S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/18/2020 - 07:21

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: సైన్యంలో మహిళా అధికారులకు పోరాట పదవులు మినహా మిగతా అన్ని యూనిట్లలో శాశ్వత కమిషన్ ఇవ్వటంతోపాటు కమాండ్ పోస్టింగ్‌లలో నియమించాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సైన్యంలో మహిళలకు శాశ్వత కమీషన్ ఇవ్వాలంటూ పది సంవత్సరాల క్రితం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది.

02/18/2020 - 02:37

హనుమాన్ జంక్షన్, ఫిబ్రవరి 17:పోలవరం కుడికాలువలో ప్రమాదవశాత్తు జారిపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. గొర్రెలకు కాలువలో నీరు త్రాగించే సమయంలో ఒకరు కాలుజారి కాలువలో పడిపోయాడు. పడిన యువకున్ని మరో యువకుడు రక్షించేందుకు ప్రయాత్నించడంతో ఇద్దరు క్షణాల వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

02/18/2020 - 02:27

తాండూరు, ఫిబ్రవరి 17: బస్టాండ్ నుంచి ఆదివారం రాత్రి బస్సు చోరీకి గురైంది. నేనే డ్రైవర్, నేనే కండక్టర్ అంటూ ఓ అగంతకుడు తస్కరించి కొంత దూరం తీసుకెళ్లి వదిలి పారిపోయాడు. తాండూరు బస్టాండ్‌లో కరణ్‌కోట్ మీదుగా ఓగీపూర్ గ్రామానికి వెళ్లేందుకు పాయింట్‌పై బస్సును నిలిపి డ్రైవర్ ఇలియాస్ కండక్టర్ జగదీష్ భోజనాలకు వెళ్లారు. బస్సులో సుమారు 25 మంది వరకు ప్రయాణికులు సైతం ఎక్కి కూర్చున్నారు.

02/18/2020 - 02:27

ఖైరతాబాద్, ఫిబ్రవరి 17: రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వయ్ ప్రమాదానికి గురైంది. సోమవారం బంజారాహిల్స్ నుంచి ప్రగతి భవన్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 మీదుగా మంత్రి కాన్వాయ్ ప్రయాణిస్తుండగా జలగం వెంగళరావు పార్క్ వద్దకు ద్విచక్రవాహనదారుడు ఆకస్మాత్తుగా కాన్వాయ్‌కు అడ్డుగా వచ్చాడు.

02/18/2020 - 00:47

హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణలోని కార్పొరేట్ కాలేజీలు, నిర్వహణ తీరు, విద్యార్థుల ఆత్మహత్యలు, నియమనిబంధనల పాటింపు తదితర అంశాలకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చిన నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక అసంపూర్ణంగా ఉందని వ్యాఖ్యానించింది. వేలాది మంది విద్యార్థులతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని నిలదీసింది. నిబంధనలను పాటించని

02/18/2020 - 00:26

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: నిర్భయ దోషులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలవుతోంది. నలుగురు నిర్భయ హంతకులు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ఆక్షయ్ సింగ్‌ను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ హైకోర్టు సోమవారం తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది. ముద్దాయిలు మరణించే వరకూ ఉరి తీయాలని న్యాయస్థానం ఆదేశించింది.

02/17/2020 - 23:36

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 17: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అటెండర్ ఒకరు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ వైనం మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. సోమవారం మహబూబ్‌నగర్ పట్టణంలోని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయ అటెండర్ వాజీద్ రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

02/17/2020 - 23:31

కరీంనగర్, ఫిబ్రవరి 17: కరీంనగర్ శివారు అల్గునూరు వద్ద కాకతీయ కాలువ నుంచి సోమవారం ఒక కారు బయటపడటం, అందులో మూడు మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉండటం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయంది. దాని కోసం గాలింపు చర్యలు చేపట్టగా కాల్వలో ఒక కారు ఉండటాన్ని గమనించిన పోలీసులు దానిని క్రేన్ సహాయంతో వెలికితీశారు.

02/17/2020 - 05:58

మక్తల్, ఫిబ్రవరి 16: కృష్ణానదిలో స్నానం చేయాలన్న సరదా ఆ ఇద్దరి యువకుల ప్రాణాలు బలికొన్న విషాద సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ నియోజవకవర్గంలోని కృష్ణ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

02/17/2020 - 05:46

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రైలులో గుట్టుగా రవాణా చేస్తున్న గంజాయిని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపురూ. 12 లక్షలు ఉంటుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గరు వ్యక్తులను దక్షిణ మధ్య రైల్వే ప్రొటెక్షన్ పోలీసులతో పాటు ఏపీ ఎక్సైజ్ ఫోర్స్ సంయుక్తంగా చేసిన దాడుల్లో వారు పట్టుబడ్డారు.

Pages