S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/22/2015 - 22:12

గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా గోపీనాధ్ దర్శకత్వంలో పి.నరేందర్ రూపొందించిన ‘21 సెంచరీ లవ్’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవలే చిత్రానికి సంబంధించిన పాటలను విడుదల చేశామని, యూట్యూబ్, ఫేస్‌బుక్‌లలో అనూహ్యమైన స్పందన లభిస్తోందని తెలిపారు. నేటి యువత స్నేహం కోసం బ్రతకాలా?

12/22/2015 - 22:10

రామ్, కీర్తి సురేష్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ‘నేను.. శైజల’ పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకుడు కరుణాకరన్ సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు.

12/22/2015 - 22:08

‘ప్రేమకావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై
ఆ తరువాత పలు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. సాయికుమార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, హీరోగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘గరం’ చిత్రంలో నటిస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో
తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు
సిద్ధవౌతోంది. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఆయనతో మాటామంతీ...
ఆలస్యానికి అదే కారణం

12/22/2015 - 22:04

ప్రముఖ నటుడు పవన్‌కళ్యాణ్ హీరోగా నటించిన ‘పులి’ చిత్రంతో తెలుగు తెరకు
పరిచయమైంది గ్లామర్ భామ నికిషా పటేల్. ఆ సినిమాతో తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న ఈ భామకు ఆ సినిమా సరైన బ్రేక్‌ను ఇవ్వలేకపోయింది. దాంతో వచ్చిన అడపాదడపా
అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ఈ భామకు ఈమధ్యే తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. అక్కడా లాభం లేకపోవడంతో కన్నడ భాషలో పలు చిత్రాల్లో నటించింది. కెరీర్

12/22/2015 - 21:59

మహేష్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఊటిలో జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమాను కొత్త సంవత్సర కానుకగా తన అభిమానులకు అందివ్వడానికి మహేష్‌బాబు సిద్ధవౌతున్నాడు. అంటే, ‘బ్రహ్మోత్సవం’ ఫస్ట్‌లుక్‌ను జనవరి 1న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

12/22/2015 - 21:58

‘్ఠగూర్’ చిత్రంతో చిరంజీవిని సరికొత్త కోణంలో ఆవిష్కరించిన వి.వి.వినాయక్ మరోసారి ఇంకో ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్ 150వ సినిమా ఎపుడు చేస్తాడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇది శుభవార్తే. అదిగో ఇదుగో అంటున్న చిరు 150వ చిత్రానికి ఇప్పుడు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఓ చిత్రంతో భారీ పరాజయాన్ని చవిచూసిన వినాయక్, ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో రగిలిపోతున్నాడు.

12/22/2015 - 21:56

ప్రముఖ సినీ రచయిత, నటుడు చిలుకోటి కాశీవిశ్వనాధ్ ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్ నుండి వైజాగ్ వెళుతుండగా, ఖమ్మం సమీపంలో లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం యన మృతదేహాన్ని రైల్వే అధికారులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారని తెలిసింది. దాదాపు 60 సినిమాలకుపైగా రచయితగా పనిచేశారాయన.

12/22/2015 - 21:33

తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల వ్యాప్తి చేసి కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించిన దర్శకుడు ధీరుడు రాజవౌళి ప్రస్తుతం ‘బాహుబలి-2’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఫిలింసిటీలో జరుగుతోంది. ఇప్పటికే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘బాహుబలి’ని మించిన విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు రాజవౌళి. ప్రస్తుతం మరో సినిమా చర్చలోకి వచ్చింది.

12/22/2015 - 21:29

ఆనంద్ బచ్చు, రాధిక, లౌక్య, రాజ్ ముఖ్యపాత్రల్లో మిల్క్ మూవీస్, మినర్వా టాకీస్ పతాకాలపై విజయశేఖర్ సంక్రాంతి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘7 టు 4’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది.

12/22/2015 - 08:02

టాలీవుడ్‌లోకి బాలీవుడ్ హీరోయిన్ల ఎంట్రీ ఎప్పటినుండో నడుస్తున్న అంశమే. తెలుగు చిత్రాల్లో నటించేందుకు వారికి అమిత ఆసక్తి వుండడం చూస్తున్నదే. తాజాగా మరో బాలీవుడ్ భామ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఆమె ఎవరో కాదు ముంబాయి మోడల్ కామ్న. ఈ భామ హీరోయిన్‌గా నటించేది అల్లరి నరేష్ సరసన. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ చిత్రం ఈనెల 25న విడుదలవుతోంది.

Pages