున్న పోలీసులకు బుధవారం ఉదయం మృతదేహం లభించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లపై విచారం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే అల్లర్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారణను నిరాకరించింది. ఈశాన్య ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణల్లో 20 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
ఒంగోలు, ఫిబ్రవరి 25: క్రైస్తవ మిషనరి పేరుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు తయారుచేసి వాటి ద్వారా వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని అందినకాడికి నగదు కాజేస్తూ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
తాడిపత్రి, ఫిబ్రవరి 25: అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం బిస్కెట్లు రవాణ చేస్తున్న ముఠా సభ్యులను మంగళవారం తెల్లవారుజామున షాద్‌నగర్‌వద్ద డీఆర్‌ఏ స్క్వాడ్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 25: అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కోపంతో ప్రియుడితో కలిసి కన్న కుమారుడిని హత్య చేసిన తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసిన నల్లగొండ రూరల్ పోలీసులు వారిని జైలుకు తరలించారు.
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 25: దేవరకొండ పట్టణంలోని సంక్షేమ హాస్టళ్లకు సోమవారం వెళ్లి తాము సీఎం పేషి నుండి వచ్చామని హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించి వార్డెన్‌ల నుండి డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు నల్లగొండ వన్‌టౌన్ పోలీసుల అదుపులో ఉన్నట్లుగా తెలిసింది.