S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/22/2018 - 21:43

మామిడి వెంకట లక్ష్మి సమర్పణలో కొంకా ప్రొడక్షన్స్, పిఎస్‌పి ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మేళా’. సూర్యతేజ్, ధన్సిక, సిమ్రాన్, సోని చరిష్టా తదితరులు ప్రధాన తారాగణం. కిరణ్ శ్రీపురం దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను శనివారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో అతిథులుగా పాల్గొన్న నటుడు అలీ, ఎస్.గోపాల్‌రెడ్డిలు విడుదల చేశారు.

04/22/2018 - 21:42

అల్లుడు శీను, జయ జానకి నాయక లాంటి మాస్ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైనమిక్ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సాక్ష్యం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ‘పంచభూతాలే ఈ జగతికి సాక్ష్యం..

04/22/2018 - 21:40

ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసి ఎంసిఏతో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇపుడు మరో భిన్నమైన కథాంశంతో తెరెక్కిన ‘కణం’లో నాగశౌర్యతో కలిసి కనిపించబోతోంది. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో లైకాప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ఎన్.వి.ఆర్ సినిమాస్ సమర్పణలో నిర్మితమైన కణంఈనెల27న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఎన్.వి.ప్రసాద్ మాట్లాడుతూ- సాయిపల్లవి, నాగశౌర్యలతో చేసిన కణం ఓ ఎమోషనల్ మూవీ.

04/22/2018 - 21:36

ఈమధ్య బాలీవుడ్ బాద్షా కెరీర్ సాఫీగా సాగడం లేదు.. వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న ఆయన ఈసారి సేఫ్ ప్రాజెక్టు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా నటించేది ఎవరో కాదు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్.

04/22/2018 - 21:34

రంగస్థలం మూవీతో సమ్మర్ సీజన్‌ను గ్రాండ్‌గా ప్రారంభించాడు రామ్‌చరణ్. ఆ తర్వాత వచ్చిన మీడియం బడ్జెట్ మూవీ డిజప్పాయింట్ చేసినా.. ఇప్పుడు రిలీజ్ అయిన భరత్ అనే నేను మాత్రం బ్యాంగ్ బ్యాంగ్ వసూళ్లు సాధించడం ఖాయం అయిపోయింది. అయితే ఈనెల 27న రజనీకాంత్ మూవీ కాలాను రిలీజ్‌కు షెడ్యూల్ చేయడంతో మహేష్ మూవీకి వారం రోజులే ఛాన్స్ వుంటుందని అంతా అనుకున్నారు.

04/22/2018 - 21:32

రత్తాలు.. రత్తాలు అంటూ మెగాస్టార్ సరసన ఆడి పాడిన హాట్ భామ లక్ష్మీరాయ్, ఆ తరువాత ఎన్నో ఆశలతో హిందీలో చేసిన జూలీ భారీ పరాజయం పాలవడంతో ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. ఆ సినిమా తరువాత ఇప్పటిదాకా కనీసం ఒక్క సినిమాలో కూడా నటించడంలేదు. అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి ఈ అమ్మడు షికార్లు చేస్తోంది. తాజాగా ఓ బీచ్‌లో టూ పీస్ బికినీ వేసి హాట్ హాట్‌గా ఫోజులివ్వడం..

04/20/2018 - 21:14

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ వద్ద నిరసన తెలిపారు. పవన్‌తోపాటు ఆయన తల్లి, ఆయన సోదరుడు నాగబాబు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ శుక్రవారం ఫిలిం ఛాంబర్‌వద్దకు చేరుకున్నారు. తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ‘మా’ అసోసియేషన్, నిర్మాతల మండలిని పవన్ ప్రశ్నించారు.

04/20/2018 - 21:12

తెలుగులో ‘కాటమరాయుడు, హిందీలో- బెహెన్ హోగీ తెరీ’ చిత్రాల్లో కనిపించిన శ్రుతి ఆ తరువాత చాలారోజులుగా ఏ సినిమాలో నటించలేదు. దానికి కారణాలు ఏవైనప్పటికీ తాజాగా మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేశారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో శ్రుతి నటించబోతున్నారు. ఇందులో శ్రుతికి జోడీగా విద్యుత్ జమ్వాల్ నటించనున్నారు.

04/20/2018 - 21:10

వై .ఎస్.రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్రను వెండితెరపై ఆవిష్కరించడానికి దర్శకుడు మహి వి.రాఘవ్ సన్నాహాలు చేస్తున్నాడు. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన పాదయాత్ర ఆ యాత్ర చూపిన ప్రభావం, ఆయనకి విజయాన్ని అందించిన తీరు ఈ సినిమాలో చూపించనున్నారట. అందువలన ఈ సినిమాకి ‘యాత్ర’ అనే టైటిల్‌ను ఖరారుచేశారు. ఈ సినిమాలో ముఖ్యమైన రాజశేఖర్‌రెడ్డిగారి పాత్రకి రాజశేఖర మలయాళ స్టార్ హీరో మమ్ముట్టిని ఎంపిక చేసుకున్నారు.

04/20/2018 - 21:08

తెలుగు సినిమా మళ్లీ వెనక్కి వెళుతుంది.. 1980 నేపథ్యంలో.. అంతకుముందుతరం సినిమాలు తెరకెక్కుతున్నాయి. తాజాగా సంచలన విజయం అందుకున్న ‘రంగస్థలం’ సినిమా కూడా 80 నేపథ్యంలో రూపొందింది కావడం విశేషం. తాజాగా ప్రేక్షకులు భిన్నత్వం ఫీలవ్వగల కథలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం తన 28వ సినిమాను సుధీర్‌వర్మ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.

Pages