S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/23/2018 - 22:26

ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న మహేష్‌బాబు, తన సినిమాల విషయంలో వేగం పెంచాడు. ఇప్పటికే ఆయన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో కమిట్ అయిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ఈ సినిమాకు సన్నాహాలు జరిగాయి. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన 26వ చిత్రాన్ని క్రేజీ దర్శకుడు సుకుమార్‌తో చేయడానికి సిద్ధమయ్యాడు.

04/23/2018 - 22:24

ఆకాష్ పూరి, నేహా జంటగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రంలోని రెండో పాటను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్ మాట్లాడుతూ- టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలై మంచి సంచలనం రేపింది. అనూహ్యమైన స్పందన వస్తోంది. తాజాగా రెండో పాటను విడుదల చేస్తున్నాం. సందీప్ చౌతా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.

04/23/2018 - 22:22

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో శిరీషాశ్రీ్ధర్ లగడపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 4న సినిమా విడుదలవుతుంది. ఆదివారం మిలటరీ మాధవరం జెడ్‌పి హైస్కూల్‌లో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. బిగ్ సీడీని నాగబాబు విడుదలచేశారు.

04/23/2018 - 22:20

నాగశౌర్య, బేబి షామిలి జంటగా, సుందర్ సూర్య దర్శకత్వంలో స్వాజిత్ మూవీస్ బ్యానర్‌పై కె.ఆర్. మరియు రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అమ్మమ్మగారిల్లు’. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- టైటిల్ చూడగానే నాకు మా అమ్మమ్మగారి ఊరు గుర్తొచ్చింది. వేసవి సెలవులకు అక్కడే ఎంజాయ్ చేసేవాళ్లం.

04/23/2018 - 22:18

ఆది, ఆశే్లష జంటగా ప్రభాకర్ యిప్ప దర్శకత్వంలో వెరీగుడ్ సినీ స్కూల్ బ్యానర్‌పై రవికుమార్ గంజి నిర్మించిన ‘సహచరుడు’ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- చిన్న సినిమాలు విజయం సాధిస్తే పెద్ద సినిమాలు అవుతాయి. దర్శకుడు ప్రభాకర్ మంచి టాలెంట్ వున్న వ్యక్తి.

04/23/2018 - 22:17

మలయాళంలో హీరోయిన్‌గా పరిచయం అయిన సాయిపల్లవి ఆ తరువాత తెలుగులో ‘్ఫదా’తో తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది. ఆ చిత్రంతో ఆమె అందుకున్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. సాయిపల్లవి అంటే ఏ పాత్ర అయినా చేయగలదని నిరూపించుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘కణం’. నాగశౌర్య హీరోగా విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన కణం చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా సాయి పల్లవి చెప్పిన విశేషాలు...

04/23/2018 - 22:16

టెల్‌మి బాస్ పిక్చర్స్ పతాకంపై శ్రీచక్ర మల్లికార్జున స్వీయ దర్శకత్వంలో కుమార్‌రాజా, ప్రియా చౌదరి, ప్రియాంకా శర్మ ముఖ్యపాత్రల్లో తెరకెక్కుతున్న కుమార్‌రాజా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్‌కందుకూరి క్లాప్‌నివ్వగా, దర్శకుడు ఎన్.శంకర్ స్విచ్చాన్ చేశాడు.

04/23/2018 - 22:15

ప్రస్తుతం సినీ పరిశ్రమను వేధిస్తున్న సమస్య కాస్టింగ్ కౌచ్. నటీమణులను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్న విషయంపై పలువురు నటీమణులు బహిరంగంగా ఈ విషయాలపై స్పందించడంతో రచ్చ మొదలైంది. ఒక్క తెలుగులోనే కాకుండా ప్రపంచంలో అన్ని భాషల పరిశ్రమలో ఈ తరహా వేధింపులు ఉన్నాయని ఇప్పటికే చాలామంది తెలియజేశారు. తాజాగా టాలీవుడ్‌లో శ్రీరెడ్డి వ్యవహారంతో మరోసారి ఈ వ్యవహారం సంచలనంగా మారింది.

04/22/2018 - 21:47

నేల టిక్కెట్టులో
రవితేజ

04/22/2018 - 21:45

రాఘవ్, కరోణ్య కత్రిన్‌ను హీరో హీరోయిన్లుగా నంది క్రియేషన్స్ పతాకంపై కె.ఎం.డి రఫీ, రెడ్డెం రాఘవేంద్రరెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బంగారి బాలరాజు’. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయింది.

Pages