S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/20/2015 - 22:20

నవీన్ సంజయ్, తనిష్ తివారి, తన్వి మల్హర్ ముఖ్య పాత్రలో ప్రేమరాజ్ దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై మురళి బొమ్మకు నిర్మిస్తున్న ‘శరణం గచ్చామి’ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. హీరో హీరోయిన్స్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి వెంకటేశ్వరరావు క్లాప్ ఇవ్వగా, బొమ్మకు లక్ష్మి నరసమ్మ స్విచ్ ఆన్ చేయగా సానా యాదిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించాడు.

12/20/2015 - 22:19

సువర్ణ క్రియేషన్స్ పతాకంపై పి.డి.రాజు ప్రధాన పాత్రలో టి.సుధాకర్ రూపొందిస్తున్న చిత్రం ‘తొలి కిరణం’. జె.జాన్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం సారధి స్టూడియోలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ప్రపంచానికి వెలుగు చూపిన ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు.

12/20/2015 - 22:16

శే్వతామీనన్ ప్రధాన పాత్రలో మహేశ్వర ఆర్ట్స్ పతాకంపై పర్స రమేష్ మహేంద్ర దర్శకత్వంలో కల్వకుంట్ల తేజేశ్వర్‌రావు రూపొందిస్తున్న ‘షీ’ (ఈజ్ వెయిటింగ్) చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఫారెస్ట్ లొకేషన్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశంపై రమ్య క్లాప్ ఇవ్వగా, అనూప్‌సింగ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

12/20/2015 - 22:04

శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘ఎక్స్‌ప్రెస్ రా జా’ చిత్రం సూపర్‌హిట్ కావాలని హీరో ప్రభాస్ ఆకాంక్షించాడు. యు.వి. క్రియేషన్స్ పతాకంపై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందించిన ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి బిగ్ సీడీని, ఆడియో సీడీని ఆవిష్కరించారు.

12/19/2015 - 21:36

విజయ్‌భరత్, అశ్విని, కాంచన ప్రధాన తారాగణంగా ఎస్‌ఎస్‌సెల్యులాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యభరిత చిత్రం ‘వినోదం 100%’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సంపూర్ణేష్‌బాబు, పృధ్వీ కీలకమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేసారు.

12/19/2015 - 21:34

‘లోఫర్’ సినిమాతో మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న పూరి జగన్నాథ్ తన
తదుపరి చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోగ్’. ఈ సినిమాతో కన్నడ నటుడు ఇషాన్‌ని హీరోగా పరిచయం చేస్తున్నారు. తెలుగు, కన్నడ భాషల్లో
తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే

12/19/2015 - 21:32

నాగార్జున కథానాయకుడిగా అక్కినేని అన్నపూర్ణ స్టుడియోస్ పతాకంపై కల్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను నాగార్జున వివరించారు.

12/19/2015 - 21:29

సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్‌కుమార్, శశిధర్ నిర్మిస్తున్న చిత్రం ‘్భలే మంచి రోజు’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 25న విడుదలవుతున్న సందర్భంగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వివరాల్ని తెలియజేస్తూ ఈ చిత్రంలో మెకానిక్‌గా నటిస్తున్నానని, భాష, వేషం అంతా అదే స్థాయిలో ఉంటుందని అన్నారు.

12/19/2015 - 21:15

హైదరాబాద్
హైటెక్ సిటీలో
36 ‘డ్రైవ్ ఇన్ స్ట్రీట్’ను ప్రారంభిస్తున్న సందీప్ కిషన్. కార్యక్రమంలో హీరో నవీన్ చంద్ర,
అల్లు శిరీష్,
హీరోయిన్
దీక్షాపంత్, అర్జున్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

12/19/2015 - 21:14

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా సంపత్‌నంది దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన బెంగాల్ టైగర్ చిత్రం ఇటీవల విడుదలై మంచి వసూళ్లతో దూసుకుపోతున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభలో రవితేజ మాట్లాడుతూ ఈ చిత్రంతో సంపత్‌నందికి హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా వుందని, ఈ సినిమా విజయంకోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని అన్నారు.

Pages